Today Tirumala Darshan Information:

1) 300 Rupess Darshan Tickets for Month of December will be availble for Booking 11-11-2022 Morning 10 am **డిసెంబ‌రు నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను న‌వంబ‌రు 11న ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.** తిరుమలలో అంగ ప్రదక్షిణ , వృద్దల వికలాంగుల దర్శన టికెట్స్ ఇప్పుడు ఆన్లైన్ లో మాత్రమే ఇస్తున్నారు **. అంగ ప్రదక్షిణ నవంబర్ నెలకు టికెట్స్ అన్ని బుక్ అయ్యాయి డిసెంబర్ నెలకు నవంబర్ 20వ తేదీ తరువాత విడుదల చేస్తారు .** వృద్దల టికెట్స్ నవంబర్ నెలకు అక్టోబర్ 26వ తేదీన విడుదల చేశారు.  *** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** 12 సంవత్సరాల లోపు పిల్లలకు అన్ని సేవలకు టికెట్ లేకుండానే తీస్కుని వెళ్ళవచ్చు age proof కోసం  ఆధార్ కార్డు చూపించాలి

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

డిసెంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది ..| Characteristics of those born in the month of December, the future is like this

డిసెంబర్ నెలలో పుట్టిన వారి ఫలితాలు..

డిసెంబర్ నెలలో పుట్టిన స్త్రీ, పురుషులకు ఈ ఫలితాలు వర్తిస్తాయి. వీరు మంచి విద్యావంతులు, దయకలవారు, బుద్ధిబలము కలవారు, దైవభక్తి కలవారుగా ఉంటారు.

వీరి ప్రవర్తన బాగుంటుంది. ఇతరులకు పనిచేయరు. బాగా చదువుకొంటారు. ఉద్యోగాలు చేస్తారు. సంపాదిస్తారు. మంచి పేరు సంపాదించుకుంటారు. నలుగురిలో గౌరవంగా బ్రతుకుతారు. విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది.

పట్టుదల, కార్యదీక్ష ఉంటాయి. తలపెట్టిన పనిని పూర్తి చేస్తారు. వీరికి అదృష్టం, దైవసహాయం ఉంటుంది. భక్తి మార్గములు అవలంభిస్తారు. ధర్మ కార్యములు చేస్తారు. ప్రయాణాల మీద ఆసక్తి ఉంటుంది.

ఈ నెలలో పుట్టిన వారు మంచి ఉద్యోగాలు చేస్తారు. రాజకీయాలలో రాణిస్తారు. వీరిలో కొందరు పండితులుగా, విద్యావంతులుగా ఉంటారు.

వీరు చేస్తున్న పనిలో పూర్తి నిమగ్నమయిపోతారు. పని మీద భక్తి శ్రద్ధ ఉంటుంది. ఆ పని పూర్తి అయ్యే వరకు ఇంకొక పని గురించి అలోచించరు. ఏకాగ్రత ఎక్కువ. బుద్ది చాలా చురుకుగా పని చేస్తుంది. ఎలాంటి విషయాన్ని అయినా సులభంగా గ్రహించగలరు. పనిని పూర్తి చేయగలరు. వీరికి సహనం తక్కువే అని చెప్పవచ్చును. నీతి, నిజాయితీ మాట పట్టింపు ఎక్కువ. పరిస్థితులకు తల వంచాలంటే చాలా బాధపడ్తారు. వ్యాపారాలు కూడా బాగా నిర్వహించగలరు. స్వయంకృషిని, స్వంత తెలివితేటల్ని నమ్ముకొంటారు. వారి పనినివారే స్వయంగా చేస్తారు. ఇతరులు చేస్తే వారికి న్యూరు. వారే స్వయంగా చేయాలి అనుకుంటారు. ఈ నెలలో పుట్టిన వారు తొందరగా నిర్ణయాలు తీసుకోగలరు. వారు చేయుపనులు గురించి గర్వపడతారు. ఇతరులను ప్రేమిస్తారు. ప్రేమతో జయిస్తారు. వీరితో త్యాగబుద్ధి కూడా ఉంటుంది.

ఆరోగ్యము: రక్తహీనత వల్ల బాధపడతారు. లివర్ వ్యాధులు, నీరసం, తలనొప్పి వీరిని బాధిస్తుంది. 

లక్కీ వారములు: వీరికి మంగళవారము, గురువారము అదృష్టంనిచ్చు వారములు. ఈ వారములలో వీరి ప్రయత్నములు ఫలిస్తాయి.

లక్కీ కలర్ దుస్తులు: ఆకుపచ్చ, వంకాయరంగు దుస్తులు ధరిస్తే కలిసి వస్తుంది.

లక్కీ స్టోన్స్: పగడంలేదా వంకాయ రంగుస్టోన్, గ్రీన్ స్టోన్ ధరిస్తే వీరికి అదృష్టం కలిసి వస్తుంది.

Related Posts:

జనవరి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది

ఫిబ్రవరి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .

మార్చి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .

ఏప్రిల్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .

మే నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .

జూన్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .

జూలై నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.

ఆగస్టు నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.

సెప్టెంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.

అక్టోబరు నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.

నవంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.

డిసెంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.

డిసెంబర్ నెలలో పుట్టిన, December, what are the qualities of december born, december born females, baby born in december zodiac sign, benefits of being born in december, december born girl nature, december babies facts, what are december babies called

Comments

Popular Posts