సంక్రాంతి రోజున ఈ పనులు చేస్తే సకల సంపదలు మీ సొంతం...! Significance Of Makara Sankranti Festival - Sankranti
మకర సంక్రాంతి' సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే పుణ్యదినం. ఈ పండుగకు ఇంటికి ధనధాన్య రాశులు చేరతాయి. పౌష్యలక్ష్మితో కళకళలాడే గృహ ప్రాంగణాలతో,ఇల్లిల్లూ ఒక కొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది.
మకర సంక్రాంతి' సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే పుణ్యదినం. ఈ పండుగకు ఇంటికి ధనధాన్య రాశులు చేరతాయి. పౌష్యలక్ష్మితో కళకళలాడే గృహ ప్రాంగణాలతో,ఇల్లిల్లూ ఒక కొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది.
ఈ సంక్రాంతిలో "సం" అంటే మిక్కిలి "క్రాంతి" అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని "సంక్రాంతి" గా పెద్దలు వివరణ చెబుతూ "మకరం" అంటే! మొసలి. ఇది పట్టుకుంటే వదలదు అని మనకు తెలుసు. కాని మానవుని యొక్క ఆధ్యాత్మిక మార్గానికి అడుగడుగునా అడ్డుతగులుతూ, మొక్షమార్గానికి అనర్హుని చేయుటలో ఇది అందవేసినచేయి! అందువల్ల ఈ "మకర సంక్రమణం" పుణ్యదినాలలో దీని బారినుండి తప్పించుకునేందుకు ఒకటేమార్గం అది ఎవరికి వారు యధాశక్తి 'లేదు' అనకుండా దానధర్మాలు చేయుటయే మంచిదని, పెద్దలు చెబుతూ ఉంటారు.
ముందుగా ఏయే పనులు చేయాలో తెలుసుకుందాం..
సూర్యోదయానికి ముందే.. సంక్రాంతి పండుగ రోజున సూర్యోదయానికి ముందు నిద్ర లేవాలి. స్నానం కూడా సూర్యోదయానికి ముందే పూర్తి చేయాలి. అలాగే మీ ఇంటి శుభ్రం చేసుకోవాలి. మీ ఇంటి గుమ్మానికి పసుపు, కుంకుమ, తోరణాలు కట్టాలి. మీ ఇంటి బయట రంగు రంగుల ముగ్గులను వేయాలి. అలాగే పూజా మందిరంలో ముగ్గులతో అలకరించుకోవాలి.
దేవుడికి నైవేద్యంగా..
ఆ పండుగ పర్వదినాన కొత్త బట్టలను ధరించాలి. అలాగే చక్కెర పొంగలి, గారెలు, బూరెలు, పండ్లను దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. అనంతరం సూర్యభగవానుడిని, మీ తల్లిదండ్రులను ప్రార్థించుకుంటే మోక్షం కలుగుతుంది. మీకు సుఖ సంతోషాలు కూడా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
దాన ధర్మాలు..
సంక్రాంతి పండుగ రోజున తెల్లవారు జామునే హరిదాసు హరినామ సంకీర్తనలు, సాతాని జియ్యర్లు, జంగపు దేవరలు, బుడబుక్కల దొరలు, పంబలవాండ్లు, బైనాయుడులు, గంగిరెద్దుల వాళ్లు ఇంటింటికీ తిరుగుతుంటారు. వారు ఆరోజు ఉదయం నుండే భక్తి పాటలు పాడుతూ ఏడేడు జన్మలలో మన ఇంట్లో ఉండే పెద్దలకు పుణ్య లోకాలు ప్రాప్తించాలని దీవెనలు ఇస్తుంటారు. అలాంటి వారికి మీరు మీకు తోచిన సాయం లేదా దాన ధర్మాలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు దారిద్య్ర బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతారు.
సకల సంపదల కోసం..
సంక్రాంతి పండుగ రోజున సకల సంపదల కోసం స్త్రీలు పూలు, పసుపు, కుంకుమ, పండ్ల వంటి వాటిని దానం చేయాలి. దీంతో సకల సంపదలతో పాటు దీర్ఘ సుమంగళి ప్రాప్తం లభిస్తాయని చాలా మంది హిందువుల నమ్మకం.
అల్లుళ్లకు.. ఆడపడుచులకు..
మకర సంక్రాంతి పండుగ రోజు అల్లుళ్లను, ఆడపడుచులను ఇంటికి ఆహ్వానించాలి. వారికి కొత్త బట్టలు పెట్టడం అనేది మన హిందూవుల సంప్రదాయం.
గాలిలో పతంగులు..
ఈ పండుగ రోజున ఉన్న మరో ముఖ్యమైన సంప్రదాయం ఏంటంటే పతంగులను గాలిలోకి ఎగరవేయటం. ఈరోజులో ఎక్కువ సేపు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి గాలి పటాలను ఎగురవేస్తూ సంక్రాంతి సంబరాలను సంతోషంగా జరుపుకోవడమే ఈ పండుగ యొక్క ప్రత్యేకత.
ఏయే పనులు చేయకూడదంటే..
చెట్లను కొట్టకూడదు..
సంక్రాంతి పండుగ అంటేనే పంట చేతికొచ్చిన కాలం. ఈరోజున ఏ ఒక్కరు కూడా చెట్లను కొట్టడం లేదా నరకడం వంటివి అస్సలు చేయకూడదు. హిందూ మతంలో చెట్లను చాలా పవిత్రంగా భావించడమే కాకుండా వాటిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. చాలా చెట్లు కొన్ని దేవతలకు ప్రతీక అని కూడా నమ్ముతారు.
చుక్క.. ముక్క.. తీసుకోవద్దు..
మకర సంక్రాంతి పండుగ పవిత్రమైనది కాబట్టి. ఆరోజు చాలా పవిత్రంగా ఉండాలి. ఆరోజున ఎట్టి పరిస్థితిలో మందు(చుక్క)ను ముట్టుకోకూడదు. అలాగే మాంసం ( ముక్క) జోలికి కూడా వెళ్లకూడదు. సిగరెట్లు కూడా తాగకూడదు.
అసభ్యంగా ప్రవర్తించకూడదు..
ఈ పండుగ రోజు ప్రతికూల ఆలోచనలు చేయకూడదు. అలానే సంక్రాంతి రోజున పెద్దవారిని నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఒకవేళ పెద్దవారిని నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందట. అంతే కాదు ఎట్టి పరిస్థితుల్లో ఎవరితోనూ వాదనకు దిగకండి. ముఖ్యంగా పెద్ద వారితో సఖ్యతగా మెలగాలి. పండుగ రోజున ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చితే అది ఎంతో పుణ్య ఫలం అని పండితులు చెప్తున్నారు. ఎవరితోనూ అసభ్యంగా మాట్లాడకూడదు. ఈరోజున చెడు మాటలు మాట్లాడితే సూర్యదేవుడు అస్సలు క్షమించడట. అందుకే ఈరోజంతా అందరితోనూ మంచిగా మాట్లాడండి. మంచిగా ప్రవర్తించండి.. కనుక వీటిని అనుసరించండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి.
Famous Posts:
> సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు
> ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు
> ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే
> అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
> 100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
> అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం
> ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే
> గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?
> శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి
సంక్రాంతి, Makar Sankranti, మకర సంక్రమణం, sankranti danalu in telugu, sankranti gurinchi, about bhogi in telugu, sankranti importance in telugu
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment