ఈ పది లక్షణాలు కలిగియున్న వ్యక్తి జీవితంలో అన్నిటినీ జయించినట్టే ! A Person with these two Qualities is Said to have Conquered Everything in Life

‘ధర్మం’ అంటే ఏమిటి?  దానికి కల ఈ పది లక్షణాలు కలిగియున్న వ్యక్తి జీవితంలో అన్నిటినీ జయించినట్టే !

“ధృతి – క్షమ – దమం – అస్తేయం – శౌచం – ఇంద్రియ నిగ్రహం – హ్రీః (సిగ్గు) – విద్య – సత్యం – అక్రోధం”, 

ఈ పది లక్షణాలు కలిగియున్న ధర్మమని శాస్త్రం చెబుతోంది. అంటే;

Also Readప్రతి ఒక్కరు నిత్యజీవితంలో పాటించవలసిన నూరు నియమాలు..

1. మానవుడు ఏదైనా పని ప్రారంభిస్తాడు.

తనకు సంబంధించినది కానివ్వండి, కుటుంబానికి సంబంధించినది కానివ్వండి, సమాజానికి సంబంధించినది కానివ్వండి! ప్రారంభించేటపుడు ఏ సమస్యలు ఉండవు. కాని ప్రారంభించిన కొన్ని రోజులకే నూటొక్క సమస్యలు ప్రారంభమవుతాయి. కువిర్శలు ప్రారంభమౌతాయి. ఎన్నెన్నో అడ్డంకులు కలిగి నిరాశ కల్గుతుంది. 

ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మబలంతో అకుంటిత దీక్షతో ‘ధృతి’ చెడకుండా ముందుకి సాగిపోవాలి. 

‘ఇది ధర్మం’.

2. మనిషి ఏ విషయంలోనైనా, ఏ పనిలోనైనా ఓర్పు కలిగి వుండాలి. క్షమాగుణంతో ఉండాలి. ప్రతిదానినీ ప్రతివారినీ, ప్రతి విషయాన్నీ, క్షమాశక్తితో ఎదుర్కోనాలి. కోపగించుకోకూడదు. ఓర్పుగుణం వున్నవారిని ఏ శక్తులూ ఏమీ చేయలేవు. ‘ఇది ధర్మం’.

3. మనం ఒక పని చేసేటపుడు మన మనస్సు 

సంపూర్ణంగా ఆ విషయంలోనే లగ్నం కావాలి. 

ఒక పనిచేస్తూ మరొక దానిని గురించి ఆలోచించకూడదు.

చదువుతున్నా, వింటున్నా, పని చేస్తున్నా, మాట్లాడుతున్నా, మనస్సును పరిపరిమార్గాలకు పోనివ్వకుండా వుండాలి ‘ఇది ధర్మం’.

4. తనకు తెలియని విషయాలను తాను తెలిసికొనక, పెద్దలు, పూర్వులు, చెప్పినదానిని అంగీకరించక, 

స్వతంత్ర నిర్ణయం తీసుకోనలేక, నిస్తేజంగా నిర్వికారంగా, నిరాశగా, నిర్లిప్తతగా, నియమరాహితుడుగా, ఉండకూడదు. ‘ఇది ధర్మం’.

5. మనిషి ఎల్లపుడూ మనస్సునూ, శరీరాన్నీ, మాటనూ ఆలోచననూ, సంసారాన్నీ, ఇంటినీ, పరిసరాన్నీ, ధరించే వస్త్రాలనూ పరిశుభ్రంగా శుచిగా వుంచుకోవాలి. 

మనసు పరిశుభ్రంగా వుండాలి.. 

మనిషి పరిశుభ్రంగా ఉండాలి. ‘ఇది ధర్మం’.

6. చదువున్నా, సంపదలున్నా, కీర్తివున్నా, బలంవున్నా ఇంద్రియ నిగ్రహం లేనివానికి ఏదో ఒకరోజు పతనం తప్పదు. కాబట్టి మనస్సును దాని ఇష్టానికి దానిని వదలివేయకుండా మన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. ‘మనస్సును గెలిచినవాడు దేవేంద్రుడైనా గెలుస్తాడు’ మనస్సును తమ చెప్పుచేతల్లో ఎవరుంచుకొంటారో 

వారిని భూతప్రేతాలుగాని, దెయ్యాలు గాని, యక్షకిన్నర కిమ్పురుశులుగాని, గ్రహాలు గాని, రోగాలు గాని, కష్టసుఖాలుగానీ, మరణంగానీ, వశంలో వుంటాయి. 

కాబట్టి మనస్సును, మాటను, దృష్టిని, శరీరాన్నీ, 

చేతలనూ అదుపుచేయాలి ‘ఇది ధర్మం’.

7. ప్రతి విషయానికీ సంకోచపడటం, సిగ్గుపడటం, అనుమానపడటం, తనను తాను తక్కువగా భావించటం కూడదు ‘ఇది ధర్మం’.

