Drop Down Menus

ఆత్మ ఘోష - భార్య గుమ్మం వరకు, కొడుకు కాటి వరకు | Atma Ghosha - Telugu Devotional Stories

ఆత్మ ఘోష..

శాశ్వతంగా నిద్రపోయిన తర్వాత ఎంత గొప్పగా బతికినా శవం అనే అంటారు,

సమయం మించకుండా తీసేయండి అని పెద్దలు అంటున్నారు, 

భార్య గుమ్మం వరకు, కొడుకు కాటి వరకు వచ్చి కర్మ చేసి వెళ్లిపోయారు..

Also Readస్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?

అప్పుడు మొదలు అవుతుంది ఆత్మ ఘోష ...నా భార్య నా పిల్లలు నా ఇల్లు అని గుండెలు బాదుకుంటూ ఆ ఇంటికే వెళ్తాడు. అతను ఎవరికీ కనిపించడు వినిపించడు ఇది నా ఇల్లు నా వస్తువులు నా ఆస్తి అని నిన్నటి వరకు కాపాడుకున్న ఏది నాతో తీసుకుని వెళ్లలేకపోయానే.... వీటి కోసమా జీవితం అంతా కష్టపడ్డాను.. అని ఏడుపు మొదలు అవుతుంది.. 

గుండె పగిలేలా ఏడుస్తున్న భార్యను చూసి ఉన్నన్ని రోజులు ఎదో సాకుతో సాదించాను కాస్త ఓపికగా ప్రేమగా ఉంటే బాగుండేది ఇప్పుడు ఓదార్చే శక్తి కూడా లేదు..అని అప్పుడు అనిపిస్తుంది .

కుటుంబ సభ్యులను చూసుకుని చేసిన పోరాబాట్లు గుర్తు చేసుకొని ఒక్కసారి భగవంతుడు బతికిస్తే అందరికి క్షమాపణ చెప్పుకుని మళ్ళీ నీ దగ్గరకు వస్తాను తండ్రి అని ఆత్మ ఘోషిస్తుంది, 

చిన్న చిన్న తప్పులను క్షమించి అందరితో సంతోషం గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. 

ఎక్కడైతే వదిలేసారో అదే స్మశానానికి తిరిగి వెళ్లి అక్కడ ఒంటరిగా రోదిస్తూ భగవంతుడా అని పిలవ గానే ఓ స్వరం వినిపిస్తుంది నేను నీకు తోడుగా ఇక్కడే ఉన్నాను బయపడకు అని ,ఎవ్వరూ రాని చోటికి ఏ దిక్కు లేని చోట కూడా నీ కోసం శివుడు ఉన్నాడు...  అప్పుడు కనిపిస్తాడు దేవుడు.  

అప్పటివరకు ఆత్మ ఘోషతో రోదిస్తున్న ఆత్మ.. ఏమైయ్యా బతికి ఉండగా ఎన్నిసార్లు పిలిచి ఉంటాను..ఎంత మొక్కి ఉంటాను ఏనాడైన ఇలా వెంటనే పలికావా ఇప్పుడు మటుకు ప్రత్యక్షం అయ్యావు అని అడుగుతుంది ఆత్మ ,

శివయ్య అంటాడు నేను నువ్వు పిలిచిన ప్రతి సారి పలుకుతూనే ఉన్నాను కానీ నువ్వు వినలేక పోయావు.

నువ్వు ఒకసారి పిలిస్తే నేను 108 సార్లు పలుకుతాను అది నీకు వినపడాలి అని..కానీ నువ్వు బతికి ఉన్నంత కాలం నేను నాది అనే మాయలోనే ఉన్నావు.. ఇప్పుడు నీదంటూ ఏమీ లేదు అన్న సత్యాన్ని గ్రహించావు కనుకే నా మాట వినగలిగావు.. స్మశానంలో కూడా నీకు తోడుగా ఉన్న నేను ఎప్పుడూ నీ పక్కనే ఉన్నాను నీ ప్రతి కష్టంలోనూ తొడుగానే ఉన్నాను దాటిస్తూనే ఉన్నాను కానీ అదంతా నువ్వే చేస్తున్నావు అనుకున్నావు కనుక నన్ను గుర్తించలేక పోయావు.......

నువ్వు వచ్చే టప్పుడు నువ్వు పోయే టప్పుడు నీతో వస్తున్నది నీ కర్మ మటుకే ఇంక ఏదీ నీతో రాదు అని శివయ్య చెప్పాక......

Also Readగోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

ఏది శాశ్వతం కాదు అని గ్రహించిన ఆత్మ శాంతించి వెళ్ళిపోతుంది.

ఋణ బంధం ఉన్నంత వరకే ఈ జీవితం.. దేహం తట్టుకునే వరకే ప్రాణం తట్టుకోలేని స్థితిలో దేహం ఉంటే ప్రాణం పోతుంది....ఇంకో కొత్త దేహాన్ని వెతుక్కుంటుంది ప్రాణమే అలా ఉన్నప్పుడు ఇంక ఋణను బంధాలు ఎలా ఉంటాయి!! ఆలోచించండి......

Famous Posts:

ఈ రూల్స్ తప్పక పాటించండి 

కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?

మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా? 

భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ? 

వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.

శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు

శివ గుణాలు లోకానికి సందేశాలు

భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?

ఆత్మ ఘోష, Telugu Devotional stories, devotional stories in telugu, devotional stories for kids, hindu devotional stories, devotional stories in english, short devotional stories with morals, devotional stories in hindi, devotional stories about faith, short devotional stories for youth

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. చనిపోయిన తరువాత ఇలా జరుగుతుంది అని మీరు చెప్పగలరా. ఇది కేవలం ఊహ మాత్రమే

    ReplyDelete

Post a Comment