Drop Down Menus

మీ పేరును బట్టి, ఇంటి సింహద్వారము ఏ దిక్కులో ఉండాలి..| Gruhapravesam Tips for Your New Home

మీ పేరును బట్టి, ఇంటి సింహద్వారము ఏ దిక్కులో ఉండాలి..

“దిశ కుదిరి దశ కుదురు“ నను సామెత తెలిసిందే ! దిశ అనగా “ తాను నివసించు దిక్కు, స్థలము,గృహము” అని అర్ధము! దశ అనగా జాతక రీత్యా ప్రాప్తించు అభివ్రుది, శుభ యోగములు !

కనుక గృహనిర్మాణము తలపెట్టిన వారు శాస్త్ర సమ్మతముగా గృహం నిర్మించుకోవాలి . నివసించే గ్రహము సొంతమైన కాక పోయిన అందు వసతులు నివసించు వారు అనుబవించు నట్లు , అందలి దోషములను కూడా యజమానితో పంచుకోనవలసిందే. అలాగే మంచిని కూడా నివాసము వుండే వారు యజమాని అనుభవిస్తారు . ఎవరు జన్మించిన గృహము వారికి అత్యంత శుభము, కాని కొన్ని సందర్భాలలో వేరొక ఇంటిలో నివసించ వలసి రావటం లేక నూతన గృహమును నిర్మించటం జరుగుతుంటుంది. అలాంటి సందర్భములలో నిర్మించబోయే లేక నివసించబోయే గృహము మనకు మంచిదా?

కాదా? అని తెలుసుకోవటాన్ని “వాస్తుశాస్త్రం” లో అర్వణము అని అంటారు.

అర్వణము రెండు రకములుగా లెక్కించవచ్చు.

1. జన్మనక్షత్రము రీత్యా

2. నామనక్షత్రము రీత్యా

నామ నక్షత్రమును బట్టి గృహము యొక్క సింహద్వారము ఏ దిక్కున ఉండాలో నిర్ణయించటం, ఎక్కువగా వాడుకలో వున్నా...  శ్రేష్టమైన విధానంగా చెప్పవచ్చు. తెలుగు, తమళ,మలయాళ,కన్నడ రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలవారు నక్షత్రాన్ని బట్టి,మరియు రాశిని బట్టి కూడా తెలుసుకుంటారు. కానీ ఈవిధానాలు అంత ఎక్కువ వాడుకలో లేక పోవటం గమనించవచ్చు. ముందుగా తన పేరునకు గల మొదటి అక్షరం ప్రకారం “దిశావర్గ” నిర్ణయం చేసుకోవాలి. సాధారణంగా దంపతులు అనగా భార్యభర్తలు గృహనిర్మాణం తలపెడితే సింహద్వార నిర్ణయం ఇంటి యజమాని అనగా భర్త యొక్క పేరునుబట్టి మాత్రమే చూడాలి. భార్యభర్తల ఇద్దరి పేరుతో చూడవలసిన అవసరంలేదని గమనించవచ్చు. భూమి, భార్యపేరున కొనుగోలు చేసినప్పటికీ భర్త యొక్క పేరునుబట్టి మాత్రమే సింహద్వారం నిర్ణయించాలి.

దిశావర్గ” నిర్ణయం

తెలుగుభాషలో మొత్తం అక్షరాలు 51 వున్నవి. వీటిని 8 భాగాలుగా విభజించినారు. వీటినే “అష్టకవర్గులు” అని పిలుస్తారు. ఈ విధానాన్ని సులువుగా అర్ధం చేసుకోవటానికి క్రింద ఇవ్వబడిన పట్టికను గమనించగలరు.

మొదటది

“అ-వర్గు” అని పేరు! 

అనగా ఈ వర్గులో “అ,ఆ,ఇ,ఈ,ఉ,ఊ,ఋ, ౠ,ఎ, ఏ, ఐ, ఒ,

ఓ,ఔ,అం,అః” అనే 16 అక్షరములు ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా... అట్టివారు “అ-వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “తూర్పు దిక్కు” స్వదిశ అవుతుంది.

రెండవది

“క-వర్గు” అని పేరు! 

అనగా ఈ వర్గులో “క, ఖ, గ, ఘ, ఙ ” అనే 5 అక్షరములు ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “క-వర్గు” నకు చెందినవారుగా పరిగణింపబడతారు. వీరికి “ఆగ్నేయ దిక్కు” స్వదిశ అవుతుంది.

మూడవది

“చ-వర్గు” అని పేరు! 

అనగా ఈ వర్గులో “చ, ఛ, జ, ఝ, ఞ” అనే 5 అక్షరములు ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “చ వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “దక్షిణదిక్కు” స్వదిశ అవుతుంది.

నాల్గవది

“ట-వర్గు” అని పేరు! 

అనగా ఈ వర్గులో “ట, ఠ, డ, ఢ, ణ” అనే 5 అక్షరములు ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “ట వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “ నైరుతి దిక్కు” స్వదిశ అవుతుంది.

ఐదవది

“త-వర్గు” అని పేరు! 

అనగా ఈ వర్గులో “త, థ, ద, ధ, న” అనే 5 అక్షరములుఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “త వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “ పడమర దిక్కు” స్వదిశ అవుతుంది.

ఆరవది

“ప-వర్గు” అని పేరు! 

అనగా ఈ వర్గులో “ప, ఫ, బ, భ, మ” అనే 5 అక్షరములు ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “ప వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “ వాయవ్య దిక్కు” స్వదిశ అవుతుంది.

ఏడవది

“య-వర్గు” అని పేరు!

అనగా ఈ వర్గులో “య, ర, ల, వ” అనే 4 అక్షరములు ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “య వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “ ఉత్తర దిక్కు” స్వదిశ అవుతుంది.

ఎనిమిదవది

“శ-వర్గు” అని పేరు!

అనగా ఈ వర్గులో “శ, ష, స, హ, ళ, క్ష” అనే 6 అక్షరములు ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “శ వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “ ఈశాన్య దిక్కు” స్వదిశ అవుతుంది.

ఈ ప్రకారముగా వారి వారి పేరును బట్టి వారు ఏ వర్గమునకు చెందిన వారో తెలుసుకోవాలి. తద్వారా సింహద్వారము దిశను నిర్ణయించు కోవాలి.

“దిశావర్గ ఫలితములు..

ప్రతీవారికి వారి జన్మగృహము శుభము, తన జన్మగృహము కాక మరియే ఇతర కారణములవల్లనైన ఇంకో గృహమున నివసించవలసి వచ్చినా తప్పక “సింహద్వారం దిశను” శాస్త్రరీత్యా నిర్ణయించుకొని నివసించుట అత్యంత శుభము!

తన స్వదిశలో సింహద్వారము ఉండుట అత్యంత శుభము. స్వదిశ మొదలుకొని 1,3,7 దిశలు కూడా అత్యంతశుభములే. 2,4,6 దిశలు మద్యమ లేక మిశ్రమ ఫలితాన్ని ఇస్తాయి. 5,8 దిశలు ఎంచుకొనిన బాధలు, ఇబ్బందులు, చింతలు, ధనవ్యయం, అనారోగ్యం అధికమగును! తద్వారా దరిద్రమును అనుబవించ వలసివచ్చును. ఫలితములు వరుసగా....

స్వదిశ అనగా..!

1)పుష్టి 2) సమం 3) మిత్ర 4)సమం 5)శత్రు 6)సౌఖ్యం 7)భోగం 8)వ్యయం. 

వీలైనంత వరకు విదిక్కులైన “ఆగ్నేయం,నైరుతి,వాయవ్యం,ఈశాన్యం” లకు సింహద్వారము ఉండకుండా చూచుట శుభము. గృహమునకు “గేహము” అని పేరు వున్నది! వాస్తుపురుషుని స్వరూపము మానవదేహము లాంటిది. అందుకు వాస్తుపురుషుని పూజ అంటే... తనచే కట్టబడిన గృహమునకు పూజ అని అర్ధము.

 “సర్వాంగే నయనం ప్రధానం“ అనగా అన్ని దేహ అంగములలో కళ్ళు ప్రధానమైనవి, అదేవిధంగా “ గేహన్గే సింహద్వారం ప్రధానం” అంటే ఇంటికి సింహద్వారం చాలా ప్రధానం అని అర్ధం.

“గృహస్తస్య సర్వ క్రియాన సిద్యంతి గృహం వినా” అని శాస్త్ర వాక్యము. అనగా స్వగృహము లేకుండా, పరుల గృహములలో ఎన్నాళ్ళు, ఎన్ని సత్కర్మలు ఆచరించినా పరిపూర్ణముగా సిద్ధిoచవు. ఆ సత్కర్మల ఫలితమును సంపూర్ణముగా పొందుట కష్టసాద్యము. అందుకే చిన్నదో,పెద్దదో తమది అనే ఒక గృహము చాలా అవసరము!

ఇహ పరముల సాధనము గృహము. చెడు పాత్రలో కాచిన పాలు విరిగిపోయిన విధముగా, చవిటి నెలలో వేసిన పంట పండనట్లు, వాస్తు సరిలేని గృహమునందు నివాసము నిష్ప్రయోజనం. గృహమునకు సింహద్వారము యెంత ప్రధానమో, గృహము శల్య వాస్తు మరియు ఇంటిలోపల వున్న గదుల నిర్మాణము, వాటి స్థితి కూడా అంతే ప్రధానము. కావున తామందరూ శాస్త్రపరిజ్ఞాన సహాయతతో అందమైన, శుభ వాస్తు పరమైన గృహములను నిర్మించుకొని, ఉత్తమ ఫలితాలను పొందాలని ఈశ్వరుని ప్రార్ధిస్తూ...

Famous Posts:

పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ


హనుమ నామస్మరణం సర్వపాప నివారణం


స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము

గృహప్రవేశం, Gruha Pravesam, gruhapravesam in telugu pdf, gruhapravesam invitation, gruhapravesam procedure in telugu, gruhapravesam muhurtham 2021 telugu, Housewarming Ceremony

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

Post a Comment

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.