8. మనిషి సత్యవ్రతం కలిగిఉండాలి. అకారణంగా, అనవసరంగా, ఒకరి మెప్పుకోసం, ఒకరిని మెప్పించటంకోసం, తన పనిని సాధించుకోవటం కోసం, తాను ఏ విధంగానైనా ప్రయోజనం పొందటంకోసం. తనవారిని తృప్తిపెట్టట్టంకోసం అబద్దాలు చెప్పకూడదు. అబద్ధం కలిగిస్తుంది. అబద్ధం అల్పసుఖాన్ని మాత్రమే కల్గిస్తుంది. అబద్ధం మరోకనాటికి అవమానం పాలు చేస్తుంది. అబద్ధం మనిషి విలువను మట్టిచేస్తుంది. 

మన శక్తినీ, మనకీర్తినీ, మన గోప్పదనాన్నీ పాతాళానికి త్రోక్కివేస్తుంది. కాబట్టి సాధ్యమైనంతవరకూ సత్యధర్మాన్ని వదలకూడదు. ‘ఇది ధర్మం’.

9. మానవునికి ఆహరం ఎంత ముఖ్యమో, వివేకం కూడ అంతే ముఖ్యం. వివేకవంతుడు కావాలంటే విద్యావంతుడు కావాలి. శాస్త్రాలు, పురాణాలు ఇతిహాసాలు విన్నంత మాత్రాననే వివేకం సిద్ధించదు. విన్న విషయాలను స్వానుభవానికి మళ్ళించుకోవాలంటే మనిషికి విద్య కావాలి. ‘విద్యావిహీనః పశుః’ అని ఆర్యవాణి. మనిషిగా పుట్టి మట్టిబొమ్మగా జీవిత గడపకూడదు. ఎంతటి పెడతానం పెనవేసుకొనివున్నా, స్థితిగతులు ఎంతటి బాధాకరమై వున్నా,భిక్షమెత్తి అయినా చదువుకోవాలి 

అని ఋషివాక్యం. విద్య ప్రతి వ్యక్తికీ నిర్బంధంగా ఉండాలి. ‘ఇది ధర్మం’.

10. పగ, హింస, కోపం, ప్రతీకార మనస్తత్వం ఇవన్నీ మనిషిని  పతనావస్థకు నేడతాయి. పగ, ప్రతీకారాలు మనిషిని అశాంతికి గురిచేసి అనారోగ్యాన్ని కల్గిస్తాయి. 

తన అభివృద్ధికి తానే ఆటంకంగా నిలవాల్సివస్తుంది. తనను కన్నవారికీ, తాను జన్మనిచ్చిన వారికీ, 

తనను నమ్మి బ్రతికేవారికీ అన్యాయం కల్గుతుంది.

విశేష ధర్మాలు –

సామాన్య ధర్మాలు వస్తే చెప్పవలసిన ధర్మాలు ఎన్నో వున్నాయి. సామాన్య ధర్మాలు అంటే శాస్త్రాలు చెప్పనివి చెప్పనక్కరలేనివి కూడా సామాన్య ధర్మాల క్రిందకే వస్తాయి.

Also Readవెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలి ? ముడుపు అంటే ఏమిటి?

• విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించటం గురుధర్మం!

• భయభక్తులతో విద్యను నేర్చుకోవటం శిష్యధర్మం!

• న్యాయమార్గంగా సంపాదించి సంసారాన్ని పోషించటం యజమాని ధర్మం!

• భర్త సంపాదనను సక్రమంగా పెట్టి గృహాన్నీ నడపటం ధర్మం!

• సైనికుడుగా వుండి దేశాన్ని ప్రజలను కాపాడటం సైనిక ధర్మం!

• వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఆదరించి పోషించటం పుత్రధర్మం!

• తాను జన్మనిచ్చిన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయటం తండ్రి ధర్మం!

• తన ఇంటికీ, తనను కున్నవారికీ పేరు ప్రతిష్ఠలు తేవటం బిడ్డలందరి ధర్మం!

• తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని గౌరవించటం ప్రతివాని ధర్మం!

• తాను సంపాదించినదాన్ని తనవారితో పంచుకొని తినటం సంసార ధర్మం!

• అసహాయులను కాపాడటం మానవతా ధర్మం!

• చెప్పిన మాటను నిలుపుకోవటం సత్య ధర్మం!

• ధర్మసాక్షిగా పెండ్లాడిన భార్యను వదిలివేయకుండా వుండటం వివాహ ధర్మం!

• తన భర్త అందహీనుడైనా, స్థితిపరుడుకాకున్నా, నమ్మివుండటం భార్య ధర్మం!

• నమ్మిన మిత్రునికి అపకారం చేయకుండటం మిత్ర ధర్మం!

• సోమరితనం లేకుండటం పురుష ధర్మం!

Famous Posts:

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

dharmam, short devotional stories with morals, devotional stories for kids, devotional stories about faith, devotional story in telugu, mythological stories in telugu, mythological stories pdf, hindu god stories in telugu, dharma sandehalu

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS