ఏప్రియల్ నెలలో పుట్టిన వారి ఫలితాలు..
ఏప్రియల్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ ఈ ఫలితములు వర్తిస్తాయి. ఈ నెలలో పుట్టిన వారు స్వయంగా స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. వారి పనులు వారే స్వయంగా చేస్తారు. వారి స్వంత పద్ధతులలోనే చేస్తారు. ఇతరులను అనుకరించరు. ఇతరుల జోక్యాన్ని అంగీకరించరు. అవసరం అయితే వారే తప్పుకొంటారు. ఇతరులను అధిగమించగలరు.
ఈ నెలలో పుట్టినవారు మంచి శక్తివంతులు, తెలివితేటలు, చురుకు అయినవారు. కోపం ఎక్కువ ఇతరులను నడిపించే స్థాయిలో ఉంటారు. ప్రతి విషయంలో వారి స్వంత మార్గాలనే అవలంభిస్తారు. మానసిక ధైర్యం, మానసిక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. పూర్తిగా క్రొత్త పనులు, సరియైన పనులు చేపట్టుతారు. పనిని పూర్తి చేసి చూపిస్తారు. మధ్యలో వదలివేయరు. ప్రతీ విషయంలో ముక్కుసూటిగా నిజాయితీగా ఉంటారు. నిజం మాట్లాడుతారు.
నిజయితీ కొరకు శతృత్వాన్ని కూడా ఎదుర్కొం టారు, కోరికలు, ఆలోచనలను పూర్తిగా సాధించుకొంటారు. డబ్బు, పొజిషన్ సంపాదించి తీరుతారు. ఈ నెలలో పుట్టినవారు ఇంట్లో, ఆఫీసులో, వ్యాపార సంస్థలలో వారి జీవితంలో మొదటిస్థానంలోనే ఉంటారు. ఉండాలని ఆశపడ తారు. జీవితంలో అభివృద్ధి సాధించుకొని గొప్ప తృప్తిని పొందుతారు. వీరికి ఆశలు నెరవేరుతాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. దాంపత్య జీవితం తృప్తిగా గడుస్తుంది. ఎలాంటి సమస్యలు, ఇబ్బందులుండవు. పరస్పర అవగాహన ఉంటుంది.
అదృష్టంతో పాటు పరిస్థితులు కూడా ఉపయోగపడతాయి. ఈ నెలలో పుట్టినవారు మంచి శక్తివంతులు, ఇతరులకు దారి చూపిస్తారు. పండి మార్గదర్శకులవుతారు. చాలా చురుకుగా ఉంటారు. చురుకుగా పనులు చేస్తారు. సోమరితనంను ధరిరానివ్వరు. పనియే దేవుడుగా భావిస్తారు.
ఆరోగ్యము: ఈ నెలలో పుట్టినవారికి సహణంగా కంటి, పంటి, చెవికి సంబంధించిన రోగములు వస్తాయి. జ్వరము, తలపోటు వంటి రోగములు వీరిని ఎక్కువగా బాధిస్తాయి.
ధనము: మంచి సంపాదన ఉంటుంది. సంపాదిస్తారు. అనుకోకుండా చాలా ధననష్టాలు జరుగుతాయి. అయినా జీవితంలో తట్టుకొని నిలబడతారు.
లక్కీ వారములు: ఏప్రియల్ నెలలో పుట్టిన వారికి సోమవారము, శుక్రవారములు అదృష్టమునిచ్చు వారములు, మంగళ, గురు వారములు కూడా లాభం చేస్తాయి.
లక్కీ కలర్ దుస్తులు: రోజ్ కలర్, పింక్ కలర్ దుస్తులు ధరిస్తే వీరికి లాభం ఉంటుంది.
లక్కీ స్టోన్స్: ముత్యము, ముదురు గోమేధికం అదృష్టం కలిసివస్తుంది.
Relatd Posts:
> జనవరి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది
> ఫిబ్రవరి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .
> మార్చి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .
> ఏప్రిల్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .
> మే నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .
> జూన్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .
> జూలై నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.
> ఆగస్టు నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.
> సెప్టెంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.
> అక్టోబరు నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.
> నవంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.
> డిసెంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.
ఏప్రియల్ నెలలో పుట్టిన, negative traits of april born, april born female characteristics, what is special about the month of april, april born love life, april born marriage life, what is special about april born, april born future, april birthday month