Drop Down Menus

మన సమస్యలను మన బాధలను తొలగించుకునేందుకు సరైన సమయం దేవి నవరాత్రులు....| Devi Navaratrulu Special

నవరాత్రి దీక్ష...చేయవలసిన విధానం...ఆచరించవలసిన.... పద్ధతులు....

మన సమస్యలను మన బాధలను     తొలగించుకునేందుకు సరైన సమయం దేవి నవరాత్రులు....

ప్రతి మనిషి ఏదో ఒక  సమస్యతో బాధపడుతూ ఉంటాడు వారి జీవిత కాలంలో ఎంత ప్రయత్నించినను వాటికి పరిష్కారం లభించదు కొందరికి ఎన్ని పూజలు చేసిన ఫలితం దొరకదు చాలామందికి తరచుగా ఏదో ఒక సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.

ఇటువంటి సమస్యలకు సమాధానం దేవీ నవరాత్రి దీక్ష

నవరాత్రి దీక్ష : అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్లే అన్న లోకోక్తి అనుసరించి అమ్మవారి అనుగ్రహాన్ని సంపాదిస్తే దొరకనిది జరగనిది రానిది కానిది అంటూ ఏదీ ఉండదు.

అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సరైన సమయం ఈ దేవీ నవరాత్రులు.

భక్తిశ్రద్ధలతో నవరాత్రి దీక్షను ప్రతి ఒక్కరు ఆచరించి మీ యొక్క సమస్యలను దూరం చేసుకోండి.

నవరాత్రి దీక్ష విధానం : అవకాశం ఉన్నవారు శరీరం సహకరించేవారు ఉదయాన్నే స్నానమాచరించి గురువుల వద్ద నవరాత్రి దీక్షను చేపట్టండి

నవరాత్రి మాలను ధరించండి.

నవరాత్రి దీక్ష చేయలేని వారు:

తొమ్మిది రోజులు ఉదయం సాయంత్రం స్నానం ఆచరించి అమ్మవారి పూజలు చేసుకోవాలి దీక్ష కంకణాన్ని చేతికి కట్టుకోవాలి చెప్పులు ధరించకూడదు శుభ్రమైన దుస్తులను మాత్రమే ధరించాలి.

సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.

అవకాశం ఉన్నవారు తొమ్మిది రోజులు అఖండ దీపం పెట్టండి.

లలితా సహస్రనామాలు చదవడం వస్తే ఉదయం సాయంత్రం రెండు పూటలా కానీ వీలు లేని వారు ఒక్క పూట అయినా కానీ పారాయణం చేయండి.

చదవడం రానివారు కనీసం వినడానికి ప్రయత్నం చేయండి.

సహస్ర నామాలు చదివేంత సమయం లేని వారు దుర్గ సప్త శ్లోకి ఎక్కువసార్లు వినడానికి ప్రయత్నం చేయండి.

సప్తశ్లోకి చదవడం వచ్చిన వారు ఎక్కువ సార్లు పారాయణం చేయండి.

శక్తి ఉన్నవారు తొమ్మిది రోజులు రోజుకు ఒక కుటుంబానికి అయినా తోచిన సహాయం దానం చేయండి.

9రోజులు రోజుకు ఒక మంచి పని అయినా చేయండి.

నవరాత్రి దీక్ష చేసే వారు మెడలో దీక్ష వస్త్రం ధరించాలి.

దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం మహిమ : ఈ స్తోత్రం ఎంతో మహిమాన్వితమైనది ఎటువంటి ఆపదలను అయినా తొలగిస్తుంది.

ప్రతి ఒక్కరు ప్రతి నిత్యం చేయవలసిన సోత్రం ఇది.

ఈ నవరాత్రి సమయంలో ఈ స్తోత్రాన్ని ఎంత ఎక్కువగా పారాయణం చేస్తే అంత శుభ ఫలితాలు ఏర్పడతాయి.

దీక్ష నియమాలు చేయలేనివారు కనీసం ఈ ఒక్క స్తోత్రం పారాయణం చేసినా సరిపోతుంది.

పైన చెప్పినవి ఆచరించడానికి వీలు లేని వారు తొమ్మిది రోజులు చెప్పులు ధరించకండి దీక్ష ఉండండి మీకు తోచిన విధంగా అమ్మవారి సేవ చేసుకోండి.

నిజమైన దైవం ఆలయాల్లో విగ్రహాల్లో లేదు

ప్రతి మనిషిలో దైవం ఉన్నాడు మనిషి మనిషికి సహాయం చేసినప్పుడే దైవం కరుణిస్తుంది

కాబట్టి  అశాశ్వతమైన డబ్బు కోసం అశాశ్వతమైన ఈ దేహం కోసం ఇతరులను విమర్శించకండి ఇతరులను ఇబ్బంది పెట్టకండి ఇతరులకు హాని చేయకండి సోదర సోదరి భావంతో మెలగండి 

శక్తి మేర ఇతరులకు ఏ రూపంలో అయినా సరే సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి.

అమ్మవారి కృప కటాక్ష వీక్షణాలు అందరి పైన సదా ఉండాలని అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా జగన్మాతను వేడుకుంటున్నాను...

అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం.. నవరాత్రి దీక్ష చేయండి ..... అమ్మను ఆశ్రయించడానికి అమ్మ అనుగ్రహం పొందడానికి ఇదే సరైన సమయం.....

Famous Posts:

కనక దుర్గమ్మ క్రింద గుహలో ఉగ్రమైన మరో విగ్రహం

దేవీ పూజ - దుర్గా సప్తశతి పుస్తకం ఉచిత డౌన్లోడ్

కఠిన సమస్యలని ఊదిపారేసే కనకదుర్గా మంత్రం

ఈ దుర్గామాత రూపాలను తలచుకుని ప్రార్థిస్తే.. కష్టాలన్నీ తొలగిపోతాయి.

నవరాత్రి, navratri 9 days devi names, devi navaratri 2021, devi navaratri 2021 telugu, devi navaratri alankaram and prasadam, 10 points on navratri, chaitra navratri, which goddess is worshipped on each day of navratri, what is navratri, 

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.