మనిషిని బ్రతికి ఉండగానే చంపేసే రెండు బలమైన ఆయుధాలు ఏమిటో మీకు తెలుసా? Do you know what are the two strongest weapons that can kill a man alive?
మనిషిని బ్రతికి ఉండగానే చంపేసే రెండు బలమైన ఆయుధాలు
1 అనుమానం
2 అవమానం
ఈ రెఁడు ఆయుధాలు దరి చేరినా మనిషి తన ప్రవర్తన తన బాధ ఎదుటి మనిషిలో చూస్తే
ఆ ఆయుధాలతో చావకుండా ఉన్నన్ని రోజులు సంతోషంగా బతకొచ్చు.
1అనుమానం
ఈ ఆయుధం మనల్ని ఎలా చంపుతుందంటే బంధలను మనుషులను ఎవరిని మన దరి చేరనివ్వదు.ఒకవేళ చేరినా వారి ప్రవర్తన ప్రతిదీ అనుమానమే మనకు. ఆ అనుమానం తో వారిని నమ్మలేక వారితో మన ప్రవర్తన పిచ్చి పిచ్చిగా ఉండేలా చేసి. మన నుంచి అందరిని దూరం చేసి ఒంటరిని చేస్తుంది.
మళ్ళా పైపెచ్చు మనం చేసే తప్పు మనకు తెలవకుండా చేస్తుంది.మనల్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదు అని బాధపడుతూ పడుతూ నాకు ఎవరు లేరు ఎవరు లేరు అని మానసికంగా చంపేస్తుంది.
అమ్మ గా చెబుతున్న మన సుఖదుఃఖాలకు కారణం మనమే ఎవ్వరూ అవ్వరు అవ్వలేరు.
ఇప్పుడు చెప్పండి అవసరమా ఆ దిక్కుమాలిన అనుమానం.ఎన్నాళ్లో ఈ జీవితం ఎవరికి ఎరుక ఉన్నన్నాళ్ళు మనవాళ్ళు అనే సంతోషంగా ఉండక. ఒకవేళ ఏదన్నా అనుమానం వస్తే అడిగి క్లారిటీ చేసుకోండి లేదా దూరంగా ఉండండీ.
అంతేగాని అనుమానంతో అందరినీ దూరం చేసుకుంటూ. మళ్ళా పైపెచ్చు నాకు ఎవరు లేరు అర్థం చేసుకోవడం లేదు అని మానసికంగా చచ్చిపోకండి.
ఇంకా 2ది అవమానం
ఇదో క్లిష్టమైన పదం
వృత్తిలోనో,వ్యవస్థలనో,వ్యక్తిగత జీవితంలోనో
ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక క్షణంలో
ప్రతి మనిషి జీవితంలో ఈ పదం ఎదురవుతుంది.
వృత్తిలో దీన్ని సవాలుగా తీసుకొని తన కసిని జోడించి దాన్ని ఎదుర్కొని తిప్పికొట్టి అవమానించిన వారికి సమాధానం చెబుతారు.
కానీ వ్యవస్థలో వ్యక్తిగత జీవితంలో ఆ పదాన్ని ఎదుర్కోలేక అవమానానికి దీటుగా సరైన సమాధానం చెప్పలేక చాలామంది కృంగి కృశించి జీవితంలో కుప్పకూలి పోతున్నారు పాపం.
అవమానమనేది మోయలేని భారం. మనసును దహించి వేస్తుంది. అన్నపానీయాలను ముట్టనీయదు. నిత్యాగ్ని గుండంగా జ్వలిస్తుంది మనసు. ఆ మహోష్ణానికి తాను మాడిపోవడమో, ఎదుటివారు మసికావడమో జరుగుతుంటుంది. సహన గుణం పూర్తిగా క్షీణించి కోపతాపాలకు, ప్రతీకార వాంఛలకు గురవుతుంది మనసు. జీవితాలు అల్లకల్లోలం అవుతాయి.
ఎవరైనా సన్మానాలను, పొగడ్తలను మరచిపోతారేమోగానీ- అవమానాలను మరచిపోలేరు. ఇది మానవ సహజ గుణం.
కానీ వీటిని అధిగమిస్తేనే ప్రగతి!! రారాజు మయసభలో పొందిన అవమానం కురుక్షేత్ర మహా సంగ్రామానికి దారితీసింది.
పసిబిడ్డ పోషణార్థం మిత్రుడైన ద్రుపదరాజును గోవులు అడిగాడు ద్రోణాచార్యుడు. అవమానించాడు ద్రుపదుడు. తలొంచుకున్నాడు ద్రోణుడు. పొందిన అవమానభారం ద్రోణుడి హృదయాన్ని కల్లోలపరచింది. అర్జునుని ధనుర్విద్యా విశారదుడిగా చేసి మహాస్త్రంగా ప్రయోగించాడు. పాండవ మధ్యముడు ద్రుపదుణ్ని ఓడించి, రథానికి కట్టివేసి గురువు పాదాల ముందుంచాడు. అప్పటికికాని శాంతించలేదు ద్రోణుడి హృదయం.
అలాగే అవమాన భారంతో రగిలిపోయిన చాణక్యుడు నందవంశాన్ని నిర్మూలించాడు.
పురాణాల్లో, చరిత్రల్లో కోకొల్లలుగా దర్శనమిస్తాయి ఇటువంటి ఉదాహరణలు. అవమానానికి పగలు, ప్రతీకారాలు జ్వలింపజేసుకుంటూపోతే సహన గుణానికున్న ఔన్నత్యం ఉనికిని కోల్పోతుంది.
ఫ్రెండ్స్ ఒకటి చెప్పనా మనలోని సహన గుణం ఎదుటివారిలోనూ పరివర్తన తెస్తుంది. కారణాలేవైనా అవమానాలను కూడా భరిస్తూ, సహిస్తూ, సాగిపోవడమే ఉత్తమమైన విధానం.
ప్రకృతి అందచందాలకు నిలయం. కార్చిచ్చు దహిస్తుంది. జలవిలయం తుడిచిపెడుతుంది. కానీ తిరిగి చిగురేయడం, పచ్చదనంతో కళకళలాడటం వృక్ష నైజం. బంగారాన్ని అందించే పుడమితల్లి కంపనాలకు గురవుతూనే ఉంటుంది.
అలాగే గౌరవ మర్యాదలకు ఆనందించే
మన మనసు అవమానాల్నీ తట్టుకోగలగాలి.
తిరిగి స్వీయ వైభవాన్ని పొందాలి. అదే సమస్థితి.
చిన్న ఉదాహరణ..
కొండమీది చిన్న గుడిలో ధ్యానం చేసుకుంటూ శిష్యుడితోపాటు నివసిస్తున్నాడు ఓ సాధువు.
కొండ దిగువున పల్లెవాసులందరికీ ఆయనంటే గురి. నొప్పివచ్చినా, జ్వరం వచ్చినా ఏదో ఒక ఆకో, ఫలమో ఇవ్వమనేవారు. వైద్యుడి దగ్గరకు వెళ్ళమని చెప్పినా వినేవారు కాదు.
ఆలా అడిగినా ప్రతివారికీ అగ్నిగుండంనుంచి ఓ చిటికెడు బూడిద ఇచ్చేవాడు. కాలగమనంలో వ్యాధులు తగ్గిపోయేవి. క్రమంగా జనంతాకిడి పెరిగింది. ఆ సాధువును భగవత్ స్వరూపంగా భావించేవారు. ఆయన అనుగ్రహ భాషణం చాలు, సకలమూ చక్కబడుతుందన్న నమ్మకం పెరిగిపోయింది.
ఇలా ఉండగా ఓసారి తీవ్రమైన కరవు ఏర్పడింది. పొలాలన్నీ బీళ్ళుగా మారాయి. చుక్క నీరు లేదు. పసిపిల్లలకు పాలు కూడా కరవయ్యాయి. పశువులు బక్కచిక్కాయి. పల్లెవాసులకు వలస మార్గమే దిక్కైంది.
ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కొందరు రాక్షస జాతికి చెందినవారు ఉంటారు ఉన్నారు. అలాంటి వాళ్లకు పని పాట ఏమీ ఉండదు మంచి వాళ్లను దూషించడం అవమానించి రాక్షసానందం పొందటమే వాళ్ళ లక్ష్యం.
అలాటి వాళ్ళు ఈ కరవుకు కొండపై ఉన్న సాధువే కారణమన్న వదంతులు వ్యాపింపజేశారు.
రోజులు గడిచేకొద్దీ ఈ భావం ప్రజల్లో బలంగా నాటుకొంది.సాధువును అనరాని మాటలంటూ, ఛీత్కరిస్తూ, రాళ్ళతో కొడుతూ తరిమేశారు.
పాపం సాధువు కాషాయంబరాలు పీలికలయ్యాయి. రాళ్ళదెబ్బలకు రక్తం కారసాగింది. దుర్భర స్థితి.
దూరంగా మరో ప్రాంతానికి వెళ్ళి తిరిగి ధ్యానం చేసుకోసాగాడు.
ఆ సాధువు వెంటే ఉన్న శిష్యుడు- 'స్వామీ! ఏమిటీ దారుణం? ఇంత అవమానం పొంది కూడా అంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నారు?' అని అడిగాడు.
అప్పుడు సాధువు నవ్వి- 'చూడు నాయనా! పల్లెవాసులు నన్ను మహాపురుషుడిలా గౌరవించినప్పుడు పొంగిపోనూ లేదు. ఛీత్కరిస్తూ తరిమేసినప్పుడు బాధపడనూ లేదు. రెండింటినీ ఒకే చిత్తంతో స్వీకరించాను. కాలమే వారికి జ్ఞానోదయం గావిస్తుంది. ఏదో జరిగిందని వ్యాకుల చిత్తంతో నేను బాధపడాల్సిన అవసరమే లేదు...' అంటూ ధ్యానముద్ర వహించాడు- నిశ్చలచిత్తంతో.
ఫ్రెండ్స్ ఒక లక్ష్యసాధనకై శ్రమిస్తున్నప్పుడు ఫలితాలు అనుకూలంగా లేవని, దానినొక అవమానంగా భావిస్తూ కుంగిపోవడం అవివేకమే.
మన తప్పు లేకున్నా మమల్ని ఎవరు బాధపెట్టినా మనకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకపోయినా కాలం తప్పక శిక్షిస్తుంది. కాబట్టి ఎవరో ఏదో అన్నారని అవమానంతో బాధపడుతూ కూర్చోకండి.
నేడు మనం చూస్తున్న వివిధ రంగాల్లోని చాలామంది ప్రముఖులు ప్రతికూల పవనాలను అధిగమించి, విజయకేతనాలు ఎగరేసినవారే. ఉన్నతస్థితికి చేరినవారే.
స్థిరచిత్తంతో అవమానాలను సైతం ఎదుర్కొంటూ లక్ష్యసాధనలో సాగిపోయేవారే ఉన్నతులు.
వారే జీవితంలో విజేతలు!
Famous Posts:
> కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?
> మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి
> సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం
> మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.
> భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?
> మహాభారతం నుండి నేరచుకోవలసిన 12 ముఖ్యమైన విషయాలు.
> భారతీయులు ప్రతి ఒక్కరూ తెలుసుకోదగినవి అద్భుతమైన దేవాలయలు
ఆధ్యాత్మిక కథలు, Telugu Devotional Stories, Telugu Mythology Stories, Devotional Stories Telugu Stories, devotional stories in telugu, devotional stories for kids, devotional stories in telugu pdf, bhakthi storys telugu
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment