Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ఉప్పు దీపం ఇలా వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది | Uppu Deepam | Aishwarya Deepam | Salt Deepam

ఉప్పు దీపం ఉపయోగాలు........!!

అనారోగ్య వాతావరణంలా ఉన్న ఆఫీస్ లేదా ఇల్లు కళ మారాలంటే మీ కార్యాలయాలలో భోజపత్ర యంత్ర యుక్తమైన గోమాత, పంచభూత,శక్తి పీఠ యంత్ర సహిత ఐశ్వర్య కాళీ పాదుకలు ఉన్న ఫోటో పెట్టండి సకల దోషాలు తొలగి శుభాలు కలుగుతాయి.

ఈశాన్య మూలలో రాగి చెంబులో నీళ్ళను నిడుగా నింపి అందులో ఎర్రని పుష్పాలను వేసి అందులో కొంచం పసుపు, కుంకుమ వేసి ఈశాన్య దిశగా ఉంచండి. కాని ప్రతిరోజు వాటిలో నీరుని, పుష్పాలను క్రమం తప్పక మార్చాలి.

నెలకొకసారి ఆఫీసు సింహద్వారానికి బూడిద గుమ్మడి కాయ లేదా పూజించిన కొబ్బరికాయ ఎర్రని రంగు వస్త్రంలో వేలాడదీయడం మంచిది. కనీసం వారానికి ఒకసారన్నా సాంబ్రాణి ధూపం వేయండి.

నరదృష్టి తొలిగిపోతుంది. మనం ఎంతో కష్టపడి సంపాదించిన సంపద నిలవకుండా, వచ్చింది వచ్చినట్టు ఖర్చు అవుతుంటుంది, అప్పులు తీరకుండా వడ్డీలు పెరిగి పోతూ ఉంటాయి. వ్యాపారంలో లాభాలు లేకుండా ఇబంధులు ఉన్నవారికి అరకొర జీతంతో ఆదాయం పెరగని వారికి బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల దిష్టివళ్ళ సరిగ్గా జరగకుండా ఉన్నవారికి కోత్తగా ఎదైనా వ్యాపారం మొదలు పెట్టిన వారికి అభివృద్ధి కి అసలు ఏ ఆదాయం ఉపాధి లేని వారికి ఆదాయం కోసం ఈ ఐశ్వర్య దీపం " ఉప్పు దీపం " మంచి పరిహారం...

ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో పెట్టే దీపం. ఇది ఎలా పెడతారో తెలుసుకుందాము.

ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పెద్ద ప్రమిదలు రెండు తీసుకొని వాటికి పసుపు, కుంకుమా రాసి నెలపైన బియ్యం పిండి పసుపు కుంకుమతో ముగ్గు వేసి దానిపైన ప్రమిధలు ఒకదాని పైన ఒకటి ఒక్కటిగా పెట్టి అందులో ఒక పావు కిలో రాళ్ళ ఉప్పు వేసి ఆ రాళ్ళ ఉప్పు పైన పసుపు కుంకుమ చల్లాలి

ఒక చిన్న ప్రమిధలు ఒకదాని పైన ఒకటి పెట్టి పసుపు, కుంకుమా పూలు పెట్టి ప్రమిధలో నూనె కానీ నెయ్యి కానీ పోసి రెండు ఒత్తులు ఒక్కటిగా వేసి వెలిగించాలి.

దీపం శ్లోకం చదువుకోవాలి. పళ్ళు కానీ, పాలు , పటిక బెల్లం, కొబ్బరికాయ ఏదైనా నివేదన నైవేద్యంగా పెట్టి లక్ష్మీ వేంకటేశ్వరస్వామి స్త్రోత్రం చదువుకోవాలి. కనకధార స్త్రోత్రం కూడా చదివితే మంచిది...

శుక్రవారం ఇలా దీపారాధన చేశాక శనివారం రోజు ఆ ప్రమిధలులోని ఉప్పును తీసి నీటిలో కలపాలి, వీలు పడని వారు ఇంటి బయట తొక్కని ప్రదేశంలో పోయాలి.

నీళ్ళలో వేయడమే సరైన పద్దతి. అవకారం ఉన్నవాళ్లు నదిలో కలపవచ్చు, ప్రమిధలు మాటి మాటికి కొత్తవి మార్చాల్సిన పని లేదు ప్రతి వారం అవి వాడుకోవచ్చు, ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు పైన దీపం వెలిగించి శనివారం రోజు ఆ ఉప్పు తీసేయాలి.

ఆ తర్వాత ఆవునకు అరటిపండ్లు, తోటకూర లేదా పచ్చి గడ్డి ఆహారంగా ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేయాలి.

ఇలా 11 శుక్రవారాలు కానీ 16 శుక్రవారం కానీ 21 కానీ 41 శుక్రవారాలు కానీ సంకల్పం అనుకోని ఇంట్లో చేయాలి.

ఈ ఉప్పు దీపం ఈశాన్యం భాగంలో పెట్టడం ఇంకా మంచి ఫలితం వస్తుంది, అంటే పూర్తీ ఈశాన్యం మూలకు కాకుండా కొంత దగ్గరలో ఉండేలా చూసుకోవాలి.

41 శుక్రవారం ఉప్పు దీపం పెట్టే వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి, ధన ఇబ్బందులు తొలగిపోతాయి. కొందరు రాక్ సాల్ట్ పైన పెడతారు కానీ రాళ్ళ ఉప్పు పైన పెట్టడమే సంప్రదాయం.

తీసేసిన ఉప్పుని ఇంటి బయట ఉన్న చెట్లకు బకెట్ నీళ్ళలో వేసి కలిపి కరిగాక చెట్లకు పోయవచ్చును, ఇది ఎవ్వరైనా చేసుకోవచ్చు...

Famous Posts:

మీ పుట్టిన తేది ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంచితే శుభం 

ఈ రూల్స్ తప్పక పాటించండి 

కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?

మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా? 

భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ? 

వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.

శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు

శివ గుణాలు లోకానికి సందేశాలు

ఉప్పు దీపం, Uppu Deepam, Aishwarya Deepam, Salt Deepam, uppu deepam timings, uppu deepam benefits in telugu, uppu deepam images, salt deepam benefits, uppu deepam benefits in tamil, ఉప్పు దీపం ఎలా పెట్టాలి.

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు