జాతకం లేని వారికి రావి ఆకు తో పరిహారం - Ravi Aaku Deepam Visishtatha

జాతకం లేని వారికి రావి ఆకు తో పరిహారం:

చాలామంది జాతకం తెలియని వారు వారికి వచ్చే దోషాలను ఎలా తెలుసుకుని తొలగించుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు అలాంటి వారి కోసం ఈ పరిహారాన్ని తెలుపుతున్నాను.

మనలో చాలా మందికి కి పుట్టిన తేదీ, టైము తెలియదు .కానీ ఏ రోజు పుట్టారు అనేది మాత్రం తెలిసి ఉంటుంది అలా తెలిసిన వారికి ఈ పరిహారం చాలా ఉపయోగపడుతుంది.

రావి చెట్టు ప్రపంచ శక్తిని ఎక్కువగా ఆకర్షించ గలిగే శక్తి ఉన్న చెట్టు. ఈ రావి చెట్టు గౌతమ బుద్ధుడికి జ్ఞానాన్ని ఇచ్చిన చెట్టుగా చెప్పబడుతుంది. అంత విలువైన ఈ చెట్టు ఆకు ని మనం దోషాన్ని పోగొట్టుకునే వస్తువుగా వాడభోతున్నాం.

కాల చక్రంలో మొదటి రాశి అయిన మేషరాశి ఒక అగ్ని రాశి. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే పంచభూతాలలో  అగ్ని కి మొదటి స్థానం ఇచ్చి మేష రాశి లో ఉంచారు దానివల్లనే మనకు దోషం తొలగాలంటే ఇంట్లోనూ బయట గుడిలోనూ దీపం పెట్టమని మన పెద్దలు చెబుతారు.  దానివల్లనే ఈ పరిహారానికి రావి ఆకుని ,దీపాన్ని దోషాన్ని తొలగించే వస్తువులుగా ఉపయోగించమని నేను చెబుతున్నాను.

దోషాన్ని తొలగించే విధానం అది ఎలాగంటే..

ఆదివారం పుట్టినవారైతే ఒక రావి ఆకు పైన

సోమవారం పుట్టిన వారైతే రెండు ఆకులపైన

మంగళవారం పుట్టిన వారి అయితే 9 ఆకులపైన

బుధవారం పుట్టినవారైతే ఐదు ఆకులపైన

గురువారం పుట్టిన వారైతే 3 ఆకులపైన

శుక్రవారం పుట్టిన వారి అయితే ఆరు ఆకులు పైన

శనివారం పుట్టిన వారి అయితే 8 ఆకులపైన దీపాన్ని వెలిగించాలి

అది ఎలాగంటే ఏరోజు పుట్టారో ఆరోజు గుర్తుంచుకున్న వారు అన్ని ఆకులు తీకొని వాటి పైన ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో  నెయ్యి పోసి  శివాలయంలో  నంది దగ్గర దీపం పెట్టాలి.

ఇది కాకుండా వారి వారి కులదైవం గుడిలో పురుష రూపం అమావాస్య రోజు సాయంత్రం ,స్త్రీ రూపం పౌర్ణమి రోజు సాయంత్రం పైన చెప్పిన విధంగా రావి ఆకు పైన దీపం వెలిగించడం ద్వారా వారి వారి సమస్యలు త్వరగా తీరుతాయి.

ఈ పరిహారాన్ని జాతకం తెలిసిన వారు కూడా చేసుకోవచ్చు. అందరికీ ఉపయోగపడుతుంది.

ఈ పరిహారాన్ని అందరూ ఉపయోగించుకుని బాగుండాలని కోరుకుంటూ..

Famous Posts:

భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ? 

వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.


శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు


శివ గుణాలు లోకానికి సందేశాలు


భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?


కూతురా కోడలా ఎవరు ప్రధానం...? 


సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?


కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?


మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి 

రావి ఆకు దీపం, Ravi Aaku Deepam, raavi chettu intlo undavacha, రావి చెట్టు ప్రదక్షిణ శ్లోకం, ravi chettu pradakshina mantram in telugu, ravi chettu images, ravi chettu uses, raavi chettu fruits, ravi tree in telugu, 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS