Drop Down Menus

మొదటి సారి తిరుమల శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణ చేసే వారికోసం | For first time Angapradakshina at Tirumala Srivari Temple

మొదటి సారి తిరుమల శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణ చేసే వారికోసం..

అంగప్రదక్షిణ చేసేవారు రాత్రి 12 గంటలప్పుడు శ్రీవారి పుష్కరిణిలో ఒంటిమీద బట్టలతోనే మూడు మునకలు వేసి అలాగే తడి బట్టలతో వైకుంఠం 1 క్యూ కాంప్లెక్స్ స్పెషల్ ఎంట్రీ దర్శనం క్యూద్వారా వెళ్ళాలి.

(రిపొర్టింగ్ టైమ్ రాత్రి ఒంటిగంటకు. క్యూ దగ్గరకు చేరుకోవలసి ఉంటుంది)

అక్కడ సెక్యూరిటీ చెక్ లొ మీ టికెట్, ఐడి చూపించాక లొనికి అనుమతిస్తారు.

స్త్రీలకు సెపరేట్ లైన్లో సెపరేట్ వెయిటింగ్ హాల్లో కి ప్రవేశం ఉంటుంది.

అలాగే పురుషులకు సెపరేట్ వెయిటింగ్ హాల్లో కి ప్రవేశం ఉంటుంది.

దాదాపు 2:45 pm సమయంలో మొదట స్త్రీలను అంగప్రదక్షిణకోసం పంపడం జరుగుతుంది.తరువాత పురుషులకు అనుమతి ఉంటుంది.

అంగప్రదక్షిణ లైన్ ప్రవేశానికి ముందే సుప్రభాత సేవ మొదలవుతుంది.

సుప్రభాతం జరుగుతున్న సమయంలోనే స్త్రీలకు అంగప్రదక్షిణ పూర్తై తిరిగి వారిని వెండి వాకిలి ముందు ఉన్న ధ్వజస్తంభం దగ్గర కూర్చోబెటతారు.

స్త్రీలందరూ ప్రదక్షిణ పూర్తి చేసి వెండి వాకిలి బైటకు రాగానే పురుషులను అంగప్రదక్షిణకు అనుమతి ఉంటుంది.

పురుషులు ప్రదక్షిణ పూర్తి కాగానే వారిని వెండి వాకిలి బైట కళ్యాణ మండపం వద్ద కూర్చుబెటతారు.

ఈలొపు శ్రీవారి సుప్రభాత సేవ పూర్తవుతుంది దర్శనం చేసుకొన్న భక్తులు బైటకు రాగానే అంగప్రదక్షిణ భక్తులు స్త్రీలను దర్శనం కోసం అనుమతించిన వెంటనే పురుషులను అంగప్రదక్షిణకు అనుమతిస్తారు.

గమనిక: 

స్వామి వారి పుష్కరిణి స్వామి దర్శనం పూర్తయ్యాక బైటకు వచ్చే ద్వారం ముందు ఉన్న పుష్కరిణి గేటు రాత్రి 12 గంటల సమయంలో తెరిచి ఉంచుతారు అంగప్రదక్షిణ భక్తులు స్నానం చేయడానికి.

(ప్రదేశం మ్యాప్ లో రెడ్ సర్కిల్ గుర్తు ఉంది ఫొటోలో గమనించగలరు )

అంగప్రదక్షిణ కోసం వెళ్ళే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ వస్త్రధారణలోనే వెళ్ళవలసి ఉంటుంది.

పురుషులు పంచె పైన కండువా వెసుకోవచ్చు షార్ట్, ట్రాక్ ప్యాంట్,టి షర్ట్,చోక్కా అనుమతించరు.

పురుషులకు అంగప్రదక్షిణ పంచతో ఇబ్బంది అనుకుంటే నేను వేసుకెళ్ళినట్టు షార్ట్ వేసుకుని పైన పంచె ధరిస్తే ఇబ్బంది ఉండదు.

స్త్రీలకు కూడా సాంప్రదాయం వస్త్రాలు ధరించిడం తప్పనిసరని గమనించగలరు.

ప్రదక్షిణ ఎలా ఉంటుంది? ఎన్నీ ప్రదక్షిణలు??

ప్రదక్షిణ స్వామి వారి బంగారు వాకిలి (బావీ) ముందు నుంచి సాష్టాంగ నమస్కారం చేసినట్లు పడుకుని అలాగే ప్రదక్షిణలు చేస్తూ శ్రీవారి ప్రాకారం చూట్టూ శ్రీవారి హుండీ (ధనలక్ష్మి విగ్రహం వరకు) ప్రదక్షిణ పూర్తి చేయాలి.

ప్రదక్షిణలు చేయడం (దొర్లడం) లొ ఇబ్బంది కలగకుండా (స్త్రీలు) శ్రీవారి సేవకులు పర్యవేక్షణలో పాల్గోంటారు కాబట్టి ఎవరు ఇబ్బంది పడనవసరం లేదు.

అంగప్రదక్షిణ టిక్కెట్ ఖరీదు ఎంత?

అంగప్రదక్షిణ టిక్కెట్ కోసం ఒక్క పైసా ఖర్చు చేయనవసరం లేదు.

అంగప్రదక్షిణతొపాటు శ్రీవారి దర్శనం 1 ఉచిత లడ్డూ ప్రసాదం భక్తులందరికీ అందిస్తారు.

ఆన్లైన్ ద్వారా ఈ అంగప్రదక్షిణ టిక్కెట్ ఉచితంగా పొందొచ్చు.

కేవలం మీ మోబైల్ నెంబర్ తొ టికెట్ బుక్ చేసుకోవచ్చు.

నేను మొదటి సారే  ఈనెల 21/06/2022 మంగళ వారం శ్రీవారి సన్నిధిలో అంగప్రదక్షిణ దర్శనం చేసుకోవడం జరిగింది.

అంగప్రదక్షిణకు ముందు నాకున్న సందేహాలు మీలో మొదటి సారి వెళ్ళేవారికి ఉపయోగపడుతుందని ఈ వివరాలు మీ ముందుకు తెచ్చాను.

శ్రీవారి భక్తులకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్స్ ద్వారా చెప్పండి నాకు తెలిసింది మీకు తెలియపరుస్తాను.

Famous Posts:

పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ


హనుమ నామస్మరణం సర్వపాప నివారణం


స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము

Angapradakshinam, Tirumala Angapradakshinam , Tirumala, TTD, angapradakshinam benefits, tirumala angapradakshinam ticket timings, angapradakshinam online booking for tirumala

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.