ఒడిబియ్యం అంటే ఏమిటి? ఎందుకు పోస్తారు?
ప్రతి మనిషిలో వెన్నెముక లోపల 72 వేల నాడులు వుంటాయి.
ఈనాడులను వెన్నెముకలు రక్షిస్తాయి.
Also Read : స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
ఈనాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం వుంటుంది.
ఇలాంటివి మనిషి శరీరంలో 7 చక్రాలు వుంటాయి. అందులో మణిపూర_చక్రం నాభి దగ్గర వుంటుంది.
ఈ_మణిపూర_చక్రంలో_మధ్యబాగంలో_ఒడ్డియాన_పీఠం_వుంటుంది.
మన అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడ అందుకే ఒడ్డియాణం వాడుకలో వడ్యాణం అంటారు.
ఏడు చక్రాలలో శక్తి(గౌరీదేవి) ఏడు రూపాలలో నిక్షిప్తమవుతుందనేది సిద్దాంతం.
ఒడిబియ్యం_అంటే_అమ్మాయి_ఒడ్యాణపీఠంలో_వున్న_శక్తికి_బియ్యం_సమర్పించడం_అన్నట్టు.
ఒడ్డియాణ_పీఠంలో_వుండే_శక్తి_రూపంపేరు_మహాలక్ష్మి.
ఒడిబియ్యం_అంటే_ఆడపిల్లను_మహాలక్ష్మి_రూపంలో_పూజించటం_అన్నమాట.
అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులా భావించి సత్కారం చేయాలి.
అమ్మలు చిన్నపిల్లలను ఒడిలో పెట్టుకుని కాపాడుకుంటారు.
ఒడి_అంటెనే_రక్షణ.
ఒడిబియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుంది.
వాళ్ళకు తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతారు.
మహాలక్ష్మి మొదటి లక్షణం రక్షించటం.
బిడ్డను_అల్లుడిని_రక్షించమని_తల్లిదండ్రులు_చేసే_మహాలక్ష్మి_వ్రతమే_ఒడిబియ్యం.
ఒడిబియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా పోస్తారు.
ఇవన్నీ తమబిడ్డను అష్ట ఐశ్వర్యాలతో ఉంచాలని తల్లివారు చేసే సంకల్ప పూజ మాత్రమే.
సంతోషంతో ఆ మహాలక్ష్మి(ఆడపడుచు)
తన తల్లిగారి ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని 5 పిడికిల్ల బియ్యం అమ్మవాళ్లకు ఇచ్చి,
దేవుని ప్రార్ధించి, మహాధ్వారానికి నూనె రాసి, పసుపు కుంకుమ బొట్లు పెట్టి అత్తారింటికి వెళుతుంది.
అక్కడ_ఆడాళ్లను_పేరంటానికి_పిలిచి_అమ్మగారిచ్చిన_సారెను_ఐశ్వర్యాన్ని_ఊరంతా_పంచుతుంది.
ఇది అత్తవారు కూడ చేయవచ్చు..
అందుకే ఒడిబియ్యం యొక్క
విలువ,
గౌరవం,
సారాంశం,
తెలుసుకోవాలి అత్యంత నిష్ఠతో చేయాలి...
Famous Posts:
> కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?
> మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి.
> సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం
> మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.
> భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?
> మహాభారతం నుండి నేరచుకోవలసిన 12 ముఖ్యమైన విషయాలు.
> భారతీయులు ప్రతి ఒక్కరూ తెలుసుకోదగినవి అద్భుతమైన దేవాలయలు
ఒడిబియ్యం, వడిబియ్యం, Odi Biyyam Significance, Odi Biyyam, Vadi Biyyam, Dharma Sandehalu,
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment