Drop Down Menus

ఆనందంగా ఉండాలంటే తొలగించుకోవలసిన మరియు వదిలించుకోవలసిన విషయాలు | Don't ignore these things to be happy in life

ఆనందంగా   ఉండాలంటే    మనలో తొలగించుకోవలసిన  మరియు  వదిలించుకోవలసిన  ఈ చెత్త  ఏమిటో చూద్దాం…

1.  పనికిమాలిన  మరియు ఇబ్బంది పెడుతున్న బంధాలను, బంధుత్వాలను మనసులోంచి బయటపడేయండి:

అదేమిటండి?  అంతమాట అనేసారు   అని మీకు అనిపించవచ్చు.  కాని తప్పదు. మనకు చికాకులు తెప్పిస్తూ  మన ఆనందాన్ని హరించి వేస్తూన్న బంధాలు ..  స్నేహాలు  మనసులోంచి  బయట పడేయండి.  ఎంతకూ మారని వారిని మారతారని ప్రయత్నించడం.. మనం ఎంత  సర్డుకుపోతున్నా  మన గురించి  నలుగురికి    చెడు ప్రచారం చేసేవారిని  పట్టుకొని వేలాడటం వలన   మన ఆనందం  ఆవిరై పోతుంటుంది.

మన కన్నా మనకి ఎవరూ ముఖ్యం కాదు..!   అటువంటి వారు  ఫేస్ బుక్ స్నేహితులైనా,  వాస్తవ ప్రపంచం లోని స్నేహితులైనా, బంధువులైనా, రాబందువులైనా జాగ్రత్త గా  పరిశీలించి   ఒకటికి రెండు సార్లు ఆలోచించి సెలెక్ట్ చేసి డిలిట్  బటన్  నొక్కండి..!  ఆనందాన్ని కాపాడుకోండి..!

2.  ఒత్తిడి కి దూరంగా ఉండండి:

జీవితం ప్రెషర్ కుకర్ కాదు. ప్రతీ    చిన్న విషయానికి పెద్ద విషయానికి తీవ్ర ఒత్తిడికి లోనవడానికి. ఒత్తిడికి లోనైతే  ఆనందమే కాదు  ఆరోగ్యం కూడా   అటక ఎక్కుతుంది.   మనం ముందు ఉంటేనే కదా...    ఆయా పనులు అయ్యేవి లేనివి చూడటానికి!  జరిగేవి ఎలాగు జరగక మానవు. కాబట్టి  ప్రతీ విషయానికి తీవ్రంగా స్పందించి  ఒత్తిడి తెచ్చుకొనే తత్వాన్ని  వీలైనంత త్వరలో తుడిచి అవతల పారేయండి.

3.  ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టే చెడు అలవాట్లకు స్వస్తి చెప్పండి:

అతి నిద్ర కాని, బద్ధకం గాని, సోమరి తనం గాని, అతి స్నేహాలు గాని,  ఫేస్ బుక్ గాని, చాటింగ్ కాని, బాతాఖానీలు  గాని, విండో షాపింగ్ కాని, ఇలా ఏవైనా  అలవాట్లు  తాత్కాలికంగా మీకు ఆనందం కలిగిస్తున్నా శాశ్వతంగా తీవ్ర ఇబంది కలిగించవచ్చు.  కాబట్టి  ఇలాంటి చెడు అలవాట్లు ఏమిటో గుర్తించి ఫినాయిల్  వేసి కడిగి అవతల పారేయండి.

4.  ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరచాలని ప్రయత్నించకండి:

భగవంతుడు ఈ జీవితాన్ని మనకి కానుకగా ఇచ్చాడు.  ఆనందంగా జీవిస్తూ నలుగురినీ ఆనందంగా ఉంచడం మంచిదే  కాని అందరినీ సంతృప్తి పరచడం వలన  మనం ఆనందంగా  ఉంటాం అనుకోవడం కన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు.  ఆత్మ సంతృప్తిని మించిన ఆనందం ఎక్కడా ఉండదు.  కాబట్టి  ప్రతి ఒక్కరిని ఆఖరికి ఇంట్లో పనిమనిషిని, వాచ్ మేన్ ని   ఆఫీస్ లో బాస్ ని,    కొలీగ్స్  ని, బంధువుల్ని  అందరినీ సంతృప్తి పరుస్తూ  జీవించాలనే మీ మహా యజ్ఞం మీద చన్నీళ్ళు పోసి   హాయి గా ఉండండి.

5.  ఎవరో అపార్థం చేసుకున్నారు  సరిగా అర్థం చేసుకోలేదు అనే భావాన్ని విడిచి పెట్టండి:

ఉదాహరణకి మీరు కొరియా లేదా జపాన్ సినిమా చూసారు..  మీకు ఒక్క ముక్క అర్థం కాలేదు.  అది ఎవరి తప్పు ఆసినిమా డైరెక్టర్ దా,  హీరో దా,  లేదా ఆసినిమా ఆడుతున్న   థియేటర్ దా?     ఆభాష రాకుండా  చూసిన మనదే కదా!   అంటే ఎవరో గాడిద మనల్ని సరిగా అర్థం చేసుకోలేక  ఓండ్ర పెడుతుంటే     ఆ తప్పు ఎవరిదీ.  అదేంటండి  గాడిద అనేసారు అంటారా?  సారీ  గాడిదను అవమాన పరిచినందుకు.  వాళ్లకు మనం అర్థం కాకపొతే  మంచి డిక్షనరీ  కొనుక్కొని  నేర్చుకోమనండి.   ఎవరో అపార్థం చేసుకున్నారని ముక్కు చీదు కొని ఏడుపు మొదలెట్టవద్దు! ముందు మొహం  కడుక్కొని  అద్దంలో మీ ముఖారవిందాన్ని ఆనందించండి.

6. ఎవరినీ  అనవసరంగా అనుకరించవద్దు!  

మీరు మీరే..! ఎవరి నుండైనా ప్రేరణ   పొందండి తప్పు లేదు!  కాని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు  గుడ్డిగా ఎవరినీ   అనుకరించడానికి ప్రయత్నించవద్దు.  ఎందువలన అంటే  ఒకరిని అనుసరించాలని  లేదా   ఒకరిలా ఉండాలని ప్రయత్నిస్తే   అది  లేని పోని తలనొప్పులకు దారి తీస్తుంది.  అనుకరణ వేరు అనుసరణ  వేరు,  అనుకరణ  అనేది మూర్ఖత్వం!  మన వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని  దెబ్బతీస్తుంది. అనుసరణ  మన వ్యక్తిత్వానికి     కొత్త సొగసులు అద్దుతుంది. మనం మనలా ఉండటం లో  ఆనందం.  మనలను మనం గా  స్వీకరించడంలో ఉన్న ఆత్మ సంతృప్తి దేనిలోనూ ఉండదు.

7. ఎవరిని  విపరీతంగా ద్వేషించవద్దు!అలా అని ఎవరిని విపరీతంగా ప్రేమించవద్దు:

*అతి సర్వత్రా వర్జయేత్..!   ద్వేషం  అనర్థదాయకం.

Famous Posts:

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే


అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం


అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం


ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే


గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

పురాణ కథలు, Telugu Devotional Stories, devotional stories, happy life, life story's telugu


ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.