భార్యాభర్తలు ఇద్దరూ ఒక హోటల్లో కూర్చోని టిఫిను తింటున్నారు......భార్య భర్తను ఇలా అడిగింది | The wife asked her husband.
భార్యాభర్తలు ఇద్దరూ ఒక హోటల్లో కూర్చోని
టిఫిను తింటున్నారు......భార్య భర్తను ఇలా
అడిగింది.
Also Read : భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం
" ఏమండీ! మిమ్మల్ని ఒక విషయం అడగనా? "
భర్త; అడుగు....దానికి పెర్మిషను అవసరమా?
భార్య; అదేంలేదండీ ఒక నెల నుంచి మీరు ఆఫీసునుండి లేటుగా రాకుండా
మమ్మల్ని తరచుగా బయటికి తీసుకుని వెళ్తూ.... పిల్లలతో
హోం వర్కు చేయిస్తూ.......వారితో గడుపుతూ......నాతో చాలా
ప్రేమగా ఉంటున్నారు.కారణం ఏంటో తెలుసుకుందామని.....అంటూ
కాస్త భయంగానే అడిగింది.
భర్త; అదేంలేదే! నేను మామూలుగానే ముందులాగానే ఉన్నానే!
నీకెందుకు అలా అనిపిస్తోందో అర్థం కావడం లేదు మరి.
భార్య; నిజం చెప్పండి. మీ మొహంలో తేడా కనిపిస్తోంది. కొంపతీసి
చిన్న ఇల్లు కానీ పెట్టలేదుకదా!
భర్త; అమ్మొయ్......నీకు దండం పెడతానే అలాంటి ఆలోచనకూడా రానివ్వకు.
భార్య; అయితే నాకు నిజం తెలిసి తీరాల్సిందే! చెప్పండి.
భర్త; విషయం ఉంది కానీ నువ్వు అనుకున్నట్లు కాదు......
అంటూ తన డైరీ నుంచి ఒక ఉత్తరాన్ని తీసి భార్య చేతిలో పెట్టాడు.
ఆ ఉత్తరాన్ని వణుకుతున్న చేతులతో తెరిచి చదవసాగింది భార్య.
ఆ ఉత్తరం తన అత్తగారు కొడుకుకు వ్రాసిన ఉత్తరం.....కన్నీళ్ళు నిండిన
కళ్ళతో చదవసాగింది.
ప్రియమైన కుమారునికి......
ఎప్పుడో ఒకరోజు ఈ ఉత్తరం నీ చేతికి దొరుకుతుందని ఆశతో వ్రాస్తున్నాను.
కాస్త ఓపిగ్గా పూర్తిగా ఈ ఉత్తరాన్ని చదువు చిన్నా! ఈ తల్లి మనసును
అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను......
మీ నాన్న ను పెళ్ళి చేసుకునేదానికి ముందు నేనో లెక్చరరుని.....పెళ్ళైన
తరువాత నువ్వు పుట్టావు...మీ నాన్నకు అదృష్టం కలిసి వచ్చింది.
బాగా సంపాదించసాగారు. నీకో చెల్లి పుట్టాక నేను ఉద్యోగం చేయడం
మానేసాను.మీ నాన్న చాలా బిజీ అయ్యారు.
వివాహం అయిన ఒక్క సంవత్సరం ఎలాంటి బాధలేకుండా ఉన్నది.
తరువాత అన్నీ ఎదురుచూపులే!
మీ నాన్నకోసం ఎదురుచూపులు......ఆయనకు ఆదాయంపై మోజుతో
సమయానికి ఇంటికి రారు. మీరే నాకు దిక్కు......మీతోనే నా సంతోషం.
ఉదయం లేవగానే మీరు తయారై స్కూలుకు వెళ్తారు......
మీ రాక కోసం ఎదురుచూపు.........
ఇలా మీరు పెద్దవారైపోయారు.......నాతో మాట్లాడటానికి కూడా
సమయం ఉండేది కాదు...అవసరానికో మాట అంతే,,,,,,
ఉద్యోగాలు వచ్చేశాయి మీకు.......మీ హడావిడి మీది... పిల్లలైనా
నాతో మాట్లాడుతారేమో అని ఎదురుచూపు.........
మీరు తిరిగి ఇంటికి వచ్చేదాకా ఎదురుచూపు........రాగానే అలసిపోయి
భోంచేసి పడుకుంటారు......వంట బాగుందనికానీ బాగలేదనికానీ
చెప్పడానికి కూడా మీకు టైం ఉండదు.....
Also Read : భార్య, భర్తల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు ఈ స్తోత్రం పఠించండి.
.నువ్వుకూడా బిజీ అయిపోయావు.
నీ చెల్లెలికి పెళ్ళి చేశాము......తను హాయిగా విదేశాలకు వె్ళ్ళిపోయింది.
ఆమె సంసారం ఆమె జీవితం.......వారానికి ఒకసారి 2 నిమిషాలు
మాత్రమే పోనులో మాట్లాడేది......ఆమె ఫోనుకోసం ఎదురుచూపు......
మీ నాన్నకు ఆరోగ్యం పాడై ఇంట్లో ఉంటే ఆయనకు సమయానికి ఆహారాన్ని
అందివ్వడానికి........మాత్రలు అందించడానికి ఎదురుచూస్తూ గడిపేదాన్ని.
చూశావా నా బ్రతుకంతా ఎదురుచూపులోనే ముగిసిపోయింది.
నీకు భార్య......కూతురు , కొడుకు వున్నారు. బ్రతికి ఉన్నప్పుడు
చెప్పలేకపోయాను......చనిపోయేముందు ఈ ఉత్తరం వ్రాస్తున్నాను.
మీ నాన్న గారు ఆరోగ్యం బాగలేకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా
మాత్రలు ఇస్తావా.......అన్నం పెడతావా.......అవసరానికో మాట అంతే
పేపరు చదవడానికి టైం ఉంటుంది....నాతో మాట్లాడటానికి టైం
ఉండదు మీ నాన్నకు....మీ సంగతి సరే సరి....
వయస్సులో సంపాదన మోజులో పడి నాతో ,మాట్లాడటానికే టైం లేదు మీ నాన్నగారికి.......ఇక ఈ వయస్సులో మాట్లాడటానికి ఏముంటుంది?
ఎదురుచూపు..........ఎదురుచూపు.........ఎదురుచూపు......
ఇప్పుడు చావుకోసం ఎదురుచూపు........
నాలా నీ కూతురో .కొడుకో ఇలా ఉత్తరం వ్రాయకూడదనే ఉద్దేశ్యంతో
ఈ ఉత్తరం వ్రాస్తున్నాను...
ఇంట్లో ఉండే ఆడవారికి కూడా మనసు ఉంటుందని....మనకోసమే
బ్రతుకుకుందనీ గ్రహించు........నేను ఎదురుచూసినట్లు నీ భార్యను
బాధపెట్టవద్దు......మనసువిప్పి తనతో అన్నింటినీ షేర్ చేసుకో!
నిన్ను నమ్ముకుని నీవే లోకంగా వచ్చిన నీ భార్యతో.......నీ పిల్లలతో కొద్ది గంటలైనా గడుపు......ధనార్జనతో వారిని నిర్లక్షం చేయకు........ఇదే
నా చివరి కోరిక....కోడలు........మనవడు......మనవరాలు జాగ్రత్త......
నా పరిస్థితి నాకోడలికి రాకుండా చూసుకో! తనకూ ఒకమనసు ఉంటుందనీ
అందులో మీరే ఉంటారనీ.....తననేశ్రద్ధగా చూసుకోవాలని ప్రేమను అందించాలని కోరుకుంటుందనీ అర్థం చేసుకో! మనిషిగా ముందు గుర్తించు
యాంత్రికంగా జీవించి నాలా బాధపడుతూ ఎదురుచూపులతో కాలాన్ని
వెళ్ళదీయనీయకు.........నీవు ఎప్పూడూ సంతోషంగా ఉండాలనే
ఈ తల్లి కోరుకుంటుంది..........ఉంటాను.
Also Read : పెళ్ళికాని మగవారికి అద్భుతమైన పరిష్కారం
ఇట్లు
మీ మంచికోసమే ఎదురుచూసే నీ తల్లి,.
దయచేసి మీ కుటుంబంతో గడపండి......వారి మనస్సును బ్రతికి ఉన్నప్పుడే
గెలుచుకోండి........యాంత్రిక జీవనానికి అలవాటు పడకండి..మీ సంసారమే
మీకు అన్నింట్లో తోడుంటారని మరువ వద్దని ప్రార్థన..
Famous Posts:
> ఈ ఆరు దోషపు అలవాట్లను వదిలితేనే అభ్యున్నతి
> కాశీలోని చాలా మంది కి తెలియని కొన్ని వింతలు..
> ఆలయం గర్భగుడిలోకి ఎందుకు ప్రవేశించరాదు
> ఈ ఆరు దోషపు అలవాట్లను వదిలితేనే అభ్యున్నతి
> వత్తులు ప్రాముఖ్యత - దీపారాధన విధానం - దిక్కుల ఫలితములు
> ఇది మహా శివుడిని స్మరించే గొప్ప మంత్రం..
> మహా మృత్యుంజయ మంత్రం మీ కోరికలను ఎలా నెరవేర్చగలదో తెలుసా?
> మన జీవితం లో జరిగేవి - జరగనివి
marrying, relationship, marriage and children, second child syndrome marriage, who comes first spouse or children, balancing marriage and family, parenting and marriage issues, relationship with husband after baby, balancing a relationship and child, wife, husband, relation, children.
Comments
Post a Comment