ఏదైనా మంత్రం ఉపదేశం తీసుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు నియమాలు - Which is the correct way for Mantra Upasana? Dharma Sandehalu
ఏదైనా మంత్రం ఉపదేశం తీసుకుంటే అది సరైన ఫలితాలు ఇవ్వాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు నియమాలు:-
ఈ నియమాలు *మంత్రమహోదధీ* లాంటి అనేక గ్రంధాలను పరిశీలించి సంకలనపరచినవి .
👉 గురుధ్యానం:-
ముందుగా గురువును ధ్యానం చేయడం చాలా అవసరం.
గురు మంత్రం:-
సహస్రదళ కమలకణికామధ్యస్థితం శ్వేతవర్ణం* *ద్విభుజం వరాభయకరం శ్వేత మావ్యాను లేపనం* *స్వప్రకాశరూపం స్వవామాస్థితమ్ సురక్త శతుక్త్యాం* *స్వప్రకాశరూపయాసహితం శ్రీ గురుం
ధ్యాయేత్* !!
అని గురువుకి నమస్కారం చేయాలి .
👉 మంత్రస్నానం:-
స్నానం వైదిక నియమానుసారం చేయాలి. అంటే *అద్యేత్యాది శ్రౌతస్మార్త కర్మానుష్ఠాన సిద్ద్యర్థం ప్రాతః స్నానమహంకరిష్యే* అని సంకల్పం చేబుతూ *ఇమం మే గంగే యమనే సరస్వతిం* అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ స్నానం చేయాలి . సూర్య మండలం వైపు తిరిగి !!
*ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధుకావేరీ జలేస్మిన్ సన్నిధింకురు* !!
అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ శిరస్సు మీద నీటిని చల్లవలెను.
👉 ద్వారాపూజ:-
జపం చేసే గదికి ప్రవేశ ద్వారం దగ్గర *అస్ర్తాయఫట్* అనే మంత్రం ద్వారా జలం ఆభిమంత్రించి ద్వారాన్ని కడిగి దానిపై గణపతిపూజ చేయాలి. ద్వారానికి కుడీ ఎడమలలో ఈ కింది విధంగా పూజ జరపాలి .
ఎడమవైపు:-
1. సరస్వతి - ఓం సరస్వత్యై నమః .
2. క్షేత్ర పాలకుడు - ఓం క్షత్రపాలాయ నమః
3. సింధు - ఓం సింధవే నమః
4. యమునా - ఓం యమునాయ నమః
5. విధాతా - ఓం విధాతాయ నమః
6. పద్మనిధి - ఓం పద్మనిధయే నమః
7. ద్వారపాలకుడు - ఓం ధ్వారపాలకాయ నమః
కుడివైపు:-
మహాలక్ష్మి - ఓం మహాలక్ష్మై నమః
గంగా - ఓం గంగాయ నమః
యమునా - ఓం యమునాయ నమః
దాతా - ఓం ధాతాయ నమః
శంఖనిధి - ఓం శంఖనిధయే నమః
ఇప్పుడు దేవతారాధన:-
గదిలోకి వెళ్ళిన తర్వాత గణపతి , గురువు , ఇష్టదేవతలకు నమస్కారం చేసి ప్రార్ధించాలి .
ముఖ్యమైంది మాతృకా న్యాసం:-
జపం ఫలించాలి అంటే మాతృకాన్యాసం చేసి తీరాల్సిందే లేకపోతే జపం ఫలితం సిద్దించదని తంత్ర శాస్త్రం చెబుతోంది. జపం ప్రారంభం చేయక ముందే ఈ న్యాసం చేయాలి .
కొన్ని తంత్ర గ్రంథాల ప్రకారం మాతృకాన్యాస విధంగా:-
ఓం అం నమః - లలాటే .
