Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ఈ ఐదు సూత్రాలు పాటిస్తే… ధనలక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది. | If you follow these five principles Dhanalakshmi will be in your home

ఈ ఐదు సూత్రాలు పాటిస్తే… ధనలక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది.

1.మనం ఏ ఇంటికైనా వెళ్లినపుడు, ఆ ఇంటి డోర్, వరండా వంటివి అందంగా ఉంటే ఆ ఇంటికి వెల్లలనిపిస్తుంది. ధన లక్ష్మికి కూడా అలాగే ఇంటి డోర్ అందంగా ఉంటే ఆ ఇంట్లోకి వెల్లలనిపిస్తుంది అట. లేకపోతే లక్ష్మీ దేవి మరో ఇల్లు చూసుకుంటుంది. అందువల్ల ఇంటి మెయిన్ డోర్ అందంగా, కలర్‌ఫుల్‌గా ఉండేలా చూసుకోవాలంటున్నారు.

2. ఇంట్లో గానీ ఆఫీసులో గానీ మనకు అవసరం లేని వస్తువులని  బయట చెత్త కుండీలో పారేయాలి. ఈ పని ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. ఇంట్లో చెత్త ఉన్నంతకాలం ఇంట్లోకి ధన లక్ష్మీ రాదని నిపుణులు తెలిపారు.

3.రంగురంగుల స్పటికం రాళ్లు (క్రిస్టల్ స్టోన్స్) మీ ఇంట్లో ఉంటే  డబ్బు ఆటోమేటిక్‌గా వస్తుందని గ్రంథాలలో రాసివుంది. మీ ఇంట్లో ఏ క్రిస్టల్ లేకపోతే, క్రిస్టల్స్‌తో తయారైన షోగా వుండే వస్తువుల్ని కొని డెకరేట్ చేసుకోండి. అవి విపరీతంగా పాజిటివ్ ఎనర్జీని ప్రసరిస్తాయి. అపుడు ధనలక్ష్మీ ఇంట్లోనే ఉంటూ వెళ్లమన్నా వెళ్లకుండా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

4. ఇంట్లో ఏదైనా జలపాతం లాంటి ప్రవాహం ఉండాలి. అది చిన్నగా ఉన్నా పర్వాలేదు. ధనవంతులే అలాంటివి ఏర్పాటు చేసుకుంటారని అనుకోవద్దు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అలాంటి వాటిని కొనుక్కోవచ్చు. గిఫ్ట్ షాపుల్లో అలాంటివి లభిస్తాయి. అవి కొని ఇంట్లో ఉంచాలి.అది కూడా కుదరకపోతే జలపాతం ఫొటో లేదా ఫౌంటేన్ లేదా నది ఫొటోను ఇంట్లో గోడకి వేలాడదియ్యాలి. నీటిలో ఫ్లో ఎంత ఎక్కువగా ఉంటే డబ్బు అంత ఎక్కువగా వస్తుందని నిపుణులు తెలిపారు.

5. డబ్బుకీ, వంట గదికీ సంబంధం ఉంటుంది అంటున్నారు నిపుణులు. వంట గది అందంగా లేకపోతే ఆ ఇంట్లో డబ్బులు లేక జేబులు తడుముకోవాల్సిందే. ఎందుకంటే వంట గదిలో పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఎనర్జీ డబ్బు వచ్చేలా చేస్తుంది. అందువల్ల వంట గదిని దాదాపు దేవుడి గదిలా చూసుకోవాలి. శుభ్రంగా ఉంచుకోవాలి. పాత్రల్ని ఎప్పటికప్పుడు కడిగేసుకుంటూ, చక్కగా డెకరేట్ చేసుకొని కిచెన్ ఎంత బాగుందో అని అందరూ అనుకునేంత అందంగా ఉంచుకోవాలి. వంటగదిలో గోడలు, షెల్ఫులు, స్టవ్ అన్నీ పరిశుభ్రంగా ఉండాలని మర్చిపోవద్దు.కాబట్టి నీట్ గా ఉంచుకోండి.

ఇవన్నీ నిజమా కాదా అని అనుమనించకుండా మీరు ఆచరించి మంచి ఫలితాలు పొందుతారు అనుకుంటున్నా.

Famous Posts:

శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత


శివదేవుని సోమవారపు నోము కథ


తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?


సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు


ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ధనలక్ష్మి, Dhanalakshmi, dhana lakshmi pooja vidhanam in telugu pdf, lakshmi pooja at home on fridays, lakshmi pooja at home in telugu, simple lakshmi pooja at home, dhana lakshmi mantra, lakshmi devi pooja vidhanam in telugu, dhanalakshmi pooja 2022

Comments

Popular Posts