Drop Down Menus

శ్రీ మహాలక్ష్మి ఎవరి ఇంట నివసిస్తుంది..? Whose house does Sri Mahalakshmi live in?

శ్రీ మహాలక్ష్మి ఎవరి ఇంట నివసిస్తుంది..?

సర్వ సంపదలకు అధినేత్రి అయిన ఆ *శ్రీ మహాలక్ష్మి* యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవరు ఉంటారు.?

Also Readకనక దుర్గమ్మ క్రింద గుహలో ఉగ్రమైన మరో విగ్రహం.

ఆమె దృష్టి మన మీద పడడం కోసం మనం ఎన్నో పూజలు, వ్రతాలూ, నోములు, యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటాము..

కానీ నిజానికి...,

శ్రీ (లక్ష్మి దేవి) యొక్క నివాస స్థానం, 

ఆమె ప్రీతి కొరకు చెయ్యాల్సిన పనులు వంటి వాటి కోసం ఇప్పుడు మనం సూక్ష్మంగా తెలుసుకొందాము..

పూజలు, వ్రతాలూ, నోములు, యజ్ఞయాగాదులు వంటివి చేయలేని వాళ్ళు.....

వాళ్ల జీవన విధానంలో కొద్ది మార్పులు చేసుకోవడం ద్వారా లక్ష్మి అనుగ్రహాన్ని పొందవచ్చు..

అటువంటి విధానాలలో ముఖ్యమైన 15 మార్గాలు మీకోసం..!

1. గడపకు తగిన విలువనివ్వడం..

అంటే.,

సింహ ద్వారం గడప దగ్గర చెప్పులు చిందర వందరగా పదేయకూడదు. 

గడప లక్ష్మి స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావడం, 

గడప మిద కాలు వేయడం, 

గడప మీద కూర్చోవడం, 

గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నుంచోవడం 

వంటి పనులు చేయరాదు. 

పసుపు, కుంకుమ ఉన్న గడపలు లక్ష్మి దేవికి ఆహ్వానం పలుకుతాయి. 

అందువల్ల ప్రతి శుక్రవారం గడపకు పసుపు, కుంకుమతో అలంకరించాలి.

ప్రధాన ద్వారం తలుపు మీద ఎర్రని కుంకుమతో 

స్వస్తిక్ గుర్తు వేస్తే మరీ మంచిదే.

2. వేకువ జామునే లేచి కాలకృత్యాదులు ముగించుకొని, గృహాన్ని శుభ్రపరచి, సూర్యోదయ సమయానికల్లా 

దీప ధూప నైవేద్యాలు సమర్పించి లక్ష్మీ దేవిని కొలిచేవారిపట్ల ఆ దేవి ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటుంది.

3. శుచి, శుభ్రత ఉన్న ఇళ్లు లక్ష్మి దేవికి ఆలవాలం. 

కనుక, ఇంట్లోని పనికిరాని వస్తువులు, 

విరిగి పోయిన, చెడిపోయిన వస్తువులు

ఎప్పటికప్పుడు బయట పారేయాలి.

4. చెడిపోయిన గడియారాలు,

విరిగిపోయిన అద్దాలు,  

చిరిగి, వాడని వస్త్రాలు

ఇంట్లో అస్సలు ఉండకూడదు.

5. ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మి దేవి

ఇంట్లోకి ప్రవేశిస్తుంది.

అందుకే తెల్లవారే వాకిలి ఊడ్చి ముగ్గులు వేసుకోవాలి.

6. ఇంటి ఇల్లాలు ఏడవటం,

గట్టిగ గొంతు పెట్టి మాట్లాడడం,

నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం,

శుచి శుభ్రం లేకుండా ఇల్లంతా కలియ తిరగటం వంటివి చేయకూడదు.

7. ఎక్కడైతే భార్య భర్తలు నిరంతరం కోట్లడుకుంటారో, 

ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటుందో, 

ఆ ఇంట్లో లక్ష్మి దేవి ప్రవెశించదు.

8.  అబద్ధాలు చెప్పేవాళ్ళు, 

ఇరుసంధ్యలలో భుజించేవారు, 

నిద్రించే వారు, 

బద్దకస్తులు ఎక్కడ ఉంటారో, 

అక్కడ లక్ష్మి దేవి అస్సలు ఉండదు.

9. ఇరుసంధ్యలలో దీపారాధన చేసే ఇంట్లో, తల్లిదండ్రులను గురువులను పెద్దలను 

గౌరవ మర్యాదలతో కొలిచే వారి ఇంట లక్ష్మి దేవి 

కొలువై ఉంటుంది.

సాయం సంధ్య వేళల్లో సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసిన మంచిదే.

10. ఉదయ సంధ్యా నియమాలు పాటించేవారు, 

మంగళ శుక్ర వారాలు గుర్తెరిగిన వారు, 

లక్ష్మిని (ధన సంభందితాన్ని) గౌరవించే వారు, 

అపాత్ర దానం చెయ్యని వారు, 

అవసరమెరిగి సమయపాలనలో దానం చేసిన వారు ఆమెకు అత్యంత ప్రీతిపాత్రులు.

11. సత్యవాదులు, ధార్మిక నైతిక ప్రవర్తన ఉన్న వారి పట్ల లక్ష్మి దేవి ప్రసన్నురాలై ఉంటుంది.

12. వెండి, బంగారు వంటి లోహల్లో, 

రత్నాలు, ముత్యాలు లో లక్ష్మి దేవి కొలువై ఉంటుంది.

13. అతిగా మాట్లాడే వారు, 

గురువులను, పెద్దలను అగౌరవ పరిచేవారు, 

జుదరులు, అతి నిద్రాలోలురు, 

అపరిశుభ్రంగా ఉండే వారు ఉన్న చోట 

లక్ష్మి దేవి ఉండలేదు.

Also Readకఠిన సమస్యలని ఊదిపారేసే కనకదుర్గా మంత్రం.

14. ప్రతి శుక్రవారం చక్కగా స్నానాదులు పూర్తిచేసి, 

ఎర్రని వస్త్రాలు, పువ్వులు ధరించి, 

లక్ష్మి పూజ చేసేవారు ఆమె అనుగ్రహం పొందుతారు.

15. చిల్లర పైసలను, పువ్వులను, అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసేవారు ఆమె అనుగ్రహం పొందలేరు.

ఆచరణీయములు అయిన ఈ మార్గాలను అనుసరించి, *శ్రీ లక్ష్మీ దేవి కరుణా కృప కటాక్షాలకు పాత్రులు కాగలరని* ఆశిస్తూ..!

ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః..!!

Famous Posts:

మీ పుట్టిన తేది ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంచితే శుభం 

ఈ రూల్స్ తప్పక పాటించండి 

అప్పులకు స్వస్తి చెప్పే ఐశ్వర్య దీపం.. ఎలా వెలిగించాలి? 

కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?

మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా? 

భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ? 

వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.

శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు

శ్రీ మహాలక్ష్మి, Sri Mahalakshmi, sri mahalakshmi temple, sri mahalakshmi goddess, laxmi devi, lakshmi facts, goddess lakshmi story, goddess lakshmi birth story, goddess lakshmi story.

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments