Drop Down Menus

నాగ పంచమి విశిష్టత ఏంటి ? అసలు ఎందుకు జరుపుకుంటారు? What is Nag Panchami and why it is celebrated?

శ్రావణ మాసంలో శుక్ల పక్ష పంచమిని నాగ పంచమి లేదా నాగులు పంచమిగా హిందువులు జరుపుకుంటారు. స్కంద పురాణంలో నాగ పంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమ శివుడే వివరించాడు. 

ఈ పంచమి రోజు నాగులను పూజించి, గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి ఆహారం తీసుకుంటారు. నాగ పంచమి రోజున నాగులను పూజించినవారికి విష బాధలు ఉండవు. పవిత్రమైన ఈ రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగాలు బాధించవు. సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి, కార్యసిద్ధి కలుగుతుంది. కాలసర్ప, నాగదోషాలు తొలగిపోతాయి.

నాగ పంచమి 2022 ఎప్పుడు?

ఈ సంవత్సరం నాగ పంచమి 2 ఆగస్ట్ 2022న జరుపుకుంటారు.


నాగ్ పంచమి 2022 శుభ ముహూర్తం

హిందూ క్యాలెండర్ ప్రకారం, పంచమి తిథి ఆగస్టు 2వ తేదీ ఉదయం 05:14 గంటలకు ప్రారంభమవుతుంది, ఇది ఆగస్టు 3వ తేదీ ఉదయం 05:42 వరకు కొనసాగుతుంది. ఆగష్టు 02వ తేదీ ఉదయం 05:24 నుండి 08.24 వరకు నాగ పంచమి పూజ ముహూర్తం ఉంటుంది. ముహూర్తం వ్యవధి 02 గంటల 41 నిమిషాలు.


నాగ పంచమి పూజ - విధానం

> ఉదయాన్నే లేచి స్నానం చేయాలి.

> స్నానం తర్వాత ఇంటి గుడిలో దీపం వెలిగించాలి.

> ఈ పవిత్ర రోజున శివలింగానికి నీటిని సమర్పించండి.

> నాగదేవతను పూజించండి.

> నాగదేవతకు పాలు సమర్పించండి.

> శంకరుడు, మాతా పార్వతి మరియు గణేశుడికి కూడా నైవేద్యాలు సమర్పించండి.

> నాగదేవతకు ఆరతి చేయండి.

> వీలైతే ఈ రోజు కూడా ఉపవాసం ఉండండి.

నాగ పంచమి పూజ సామగ్రి-

నాగదేవత విగ్రహం లేదా ఫోటో, పాలు, పువ్వులు, ఐదు పండ్లు, ఐదు కాయలు, రత్నాలు, బంగారం, వెండి, దక్షిణ, పూజా సామాగ్రి, పెరుగు, స్వచ్ఛమైన దేశీ నెయ్యి, తేనె, గంగాజలం, పవిత్ర జలం, పంచామృతం, పరిమళం, మిఠాయి, బిల్వపత్ర,, జనపనార, రేగు, మామిడి ఆకులు, తులసి గింజలు, మందారం పువ్వు, పచ్చి ఆవు పాలు, రెల్లు రసం, కర్పూరం, ధూపం, పత్తి, చందనం పూజకు ఉపయోగించాలి.

నాగ పంచమిని బ్రహ్మదేవుడు, ఆదిశేషుని అనుగ్రహించిన రోజుగా పరిగణిస్తారు. నాగుల చవితి మాదిరిగానే నాగ పంచమి నాడు నాగ దేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు. సర్పపూజతో సంతాన ప్రాప్తి, రాహు-కేతు దోషాలు తొలగిపోతాయి. నాగపంచమి రోజున శ్రీకాళహస్తీశ్వరునికి అభిషేకం చేసిన వారికి సకలసంపదలు కలిగి, రాహు, కేతు, సర్ప, కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. నాగ పంచమి రోజు అనంత పద్మనాభ స్వామికి అభిషేకం, అలంకారాలు చేయించిన వారికి ఈతి బాధలు తొలగి, ఆర్థిక ఇబ్బందులు సమసిపోతాయి.

యమునా నదిలో శ్రీకృష్ణుడు కాళీయ మర్దనం చేసిన రోజునే నాగపంచమిగానూ, గరుడ పంచమిగానూ జరుపుకుంటారని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొన్నారు. నాగ పంచమి రోజున పుట్టకు పూజలుచేసి పాలు పోస్తారు. నాగదేవతలకు నీరు, పాలు, పసుపు, కుంకుమతో అభిషేకం చేస్తారు. పసుపు రంగు దారాలను చేతికి కట్టుకుంటారు. కొందరు నాగదేవత బొమ్మలను తయారు చేసి పూజలు చేస్తారు. ఈ రోజున మట్టి తవ్వడం, చెట్లను నరకడం చేయకూడదని పెద్దలు సూచించారు.

నాగ పంచమి వ్రత కథ

పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి వుండేది. ప్రతిరోజూ సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లుగా ఆమెకు కలలు వస్తుండేవట. దానితో ఆమె భయకంపితురాలైంది . ఒక రోజున వారి కులగురువు, వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాధను విన్నారు . ఆయన విని “అమ్మా ” నువ్వు గతజన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు , అందు వలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణకోసం నాగపంచమి నోము నోయమని , ఇపుడు పాముల భయం తొలగి పోతుందని చెప్పెను . ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది. నాగపంచమి వ్రత కధల్లో ఇది ఒకటి.

ఈ కధ వెనుక ఒక సామాజిక మైన హితవు ఉన్నది. ఇతరులకు ఎవ్వరికీ ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని, పాటిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు. ఎవరి విశ్వాశము వారిది అని అనుకోవాలి.

మన సంస్కృతిలో పాములు పూజింపబడుతున్నాయి. అలాగే యోగాలో కూడా ఇవి ఎంతో ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి.. ఒక విధంగా చూస్తే, పాము ‘కుండలినికి’ సంకేతం. స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల, పామును కుండలినికి సంకేతంగా చూస్తారు. ఇంకో అంశం ఏమిటంటే పాము జీవ పరిణామక్రమంలో చాలా ముఖ్యమయిన మలుపు. జీవపరిణామ క్రమంలో ‘శారీరక పరంగా వానరం ప్రముఖ స్థానంలో ఉంటుంది, అలాగే ‘శక్తి’ పరంగా సర్పం విశిష్ట స్థానంలో ఉంటుంది. మరో అంశం ఏమిటంటే సర్పాలు కొన్ని రకాల శక్తులకు ఎంతో స్పందిస్తాయి. ఎక్కడ ధ్యానానికి అనుకూలంగా ఉంటుందో లేక యజ్ఞయాగాదులు నిర్వహింప బడుతుంటాయో అక్కడికి నాగసర్పాలు ఆకర్షింపబడతాయి. అలాగే వీటి గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.

కాలసర్ప దోషం ఉన్నవారు, ప్రత్యేకంగా నాగ పంచమి రోజున నాగ దేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు. కాలసర్ప దోషం ఉన్నవారికి అనేక కష్టాలు ఎదురౌతాయి. శారీరక అనారోగ్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురౌతాయి. సవ్యంగా జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది. ఊహించని అవరోధాలు వస్తుంటాయి. ఏదో రూపంలో మానసిక అశాంతి కలుగుతుంది. అలాంటప్పుడు, నాగ పంచమి నాడు పుట్టలో పాలు పోసి, కాలసర్ప దోష శాంతి చేయించుకోవాలి. దాంతో దోష నివారణ కొంత జరుగుతుంది.

పుట్టలో పాలు ఈ క్రింది శ్లోకం చదువుతూ పోయాలి

విషాణి తస్య నశ్యంతి

నటాం హింసంతి పన్నగాః

న తేషా సర్పతో వీరభయం

భవతి కుత్ర చిత్।।


ఈక్రింది శ్లోకం మననం చేసుకోని పుట్టకు ప్రదక్షిణలు చేస్తే, నాగదోషం మరియు కలిదోషం నశిస్తాయని నమ్మకం


కర్కోటకస్య నాగస్య

దమయంత్యాః నలస్య చ

ఋతుపర్ణస్య రాజర్షేః

కీర్తనం కలినాశనం।।

Famous Posts:

సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత


శివదేవుని సోమవారపు నోము కథ


తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?

నాగ పంచమి, nag panchami, nag panchami telugu, nag panchami pooja, nag panchami video, nag panchami story, nag panchami date, sravana masam, nagula chavithi

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.