తమలపాకుల పై దీపాన్ని వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు..| Benefits of lighting a lamp on betel leaves

తమలపాకుల పై దీపాన్ని వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు..

తమలపాకులపై దీపాన్ని వెలిగించడం ద్వారా ఏర్పడే శుభ ఫలితాలేంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

తమలపాకుల్లో కాడలో అమ్మలగన్న అమ్మ పార్వతీదేవీ కొలువై వుంటుందని.. తమలపాకు చివర్లో లక్ష్మీదేవి వుంటుందని.. మధ్యలో చదువుల తల్లి సరస్వతీ దేవీ నివాసం వుంటుందని విశ్వాసం. అలాంటి తమలపాకుపై దీపం వెలిగించడం చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

ఎటువంటి వాటిని ఎంచుకోవాలంటే... తాజా తమలపాకులు ఆరింటిని తీసుకోవాలి. ముఖ్యంగా తమలపాకు చివర్లు విరిగిపోకుండా తాజాగా వుండేలా చూసుకోవాలి. చివర్లు లేని తమలపాకులను ఎప్పుడూ పూజకు ఉపయోగించకూడదు. 

అయితే ప్రస్తుతం దీపం కోసం మనం తీసుకునే తమలపాకుల పైకాడను తుంచుకోవాలి. అలా తుంచిన ఆరు ఆకులను నెమలి ఫింఛం వలె పూజగదికి ముందున్న ఓ టేబుల్‌పై సిద్ధం చేసుకోవాలి. దానిపై మట్టి ప్రమిదను వుంచి.. తుంటిన ఆరు తమలపాకు కాడలను మట్టి ప్రమిదలోనే వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి.

అలా నువ్వుల నూనెలో వున్న తమలపాకు కాడల నుంచి మంచి వాసన వస్తుంది. ఈ వాసనను పీల్చడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. సుఖసంతోషాలు చేకూరుతాయి. 

అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇందుకు కారణం తమలపాకు ముగ్గురమ్మలు కొలువై వుండటమేనని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు


ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు


ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే


అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం


అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం


ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

తమలపాకులపై దీపం, దీపారాధన, Betel Leaf Lamp, benefits of lighting diya at home, jaggery deepam benefits, coconut oil lamp benefits, copper diya benefits, betel leaf benefits telugu, 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS