Drop Down Menus

శ్యామల నవరాత్రులు అంటే ఏమిటి..? శ్యామల నవరాత్రి 2022 తేదీలు - పూజా విధానం | shyamala navaratri information telugu

ఈ  నవరాత్రులు మములువి కావు, చాలా విశేషమైనవి.అందరూ శ్యామలా దేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని ని భక్తిశ్రద్ధలతో పూజించి అమ్మ అనుగ్రహము  పొందండి.

చైత్ర, అశ్వయిజ నవరాత్రులు అందరకీ తెలుసు. మిగిలిన రెండు గుప్త నవరాత్రులు. ఇవి కేవలము సంప్రదాయం ఉన్నవారు మాత్రమే చేసుకుంటారు. ఉత్తర భారతంలో మాత్రం ఈ గుప్త నవరాత్రులను ఎక్కువగా  జరుపుకుంటారు. గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజలు, వ్రతాల మాదిరిగా అందరినీ పిలిచి చేయరు. వీటిని చాలా రహస్యంగా చేసుకుంటారు. గుప్త నవరాత్రులలో  తొమ్మిదిరోజుల పాటు దుర్గాఅమ్మవారిని తొమ్మిది రూపాలలో అంటే నవదుర్గలుగా  అలంకరించి పూజలు చేస్తారు. 

దక్షిణ భారత దేశంలో ఈ నవరాత్రులను శ్యామల నవరాత్రులుగా జరుపుకుంటారు. ఈ నవరాత్రులను అందరూ జరుపుకుంటారు. ఈ నవరాత్రులు ఎంతో విశేషమైనవి. ఈ శ్యామలా దేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని ని భక్తిశ్రద్ధలతో పూజిస్తే మంచి ఉద్యోగాలు, ఉన్నత పదవులు,  విద్య, ఐశ్వర్యం లబిస్తాయి. అంతేకాక బార్య భర్తల మద్య అన్యోన్యం, పెళ్లి కానివారికి త్వరగా పెళ్లి జరుగుతుందని  శాస్త్రం చెబుతుంది.

భండాసురుడు అనే రాక్షసుని చంపడానికి ఆది పరాశక్తి శ్రీలలితా దేవి గా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో ఙ్ఞానం  శ్యామలాదేవిని సృష్టించి పదహారు మంది మంత్రులలో ముఖ్యురాలైన  శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుంది.  ఆ కారణం చేతనే శ్యామలాదేవిని మంత్రిణీ దేవి అని కూడా అంటారు.  ఈ తల్లిని దశ మహా విద్యల్లో  మాతంగి అని పిలుస్తారు. 


ఈ అమ్మరికి మాతంగి అనే పేరు ఎలా వచ్చింది? 

హిమవంతుని స్నేహితుడైన మతంగముని తపస్సుకి సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిక మేర మాతంగుడి కుమార్తెగా జన్మించి మాతంగిదేవిగా ప్రసిద్ధి చెందింది. ఈవిడకు  నీల సరస్వతి,  గేయ చక్ర వసిని, లఘు శ్యామల, వాగ్వాధిని శ్యామల, నకుల శ్యామల, హసంతి  శ్యామల, సర్వసిద్ది మాతంగి, వాస్య మాతంగి, సారిక శ్యామల, శుక శ్యామల, రాజ మాతంగి అని ఎన్నో నామాలు ఉన్నాయి.

శ్యామల నవరాత్రి 2022 తేదీలు

ఈ సంవత్సరం శ్యామల నవరాత్రులు ఫిబ్రవరి 2 బుధవారం నుండి ఫిబ్రవరి 10 గురువారం ఉన్నవి.


రోజు-1 పూజ: లఘు శ్యామల (Laghu Syamala)

తేదీ 2 ఫిబ్రవరి 2022 బుధవారం

తిథిమాఘ శుక్ల పాడ్యమి

తిథి సమయం జనవరి 02, 3:42 AM - జనవరి 03, 12:03 AM


రోజు-2 పూజ: వాగ్వాధిని శ్యామల(Vagvadnini Syamala)

తేదీ 3 ఫిబ్రవరి 2022 గురువారం

తిథిమఘ శుక్ల విధియా

తిథి సమయం ఫిబ్రవరి 02, 8:31 am - ఫిబ్రవరి 03, 6:16 am


రోజు-3 పూజ: నకుల శ్యామల (Nakuli Syamala)

తేదీ 4 ఫిబ్రవరి 2022 శుక్రవారం

తిథిమఘ శుక్ల తదియా

తిథి సమయం ఫిబ్రవరి 03, 6:16 am - ఫిబ్రవరి 04, 4:38 am


రోజు-4 పూజ: హసంతి శ్యామల (Hsanti Syamala)

తేదీ 5 ఫిబ్రవరి 2022 శనివారం

తిథిమాఘ శుక్ల చవితి

తిథి సమయం ఫిబ్రవరి 04, 4:38 am - ఫిబ్రవరి 05, 3:47 am


రోజు-5 పూజ: సర్వసిద్ది మాతంగి (Sarvasiddhi Matangi)

తేదీ 6 ఫిబ్రవరి 2022 ఆదివారం

తిథిమాఘ శుక్ల పంచమి

తిథి సమయం ఫిబ్రవరి 05, 3:47 am - ఫిబ్రవరి 06, 3:47 am


రోజు-6 పూజ: వాస్య మాతంగి (Vasya Matangi)

తేదీ 7 ఫిబ్రవరి 2022 సోమవారం

తిథిమాఘ శుక్ల షష్ఠి

తిథి సమయం ఫిబ్రవరి 06, 3:47 am - ఫిబ్రవరి 07, 4:38 am


రోజు-7 పూజ: సారిక శ్యామల (Sarika Syamala)

తేదీ 8 ఫిబ్రవరి 2022 మంగళవారం

తిథిమాఘ శుక్ల సప్తమి

తిథి సమయం ఫిబ్రవరి 07, 4:38 am - ఫిబ్రవరి 08, 6:16 am


రోజు-8 పూజ: శుక శ్యామల (Suku Syamala)

తేదీ 9 ఫిబ్రవరి 2022 బుధవారం

తిథిమాఘ శుక్ల అష్టమి

తిథి సమయం ఫిబ్రవరి 08, 6:16 am - ఫిబ్రవరి 09, 8:31 am


రోజు-9 పూజ: రాజ మాతంగి / రాజ శ్యామల (Raja Syamala)

తేదీ 10 ఫిబ్రవరి 2022 గురువారం

తిథిమాఘ శుక్ల నవమి

తిథి సమయం ఫిబ్రవరి 09, 8:31 am - ఫిబ్రవరి 10, 11:08 am

పూజా విధానం

ఈ దేవికి నిత్య పూజాతో పాటు మాతంగి/శ్యామల అష్టోత్తరం, శ్యామల షోడశ నామాలతో కుంకుమార్చన చేసుకోండి. వీలయినవరు మాతంగి యొక్క స్తోత్రాలు, హృదయం, కవచం, సహస్రనామలు, సహస్రనామము.. మొదలగు వాటిని పారాయణ చేసుకోవచ్చు. వీలయితే చిలక పచ్చరంగు వస్త్రాలను గానీ, ఎర్రని వస్త్రాలను గానీ ధరించాలి. ఎరుపు రంగు పూలతో అలంకరణ చేసుకోండి.  ప్రసాదం గా పాయసాన్ని నివేదన చేయండి. 


తప్పకుండా శ్యామల షోడశ నామా స్తోత్రం పఠిచండి.

శ్యామల షోడశ నామా స్తోత్రం

హయగ్రీవ ఉవాచ |

తాం తుష్టువుః షోడశభిర్నామభిర్నాకవాసినః |

తాని షోడశనామాని శృణు కుంభసముద్భవ || ౧

 

సంగీతయోగినీ శ్యామా శ్యామలా మంత్రనాయికా |

మంత్రిణీ సచివేశీ చ ప్రధానేశీ శుకప్రియా || ౨


వీణావతీ వైణికీ చ ముద్రిణీ ప్రియకప్రియా |

నీపప్రియా కదంబేశీ కదంబవనవాసినీ || ౩


సదామదా చ నామాని షోడశైతాని కుంభజ |

ఏతైర్యః సచివేశానీం సకృత్ స్తౌతి శరీరవాన్ |

తస్య త్రైలోక్యమఖిలం హస్తే తిష్ఠత్యసంశయమ్ || ౪


ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే లలితోపాఖ్యానే శ్రీశ్యామలా షోడశనామ స్తోత్రమ్ |


ఈ స్తోత్రము పఠించిన వారు ముల్లోకాలు జయించ గలరు.


షోడశ నామా స్తోత్రం చదవలేని వాళ్ళు షోడశ నామాలు అయిన ఈ క్రింది 16 నామాలు తో పూజ చేసుకోండి. అవి 

1. సంగీత యోగిని 

2. శ్యామా

3. శ్యామలా

4. మంత్ర నాయిక

5. మంత్రిని

6. సచివేశి

7. ప్రధానేశీ

8. శుక ప్రియ

9. వీణా వతి

10. వైణికి

11. ముద్రిని

12. ప్రియక ప్రియా

13. నీప ప్రియ

14. కదంబెశి

15. కాదంబ వనవాసిని

16. సదామలా

ఈ  నవరాత్రులు మములువి కావు, చాలా విశేషమైనవి.అందరూ శ్యామలా దేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని ని భక్తిశ్రద్ధలతో పూజించి అమ్మ అనుగ్రహము  పొందండి.

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

శ్యామలా నవరాత్రులు, shyamala navaratri 2022 dates, gupt navratri 2022 february, gupt navratri 2022, shyamala navaratri history telugu, Raja Syamala Navaratri, syamala navaratri dates, shyamala navaratri festival, shyamala navaratri process telugu, 

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

Post a Comment

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.