ఓం ఆం నమః - ముఖం
ఓం ఇం నమః - దక్షిణనేత్రే
ఓం ఈం నమః - వామనేత్రే
ఓం ఉం నమః - దక్షిణకర్ణే
ఓం ఊం నమః - వామకర్ణే
ఓం ఋం నమః - దక్షిణనాసాయాం
ఓం ౠం నమః - వామనాసాయాం
ఓం ౢం నమః - దక్షిణగండే ఓం ౣం నమః - వామగంఢే
ఓం ఎం నమః - ఊర్థ్వోష్టే
ఓం ఐం నమః - అధరోష్టే
ఓం ఓం నమః - ఊర్థ్వదంతపంక్తీ
ఓం ఔం నమః - అదోదంతపంక్తీ
ఓం అం నమః - మూర్థ్ని
ఓం అః నమః - ముఖే
ఓం కం నమః - దక్షిణ బాహుములే
ఓం ఖం నమః - దక్షిణ మణిబంధే
ఓం గం నమః - దక్షిణ మణిబంధే
ఓం ఘం నమః - దక్షిణ హాస్తాంగుళిమూలే
ఓం ఞం నమః - దక్షిణ హాస్తాంగుళ్యగ్రే
ఓం చం నమః - వామ బాహుమూలే
ఓం ఛం నమః - వామ కుర్పరే
ఓం జం నమః - వామ మణిబంధే
ఓం ఝం నమః - వామ హాస్తాంగుళిమూలే
ఓం ఞ నమః - వామ హాస్తాంగుళ్యగ్రే
ఓం టం నమః - దక్షిణ పాదమూలే
ఓం ఠం నమః - దక్షిణ జానుని
ఓం డం నమః - దక్షిణ గుల్ఫే
ఓం ఢం నమః - దక్షిణ పాదాంగిళిమూలే
ఓం ణం నమః - దక్షిణ పాదాంగుళ్యగ్రే
ఓం తం నమః - వామ పాదమూలే
ఓం థం నమః - వామ జానుని
ఓం దం నమః - వామ గుల్ఫే
ఓం ధం నమః - వామ పాదాంగిళీమూలే
ఓం నం నమః - వామ పాదాంగుళ్యగ్రే
ఓం పం నమః -
ఓం ఫం నమః -
ఓం బం నమః -
ఓం భం నమః -
ఓం మం నమః -
ఓం యం త్వగాత్మనేనమః - హృది
ఓం రం అసృగాత్మనే నమః - దక్షాంసే
ఓం లం మాంసాత్మనే నమః - కకుది
ఓం వం వేదాత్మనే నమః - వామాంసే
ఓం శం అస్తయాత్మనే నమః - హృదయాది దక్షిణహాస్తాంతం
ఓం షం దుజ్జాత్మనేన నమః - హృదయాది వామహాస్తాంతం
ఓం సం శుకాత్మనే నమః - హృదయాది దక్షిణపాదాంతం
ఓం హాం ఆత్మనేనమః - హృదయాది వామపాదాంతం
ఓం క్షం ప్రాణాత్మనే నమః - ముఖే .
ఇప్పుడు ఉపదేశం తీసుకున్నాక మంత్రం జపించడానికి నియమాలు:-
👉 మంచి ఫలితాలు రావడానికి మానసికంగా జపం చేయాలి ,
👉 ఆసనం లేకుండా కూర్చోకూడదు .
👉 తిరుగుతూ జపం చేయకూడదు .
👉 భోజనం చేసేటప్పుడు చేయకూడదు .
👉 దుఃఖంతోను , చింతతోను , భ్రాంతితోను , ఆకలితోను ఉండే సమయం లో జపం చేయకూడదు .
👉 కాళ్ళు చాపి చేయకూడదు .
👉 యజ్ఞం కోసం ఉంచిన కర్రలు , మట్టి , రాయి , వీటిపై కూర్చుని చేయకూడదు.
👉 పడకమీద కానీ , సవారీ మీద కానీ కూర్చుని చేయకూడదు.
👉 మానసిక జపం చేయడానికి శుద్ది , అశుద్ది గొడవలేదు . ఏ స్థలంలో అయిన చేయవచ్చు . ఎ సమయం లో అయినా చేయవచ్చు .
👉 మల మూత్రాల వేగం ఆపుతూ జపం చేసినా , అపవిత్ర వస్త్రం ధరించి చేసినా , కేశములు కానీ , ముఖముగాని దుర్గంధయుక్తంగా ఉంచుకొని జపం చేసినా ఆయా దేవతలు ఆ జపం చేసిన వారికి అనర్థం చేకూరుస్థారు . ఆందువలన పై విషయాలు గమనించాలి .
👉 గురువుని నిందించడం , గురువు భార్యని వక్ర దృష్టితో చూడటం మహా పాపం .
👉 నిద్రా , బద్దకం , ఆకలి , అలసట , శోకము , క్రోధము , భయం , ద్వేషం, దుర్మార్గపు ఆలోచనలను కలిగి ఉండటం ఇలాంటివి ఏవి జపం చేసే వారికి , జపం చేసే సమయంలో పనికి రావు .
👉 ప్రతీ రోజు ప్రాతః కాలం నుంచి మధ్యాహ్నం వరకు ఏకాగ్రత చెదిరి పోకుండా జపం చేస్తూ జప సంఖ్య ప్రతి రోజూ సమానంగా ఉండేలా చేయాలి .. మనసు ఎంత వరకు ఏకాగ్రతవహించగలదో అంతే చేయాలి .. కొంత మంది తొందరగా జపం సిద్దించాలని ఆ మంత్రాన్ని ఏకాగ్రత లేకుండా ఓ క్రమం లేకుండా రోజంతా పనులు మానుకొని భాద్యతను వదిలి అదే పనిగా జపం చేస్తూ ఉంటారు అది తగదు .. అఖండ జపానికి వేరే నియమాలు ఉంటాయి అని గమనించండి . మనసు ని కష్టపెట్టి చేయకూడదు . అలా చేస్తే నిష్ఫలం అవుతుంది .
👉 జపం ప్రారంభం చేసే ముందు ముఖశుద్ది తప్పకుండా చేయాలి .
అంటే మన నాలుక పై రకరకాల మైల ఉంటుంది . ఆ మైల ఇలా ఉంటుంది .
👉 అసత్య మైల
👉 భోజన మైల
👉 క్రూరమైన మాటలు మాట్లాడుట వల్ల కలిగిన మైల
👉 అసభ్య వచనముల వలన కలిగిన మైల
👉 నిందల వలన కలిగిన మైల
👉 కలహముల మైల
👉 రతిక్రియాదికార్యముల మైల .
👉 దుర్వాసన మైల
👉 తాంబూల మైల
👆 కాబట్టి వీటి నుంచి సాధకుడు శుద్ది చేయాలి . దానికి గాను ఈ విషయాలు జాగ్రత్తగా ఆచరించాలి .
👉 నోటిని శుభ్రం చేయాలి.
👉 ఏ దేవత మంత్ర జపం చేస్తున్నామో , దాని ప్రకారం ఈ క్రింది మంత్రాన్ని కనీసం 10 సార్లు జపించాలి . 27 సార్లు జపం చేస్తే శ్రేష్టం .. 108 సార్లు జపం చేస్తే ఇంకా శ్రేష్టం.
1. విష్ణువు _ ఓం హ్రం .
2. లక్ష్మీ _ ఓం శ్రీం
3 . త్రిపురసుందరి - శ్రీం ఓం , శ్రీం ఓం , శ్రీం ఓం .
4. తార - హ్రీం హూం హ్రీం .
5 . మాతంగి - ఓం ఐం ఓం
6. గణపత - ఓం గం .
7. దుర్గా - ఐం ఐం ఐం
8. శ్యామ - క్రీం క్రీం క్రీం ఓం ఓం ఓం క్రీం క్రీం క్రీం
బగళాముఖి - ఐం హ్రీం ఐం
ధూమావతి - ఓం ఘం ఓం .
మిగిలిన దేవతలకి *ఓంకారం* చేస్తే చాలు ..
*నోట్:-* పళ్ళసందున ఆహారపు తునకలు ఉండకూడదు .
Famous Posts:
> సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?
> కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?
> మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి
> భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?
> మహాభారతం నుండి నేరచుకోవలసిన 12 ముఖ్యమైన విషయాలు.
> భారతీయులు ప్రతి ఒక్కరూ తెలుసుకోదగినవి అద్భుతమైన దేవాలయలు
> ఈ స్తోత్రం ప్రతిరోజూ చదివితే ఆర్ధిక సమస్యలు సమసిపోతాయి
mantras, matra rules, dharma sandehalu telugu, mantra upadesam, mantras basic rules in telugu
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment