Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

దురదృష్టం దూరమవ్వాలంటే శనివారం చేయాల్సిన 5 ముఖ్యమైన పనులు | 5 Important Things To Do On Saturday To Avoid Misfortune

శని ఒకసారి తగులుకుందంటే ఏ పని జరగదు అంటారు. అనుకున్న పనిలేవీ జరగకపోయినా తలపై శని తాండవం చేస్తుంది అంటారు. కానీ అటువంటి శని గ్రహం ఇది మీ అదృష్టాన్ని ప్రకాశింపజేసి మిమ్మల్ని రాజుగా చేస్తుంది.

శనికి కోపం వచ్చిందంటే నాశనం కూడా చేస్తుంది. ఇదంతా జాతకంలో శని స్థానం మీద ఆధారపడి ఉంటుంది. ఇతర గ్రహాల మాదిరిగానే శని కూడా ఇతర రాశుల వారితో ప్రయాణిస్తాడు. శని ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడానికి దాదాపు రెండున్నర సంవత్సరాలు పడుతుంది. శని రాశి సమయంలో వివిధ రాశి చక్రాలు ఉన్న వ్యక్తులు వివిధ పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది.

కొంతమందికి శని వాళ్ళ మంచి జరిగితే, మరికొంత మందికి మాత్రం కఠిన పరిస్థితి ఎదుర్కోవలసి ఉంటుంది. శని అశుభ స్థానం కెరీర్‌లో అంతరాయం కలిగిస్తుందని, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా మూడు విధాలుగా కష్టపడాల్సి ఉంటుందని నమ్ముతారు. శని దేవుని వల్ల మీ జీవితంలో అన్ని సమస్యలు జరుగుతున్నట్టు అన్పిస్తే ఇక్కడ పేర్కొన్న కొన్ని శని నివారణ చర్యల ద్వారా ఆయనను సంతోషపెట్టవచ్చు. 

ఫలితంగా అశుభ ప్రభావాలను వదిలించుకోవచ్చు. ఈ నివారణలు శని సంబంధమైన సమస్యలను తొలగిస్తాయి.

Also Readఉద్యోగ ప్రాప్తి కొరకు శ్రీరామ పట్టాభిషేకం..

రుద్రాక్ష ధరించండి

శని చెడు పరిస్థితుల కారణంగా మీ జీవితంలో ప్రతిదీ పాడైపోతుంటే, శనివారం లేదా సోమవారం గంగాజలంతో కడిగిన సత్ముఖి రుద్రాక్షను ధరించాలి. కొన్ని రోజుల్లో దాని శుభ ప్రభావాలను పొందడం ప్రారంభమవుతుంది. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి.

హనుమాన్ ఆరాధన

పురాణాల ప్రకారం శని దేవుడు హనుమాన్ కు తన భక్తులను ఎన్నడూ ఇబ్బంది పెట్టనని వాగ్దానం చేసాడు. కాబట్టి శనివారం హనుమాన్ ను పూజించండి. వారికి నైవేద్యం సమర్పించండి. హనుమాన్ చాలీసా, సుందరకాండ మొదలైనవి చదవండి.

రావి చెట్టుకు పూజ

శనివారం రావి చెట్టుని పూజించండి. రావి చెట్టు 33 వర్గాల దేవతల నివాసంగా భావిస్తారు. దీనితో పాటు శ్రీకృష్ణుడు రావి చెట్టును తన రూపంగా వర్ణించాడు. శని దేవుడు కూడా శ్రీకృష్ణుని గొప్ప భక్తుడు. అటువంటి పరిస్థితిలో శనివారం రావి చెట్టుని పూజించినప్పుడు శని దేవుడు చాలా సంతోషంగా ఉంటారు. భక్తుల బాధలను తొలగిస్తారు. శనివారం ఆవనూనె దీపం వెలిగించి పీపాల్ చెట్టు కింద ఉంచండి.

శని మంత్రాలు జపించండి

ఈ రెండు మంత్రాలను 'ఓం ప్రాం ప్రిం ప్రౌన్ సహ శనిశ్చరాయ నమః' మరియు 'ఓం శనిశ్చరాయై నమః' జపించండి. శనివారం కనీసం 2 నుండి 5, 7, 9, 11 సార్లు ఈ మంత్రాలను జపించవచ్చు. ఈ మంత్రాలు చాలా ప్రభావవంతంగా పని చేస్తాయని అంటారు. దీనితో పాటు పేదలకు దానం చేయండి.

ఆవ నూనెను దానం చేయండి

శనివారాల్లో ఆవనూనె దానం చేయండి. దానం చేసే ముందు దానిని ఒక పాత్రలో తీసుకుని అందులో మీ ముఖాన్ని చూడండి. అప్పుడు దానం చేయండి. శనివారం వరకు ఇలా నిరంతరం చేయడం ద్వారా శనికి సంబంధించిన సమస్యలు చాలా వరకు దూరమవుతాయి. ఇది కాకుండా ఆవనూనెతో రొట్టె తయారు చేసి శనివారం కుక్కకు తినిపించండి.

Famous Posts:

కూతురా కోడలా ఎవరు ప్రధానం...?


సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?


కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?


మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి.


సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం 


మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.


భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?


మహాభారతం నుండి నేరచుకోవలసిన 12 ముఖ్యమైన విషయాలు.


భారతీయులు ప్రతి ఒక్కరూ  తెలుసుకోదగినవి అద్భుతమైన దేవాలయలు

శనివారం, Saturday, sani, Shani Jayanti, Shani Dev Puja, Hanuman Puja On Saturday, how to do 7 saturday pooja, shani pooja items in telugu, venkateswara pooja at home

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు