మహాశివరాత్రినాడుచేయవలసినవిధులు
చతుర్దశాబ్దం కర్తవ్యం శివరాత్రివ్రతం శుభమ్
శివరాత్రి వ్రతమును పదునాల్గు సంవత్సరములు చేయవలెను. త్రయెదశినాడు ఒక పూట భోజనమును చేసి, చతుర్దశినాడు ఉపవాసమునుండవలెను.
శివరాత్రి సంప్రాప్తము కాగానే నిత్యనిధిని అనుష్టించి, తరువాత శివాలయమునకు వెళ్లి యథావిధిగా పూజను చేసి, తరువాత అచట ముల్లోకములలో గౌరీ తిలకమని ప్రసిద్ధిని గాంచిన దివ్యమగు మండపమును ప్రయత్నపూర్వకముగా చేయవలెను. ఆ మండలమునకు మధ్యలో లింగతోభద్రము, లేదా సర్వతో భద్రము అనే ముగ్గును వేయవలెను.
వస్త్రము, ఫలము మరియు దక్షిణలతో కూడిన శుభకరమగు కుంభములను అచట ప్రాజాపత్య విధానముతో స్థాపించవలెను. కుంభములను మండపమునకు ప్రక్కలయందు జాగ్రత్తగా ఉంచవలెను. మధ్యలో ఒక బంగరు కుండను, లేదా మరియొక కుండను ఉంచవలెను.వ్రతమును చేయువాడు పలము, లేక అర్ధపలము, బంగారముతో, లేదా యథాశక్తిగా చేసిన పార్వతీపరమేశ్వరుల మూర్తిని నిర్మించి అచట ఉంచవలెను.
శివుని మూర్తిని కుడివైపున, పార్వతి మూర్తిని ఎడమవైపున ఉంచి రాత్రియందు శ్రద్ధతో పూజించవలెను. ఆ సమయములో బుుత్వికులతో సహా ఆచార్యుని వరణము చేసి, వారి అనుజ్ఞతో భక్తిపూర్వకముగా శివుని పూజించవలెను. వ్రతనిష్ఠ గల భక్తుడు రాత్రియందు ప్రతియామమునందు పూజను చేయుచూ, జాగరణము చేయవలెను. వ్రతమును చేయువాడు రాత్రి అంతయు గాననాట్యదులతో గడుపవలెను. ఈ విధముగా యథావిధిగా పూజించి శివుని ప్రసన్నని చేసి ఉదయమే మరల పునఃపూజను చేసి యథావిదిగా హోమమునుచేయవలెను. శక్తిని అనుసరించి ప్రాజాపత్యవ్రతమును చేసి బ్రాహ్మణులకు ప్రీతిపూర్వకముగా భోజనమునిడి భక్తితో దానము చేయవలెను.
భార్యలతో కూడియున్న బుుత్విక్కులను వస్త్రములతో మరియు ఆభరణములతో అలంకరించి వేర్వేరుగా యథావిధిగా దానములను చేయవలెను.దూడ, ఇతరములైన అలంకారములు మరియు ఉపకరణములతో కూడియున్న ఆవును యథావిధిగా ఆచార్యునకు ఇచ్చి, శివుడు నాయందు ప్రీతిని పొందుగాక అని పలుకవలెను. తరువాత కుంభములతో మరియు వస్త్రాది సర్వాలంకారములతో కూడియున్న మూర్తులను ఎద్దుపైన నుంచి ఆచార్యునకు నివేదించవలెను. తరువాత మహేశ్వరుడు, మహాప్రభుడు అగు దేవుని చేతులను జోడించి తలను వంచి నమస్కరించి పరమ ప్రీతి వలన గద్గదమైన వాక్కుతో చక్కగా ప్రార్థించవలెను.
ఓ దేవదేవా! మహాదేవా! శరణు పొందిన వారియందు ప్రీతి గలవాడా! ఓ దేవేశా! ఈ వ్రతమును చేసిన నాపైన దయను చూపుము. ఓ శివా! నేను భక్తిపూర్వకముగా ఈ వ్రతమును చేసితిని. ఓ శంకరా! నీ అనుగ్రహముచే లోపములేవైన ఉన్ననూ సంపూర్ణమగుగాక! ఓ శంకరా!నేను తెలిసిగాని, తెలియకగాని జపపూజాదులలో దోషమును చేసియున్ననూ, నీ కృపచే సర్వము సఫలముగుకాక! ఈ విధముగా శివపరమాత్మకు పుష్పాంజలి ఇచ్చి నమస్కరించి తరువాత మరల ప్రార్థించవలెను. ఈ విధముగా చేయువానికి వ్రతములో లోపమేమియు ఉండదు. దానివలన ఆతనికి నిస్సందేహముగా మనోభీష్టము సిద్ధించును.
Famous Posts:
> ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే
> అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
> 100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
> అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం
> ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే
> గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?
maha shivaratri story, maha shivaratri 2021, why is shivratri celebrated, maha shivaratri 2021, maha shivaratri benefits, maha shivaratri story in hindi, maha shivaratri story in tamil, difference between shivratri and mahashivratri, మహా శివరాత్రి
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment