Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ధర్మపురిలో ఉన్న శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం

ధర్మపురిలో ఉన్న శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం

యోగ నృసింహక్షేత్రం 

ధర్మపురి క్షేత్రం సుమారు ఒక వేయి సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగియున్నది. ఈ క్షేత్రములో శ్రీ యోగలక్ష్మీ నృసింహుని ఆలయమం, శ్రీ ఉగ్రలక్ష్మీ నృసింహుని ఆలయంతో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీ వేణు గోపాల స్వామి వార్ల ఆలయములు, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీ రామాలయం, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ సంతోషిమాత ఆలయం వంటి అనేక దేవాలయములు కలిగి దేవాలయాల నగరంగా ప్రసిద్ధి చెందింది.

చరిత్ర 

పది, పదకొండవ శతాబ్దాలలో ధర్మపురమని పేరు కలిగిని ఈ క్షేత్రం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినట్లు తెలుస్తుంది. ఉత్తర తెలంగాణాలోని కరీంనగర్ జిల్లాకు ఉత్తరంగా 65 కిలోమీటర్ల దూరంలో, జగిత్యాలకు 30 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీతీరాన ఈ క్షేత్రరాజం ఉంది. ఇక్కడ గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవహించుచు తన పవిత్రతను చాటుకొనుచున్నది. ఎంతో ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలు, చరిత్ర కలిగిన ఈ క్షేత్రం ప్రాచీన కాలంనుంచి వైదిక విద్యలకు, జ్యోతిశ్శాస్త్రానికి ప్రముఖస్థలముగా పేరొంది నేటికీ సాంప్రదాయ వేదవిద్యలకు నెలవైయున్నది. శాతవాహనులు, బాదామి చాళుఖ్యులు కళ్యాణి చాళుఖ్యులు, కాలంలో ఈ ఆలయం ఉన్నతి స్థితిలో వున్నట్లు తెలుస్తున్నది. నైజామ్ కాలంలో కూడా ఈ ఆలయం మంచి అభివృద్ధి పదంలో వుండేది. క్రీ.శ. 1309లో అల్లాయుద్దిన్‌ఖిల్జి ధర్మపురి ఆలయాల పై దాడి చేసి నాసనం చేశాడని చరిత్ర వల్ల తెలుస్తున్నది.

యోగాసీనుడైన శ్రీ లక్ష్మిసమేత నృసింహ స్వామి స్యయంభూ సాలగ్రామం విగ్రహంలో పద్మాసనుడై కోర మీసాలతో ప్రసన్న వదనంతో దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడే వున్న మరో ఆలయంలో ఉగ్ర రూపుడైన మరో నృసింహస్వామి వారి విగ్రహం కూడవున్నది. ఇక్కడే శ్రీ రామచంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించినట్టు చెప్పబడే శ్రీ రామలింగేశ్వర ఆలయం కూడా ఉంది. ఈ ధర్మ పురిలో అనేక ఇతర పురాతనమైన ఆలయాలు, మందిరాలు కూడా ఉన్నాయి. గోదావరి తీరంలో వున్న అన్ని క్షేత్రాల కంటే ఈ ధర్మ పురి ఆతి పురాతనమైనది ఆధ్యాత్మిక వేత్తల భావన. అనేక ప్రాంతాల నుండి ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది.ధర్మపురి *దేవాలయం*, *గోదావరి* గురించి బయటవారు ఎంత గొప్పగా చేప్పుకొంటరో వారి మాటల్లో...

క్షేత్ర ప్రశస్తి 

స్కాంద పురాణములో ధర్మపురి క్షేత్రమహత్యము వర్ణింపబడియున్నది.పూర్వం బలివర్మ అనే రాజు ఉండేవాడు.అతనికి అల్పాయుష్కుడైన కుమారుడు కలుగగా దర్మయాగం జరిపినందువలన ఆకుర్రవాడు చిరంజీవుడైనాడు.అతడే ధర్మవర్మ, ధర్మయాగం జరిపించిన గ్రామానికి ధర్మపురి అను పేరుపెట్టి, దాన్నే రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని పాలించాడు. పూర్వం బ్రహ్మాది దేవతలు ధర్మవర్మ మహారాజును నృసింహుని గూర్చి తపస్సు చేయవలసినదిగా ప్రేరేపించారు.అతడు తపస్సు చేయగా స్వామి అక్కడ వెలిసారు. ఫాల్గుణ శుద్ధంలో స్వామి కల్యాణం జరుగుతుంది.ధర్మశర్మ, ధర్మవర్మ, ధర్మదాసుగా స్వామిని మూడు జన్మలలో అర్చించిన ధర్మజీవికి ఇది నెలవు. సాధ్వీమణి శ్రీసత్యవతీదేవి ఇక్కడ గోదావరీ తీర్ధమున స్నానమాడి తన్ జీవితేశ్వరుడగు ధర్మాంగద ప్రభువును సర్పరూపమునుండి విముక్తి గావించి సుందర మనిషి రూపము వచ్చునట్లు చేసిందిచ్చటనే. ఆ పతివ్రత తన పాతివ్రత్యమహత్యాన్ని నిరూపించడానికి ఇసుకతో నిర్మించిన స్థంభం ఇప్పటికీ భక్తులకు సత్యనిదర్సనముగాఉన్నది, బ్రహ్మాదిదేవతలు, మహర్షులు, ఋషులు, మునులు మహాభక్తులు ఇచ్చట స్వామిని అర్చించి తరించారు.

దేవాలయాలు 

ధర్మపురిలో ఉన్న శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందిన ఒక పుణ్యక్షేత్రం. ధర్మపురి, చారిత్రాత్మకంగా గొప్ప కవులు, తత్వవేత్తలు, సంగీతం, కళ మరియు నృత్య అలంకరించబడిన మహా పుణ్యక్షేత్రం. తెలంగాణ రాష్ట్రం లో ఉన్నదీ.రాజు ధర్మవర్మ, అది ధర్మరాయ గతంలో ధర్మపురం, ధర్మనపురం, దంమంవురు, ధర్మవురా మరియు ధర్మపురం అని పిలిచేవారు తర్వాత ఇప్పుడు ధర్మపురిగా పిలుస్తారు. ఇది పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్న దేవాలయాలు మరియు కళాకారులకు ప్రసిద్ధి ధర్మపురి క్షేత్రం .దీనిని దక్షిణ కాశీ అని కూడా అంటారు. కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రెండు దేవాలయాలు ఉన్నాయి. 14 వ మరియు 15వ శతాబ్దాలలో బహమనీ మరియు కుతుబ్ షాహీ, వ్యతిరేక హిందూమతం యొక్క తదుపరి దశలో పతనం ఔరంగజేబు ప్రారంభించారు తర్వాత. తన సహచరులను కూడా తన అడుగుజాడల్లో నడిచారు. రుస్తుమ్దిల్ఖాన్ , హైదరాబాద్ సుబేదార్, ఒక లక్ష్మి నరసింహ స్వామి ఆలయం మార్చబడుతుంది. 1448 AD లో, క్రొత్త దేవాలయం మసీదు సమీపంలో అరవై స్తంభాలు నిలబెట్టింది ఎస్ట ఆలయం పాత నరసింహ స్వామి గుడి97 అని పిలుస్తారు. 1725 AD లో, లార్డ్ నరసింహ యొక్క చిహ్నంగా ధర్మపురి గ్రామ సమీపంలో కనుగొనబడింది.

                                                

ధర్మపురి పట్టణం గురించి జగిత్యాల్ నుండి -30 కిమీ మరియు గోదావరి నది బ్యాంక్ సౌత్ సెంట్రల్ రైల్వే కాజీపేట-బల్హర్శ విభాగంనా మంచేరియాల్ రైల్వే స్టేషన్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నది దక్షిణ వాహిని [దక్షిణ ప్రవహించే] గా నది అందువల్ల దక్షిణ ఉత్తర వాహిని అని అంటారు.

ధర్మపురికి పొతే యమపురి ఉండదు అని చెబుతుంటారు.తెలంగాణ రాష్ట్రములో ప్రసిద్ది గాంచిన నరసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం కరీంనగర్ పట్టణ కేంద్రానికి 75 కి మీ దూరంలో ఉంది.

పవిత్ర గోదావరి నది తీరాన వెలసిన శివకేశవుల నిలయమైన ఈ క్షేత్రం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం, శ్రీ రామలింగేస్వరలయం, మసీదులు ప్రక్క ప్రక్కనే ఉన్నాయి అనాది నుంచి శైవ, వైష్ణవ, ముసిలం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచి ఉంది. ఇక్కడ స్వామి వారు యోగానంద నరసింహ స్వామి భక్తుల కోరికలను నేరవేరుస్తున్నాడు.


యమలోకంలో నిత్యం పాపుల్ని శిక్షిస్తూ క్షణం తీరిక లేని యమ ధర్మరాజు ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకొని ఆలయం నివాసం ఎర్పర్చుకున్నట్లు పురాణం గాథలు చెబుతున్నాయి. ఆలయ ద్వారం కుడి వైపున యమ ధర్మరాజు విగ్రహం ఉంటుంది. యమ ధర్మరాజు ని దర్శించుకొని నృసింహుడిని దర్శించుకోవడం ఆనవైతి. పూర్వం ధర్మవర్మ అనే రాజు ధర్మ ప్రవర్తుడై ప్రజలందరినీ ధర్మ మార్గం లో నడిపించి నలుగు పాదముల ధర్మంతో ఈ క్షేత్రాన్ని పరిపలించినందుకు ధర్మపురి పేరు వచ్చింది అని పురాణాలో చేప్పారు.ధర్మపురిలో ఒక ప్రత్యేకత ఉంది అది యమ ధర్మరాజు ఆలయం.

Srinivasa Reddy Somu

Comments