Drop Down Menus

పెళ్ళిలో అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు ఎందుకు? అసలు ఎవరీ అరుంధతి..? Arundhati Star Significance And Importance

ఇంతకీ అరుంధతి నక్షత్రం ఎవరు...! 

పర పురుషుడిని కన్నెత్తి చూడని మహా పతివ్రత అరుంధతిపై అగ్నిదేవుడు కన్నేస్తాడు... 

హిందూ సంప్రదాయం ప్రకారం వివాహఘట్టంలో వధూవరులు అరుంధతి నక్షత్రాన్ని చూస్తారు. అయితే చాలా మందికి అరుంధతి నక్షత్రం గురించి తెలియకపోవచ్చు.

దాని నేపథ్యం పవిత్రత అనే పదానికి పర్యాయరూపమే అరుంధతి. 

పతివ్రతల్లో  మొదటిస్థానం కూడా. అందుకే నింగిలో చుక్కలా నిలిచిపోయింది, ఎంతో అందగత్తె మహాపతివ్రత కూడాను.

అరుంధతి గురించి చాలా కథలున్నాయి. అందులో కొన్ని...

వశిష్ట మహర్షి గురించి వినే ఉంటారు. ఆయన పెళ్లి చేసుకోవాలని అంతటా తిరుగుతూ ఉంటాడు. ఒకసారి ఒక గ్రామంలో కన్నెలంతా అతన్ని చూడడానికి వచ్చారు. వసిష్టుడు కొంచెం ఇసుకను చేతిలోకి తీసుకున్నాడు.

ఈ ఇసుకను ఎవరైనా సరే వండి అన్నంగా తయారు చెయ్యగలరా అని అడిగాడు. అయితే ఆ గ్రామంలోని అమ్మాయిల్లో ఎవ్వరూ అది సాధ్యం కాదని చెప్పారు.

పక్క గ్రామమైన మాల పల్లె నుంచి వచ్చిన ఒక అందమైన ఆడపడుచు పైకి లేచి నిలపడుతుంది. 

నేను చేస్తానండి అంటుంది. వెంటనే పొయ్యి వెలిగించి దానిపై కుండ పెట్టింది.

ఎసరు బాగా మరిగిన తర్వాత అందులో ఇసుక వేసింది. ధ్యానం చేస్తూ వంట వండింది. ఇసుక అన్నంగా మారింది. వశిష్టుడికి కుండలోని అన్నం చూపించింది. ఆయనకు కూడా ఈ విషయం బోధపడలేదు. ఆమెనే అరుంధతి.

తర్వాత ఆ అన్నం తినమంటూ అరుంధతి వశిష్టుడికి వడ్డిస్తుంది..కానీ ఆయన తినడు. నన్ను పెళ్లి చేసుకుంటేనే తింటాను అంటాడు. తర్వాత అరుంధతి తల్లిదండ్రులతో మాట్లాడుతాడు వశిష్టుడు. వాళ్లను ఒప్పించి అరుంధతిని పెళ్లి చేసుకుంటాడు..

ఒకసారి వశిష్టుడు తన కమండలం ఆమెకు ఇచ్చి బయటకు వెళ్తాడు. తాను వచ్చే వరకు కమండలం వైపే చూస్తూ ఉండమని చెబుతాడు..

అరుంధతి తన భర్త వచ్చేవరకు దాన్నే చూస్తూ ఉండాలనుకుంటుంది. చాలా ఏళ్లు గడిచినా వశిష్టుడు రాడు. అయితే అరుంధతి మాత్రం దాని వంకే చూస్తూ ఉంటుంది.

తన భర్తను తప్ప పర పురుషుడిని కన్నెత్తి చూడని మహా పతివ్రత అరుంధతి. ఇదిలా ఉండగా..

మరోపక్క అగ్ని దేవుడి ఎదుట సప్త రుషులు యజ్ఞం చేస్తారు..ఆ రుషుల భార్యలపై అగ్ని దేవుడు మోజు పడతాడు. ఈ విషయాన్ని అగ్ని దేవుడి భార్య అయిన స్వాహాదేవి గ్రహిస్తుంది. ఆ ఏడుగురి భార్యల మాదిరిగా తానే రోజుకొక అవతారం ధరించాలనుకుంటుంది. రోజుకొక రుషి భార్య అవతారం ఎత్తి తన భర్త అగ్ని దేవుడి కోరిక తీరుస్తుంది.

అరుంధతి పెద్ద పతివ్రత.. 

ఇక చివరి రోజు తాను అరుంధతిని అనుభవించబోతున్నాననే ఆనందంలో ఉంటాడు అగ్నిదేవుడు. కానీ స్వాహాదేవి ఎంత ప్రయత్నించిన అరుంధతి అవతారంలోకి మారలేదు. అరుంధతి పెద్ద పతివ్రత కావడమే ఇందుకు కారణం.

అందుకే ఆమె అరుంధతి నక్షత్రంగా మారి జగత్తుకు ఆదర్శంగా నిలిచింది.

అరుంధతికి "శక్తి' అనే కుమారుడున్నాడు. శక్తి కుమారుడే "పరాశరుడు". పరాశరుడి కుమారుడే "వ్యాసుడు". అలా ఎంతో గొప్ప చరిత్ర కలిగింది అరుంధతి నక్షత్రం.

Famous Posts:

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం


అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం


ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే


గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?


శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి


సొంత ఊరిలోనే స్వయం ఉపాధి మార్గం 

అరుంధతి నక్షత్రం, Arundhati Star, ted searches, arundhati nakshatram, arundhati nakshatram meaning in telugu, arundhati nakshatram location, arundhati nakshatram in wedding, arundhati nakshatram movie telugu, arundhati nakshatram significance, arundhati nakshatram images, arundhati nakshatram story in telugu

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.