హనుమంతుడు భూత ప్రేత పిశాచాల నుంచి మనల్ని రక్షించడానికి కారణమేమిటో తెలుసా? Hanuman saved us from ghosts and ghosts?
హనుమంతుడు భూత ప్రేత పిశాచాల నుంచి మనల్ని రక్షించడానికి కారణమేమిటో తెలుసా?
ఆంజనేయ స్వామి ఆలయం లేని గ్రామం అంటూ ఉండదు.అదేవిధంగా ఆంజనేయస్వామి ఫోటో లేదా విగ్రహం కూడా లేని ఇల్లు ఉండదు. ప్రతి ఒక్కరి ఇంటిలో ఆంజనేయస్వామి ప్రతిమ తప్పకుండా మనకు దర్శనమిస్తుంది.
మన హిందూ దేవుళ్ళలో ఆంజనేయ స్వామికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. రామాయణంలో శ్రీ రామచంద్ర ప్రభుకి ఆంజనేయుడు నమ్మినబంటుగా ఉంటాడు. ఈ క్రమంలోనే భక్తులు శ్రీరామచంద్రుని పూజించిన లేదా ఆంజనేయుడుని పూజించిన ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉంటాయి. ఆంజనేయుడు శ్రీరాముడికి ఏ విధమైనటువంటి భక్తుడో మనకు తెలిసిందే.
ఇక రామభక్తులు ఆంజనేయ స్వామిని పూజించడం కూడా చేస్తుంటారు. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఏ విధమైనటువంటి దోషాలు, గ్రహస్థితులు, భూత ప్రేత పిశాచాల భయం ఉండదని భావిస్తారు.ఈ విధంగా భూతాలకు భయపడేవారిని ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకెళ్లి అక్కడ స్వామివారి తాయెత్తులు కట్టించడం ద్వారా వారికి ఆ భయం తొలగిపోతుందని భక్తుల విశ్వసిస్తుంటారు.
అదే విధంగా ఇలాంటి భయాందోళనలో ఉన్నవారు ఎక్కువగా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనే మంత్రాన్ని జపిస్తూ ఉండటం వల్ల వారికి ధైర్యం కలుగుతుందని భావిస్తారు. నిజంగానే ఆంజనేయస్వామి పిశాచాల నుంచి మనల్ని రక్షిస్తాడా... మనల్ని ఆంజనేయ స్వామి ఈ విధంగా రక్షించడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం...
రామనామం ఎంత మధురమైనదో ఆంజనేయస్వామి ఎంతో అద్భుతంగా వివరించారు. ఈ క్రమంలోనే విష్ణుమూర్తి తన రాముడి అవతారాన్ని చాలిస్తూ ఆంజనేయుడికి ఒక విషయం చెప్పి తప్పకుండా పాటించాలని చెబుతాడు. ఈ క్రమంలోనే శ్రీరాముడు తన తనువు చాలిస్తూ.. “హనుమా కలియుగం అంతమయ్యేవరకు భూలోకంలో ఉండి సజ్జనులను కాపాడాలని వారికి కలిగే భయం, ఆందోళన, భూత ప్రేత పిశాచాల నుంచి వారిని కాపాడి వారిలో ధైర్యం నింపాలని ఈ భూలోక వాసులకు నువ్వు రక్షణ కల్పించాల”ని చెబుతూ తన అవతారాన్ని చాలిస్తాడు.
ఈ విధంగా శ్రీ రాముడు ఆంజనేయుడి కోరిక కోరడంతో శ్రీ రాముడి ఆజ్ఞను హనుమంతుడు నెరవేరుస్తానని మాట ఇవ్వడం వల్ల ఆంజనేయస్వామి కలియుగంలో భక్తులకు రక్షణగా ఉండి వారికి కలిగే భయాందోళనలను నుంచి రక్షిస్తున్నాడు.
Famous Posts:
> మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి
> సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం
> మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.
> భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?
> మహాభారతం నుండి నేరచుకోవలసిన 12 ముఖ్యమైన విషయాలు.
> భారతీయులు ప్రతి ఒక్కరూ తెలుసుకోదగినవి అద్భుతమైన దేవాలయలు
hanuman, anjaneyaswamy, ghosts, hanuman chalisa, sri rama, hanuman mantram telugu,
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Great article very informative thanks for sharing hanuman ji image
ReplyDelete