నిద్ర లేవగానే ఇలా చేస్తే మీ జీవితం మారి పోతుంది. | If you do this when you wake up, your life will change
కొన్ని ముఖ్యమైన విషయాలు..
నిద్ర లేవగానే కళ్ళు తెరవకుండా రెండు చేతులు బాగా రాపిడి చేసి ఆ వేడితో కళ్ళు తుడుచుకున్న తరువాత రెండు అరచేతులు కలిపి ఎదురుగా పెట్టుకుని నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ మొదట అరిచేతులు చూసుకోవాలి. రాత్రంతా కళ్ళు మూసుకుని నిద్రపోవడం వలన కళ్ళల్లో కేంద్రీకృతమైన శక్తి కళ్ళు తెరిచి మొదటగా దేనిని చూస్తామో దానిలోకి వెళ్ళిపోతుంది. అందుకని మన చేతులనే చూసుకోవాలి.
1)కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కర దర్శనం!!
మంచం నుండి దిగిన తరువాత ఒకసారి భూమిని స్పృశించి నమస్కారం చేసుకొని ఈ క్రింది శ్లోకం చెప్పాలి. ఒకవేళ వయోభారం వలన వంగ లేకపోతే చేతులు జోడించి నమస్కారం చేసుకోవచ్చు. మన జీవనమంతా భూమిమీదనే కనక ఆమెను ప్రార్థించకుండా దయనందిన జీవితాన్ని ప్రారంభించకూడదు.
2)సముద్ర వసనే దేవి పర్వత స్థనమండలే!
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే!!
ఇక స్నానం చేసేముందు ఒకసారి నీటిని స్పృశించి క్రింది మంత్రం చెబుతూ ఆ నీటిలోకి నదులన్నీ వచ్చి చేరినట్లుగా భావించాలి. ఆ నీటి రూపంలో కూడా భగవంతుడే ఉండి మన దేహాన్ని శుద్ధి చేస్తున్నాడని ఒకసారి స్మరించాలి.
3)గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు!!
స్నానం చేసి రాగానే ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి నమస్కారం చేసి ఈ క్రింది శ్లోకం చెప్పాలి.
4)ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర!
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే!!
సప్తాశ్వ రధమారూఢం ప్రచండం కస్యపాత్మజం!
శ్వేత పద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం !!
ఉపనయనం అయినవారైతే సూర్యునికి మూడుసార్లు అర్ఘ్యమిచ్చి యజ్ఞోపవీతాన్ని చేతితో పట్టుకొని దశగాయత్రి జపించాలి. ఒకవేళ తులసి కోటలో నీళ్లు పోసే అలవాటు ఉంటే ఈ క్రింది మంత్రం చెబుతూ పోయాలి.
5)యన్మూలే సర్వ తీర్థాని, యన్మధ్యే సర్వదేవతా
యదగ్రే సర్వ వేదశ్ఛ, తులసి త్వాం నమామ్యహం!!
ఇకపోతే నిత్య పూజ ఎవరు ఎలా చేసుకుంటారో అలాగే కొనసాగించాలి. పూజానంతరం దేవునికి నమస్కారం చేసుకుని ఇష్ట దైవాన్ని లేదా సద్గురువును క్రింద విధంగా ప్రతిరోజు ప్రార్థన చేయాలి.
6)గురు బ్రహ్మ మొదలగు ప్రార్థనా శ్లోకాలు చెప్పుకున్న తర్వాత క్రింది గురుపరంపరా వందనం చేయాలి.
సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం!
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం!!
దత్తాత్రేయ సమారంభాం నృసింహయతివర మధ్యమాం!
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం!!
ఓ సమర్థ సద్గురు దత్తాత్రేయా.. త్రిమూర్తి స్వరూపా సద్గురునాథ(ఇక్కడ ఎవరి ఇష్ట దైవము లేదా సద్గురువులను వాళ్లు స్మరించుకోవచ్చును) నాకు సద్బుద్ధిని ప్రసాదించి సన్మార్గంలో నడిపించండి. నా జన్మ సార్ధకమై నా జీవితం నాకు నా సాటి వారికి కూడా శ్రేయోదాయకంగా ఉండేటట్లు తీర్చిదిద్దండి. నాలోని అరిషడ్వర్గములను జయించ నేను అసక్తుడను కనుక వాటిని జయించే శక్తిని మీరే ప్రసాదించండి. అనేక వ్యామోహములలో చిక్కి పతనం కాకుండా ఎప్పటికప్పుడు తగిన ప్రేరణ కలిగించండి. నా చిత్తము సర్వకాల సర్వావస్థల యందు మీ పాదారవిందములయందు లగ్నమై ఉండే విధంగా అచంచలమైన భక్తి శ్రద్ధలను ప్రసాదించండి. పాహిమాం పాహిమాం పాహిమాం.. రక్షమాం రక్షమాం రక్షమాం.
మంత్ర రహితంగా భోజనం చేస్తే మరుజన్మలో మిడతగా పుడతామని శ్రీగురు చరిత్రలో ఎన్నోసార్లు చదివి ఉన్నాము కదా? మరి మంత్ర సహితంగా భోజనం చేస్తున్నామా? కనుక ఇకనుండి అయినా భోజనం చేసే ముందు ఈ క్రింది మంత్రాలను చెప్పుకుందాం. భోజనం చేసే ముందు దానిని ప్రకృతి ద్వారా ప్రసాదించిన దైవాన్ని ఒకసారి స్మరించుకొని కృతజ్ఞతగా కొద్దిగా ఆహారాన్ని ఆరు బయట పెట్టకపోతే అది దొంగ తిండి పాపపు తిండి అవుతుందని గీతా వాక్యం.
7)బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం! బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా!!
అహం వైశ్వా నరో భూత్వా ప్రాణినామ్ దేహమాశ్రితః!
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం!!
అన్నం బ్రహ్మ , రసో విష్ణుః, భోక్తాదేవో మహేశ్వరః
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే !
జ్ఞాన వైరాగ్య సిద్యర్ధం భిక్షాం దేహీచ పార్వతి!!
అందరం భక్తితో " శ్రీమాత్రే నమః " అని వ్రాసి అమ్మ వారి అనుగ్రహం పొందుదాం.. ఎంత స్మరిస్తే అంత త్వరగా అనుగ్రహిస్తుంది ఆ జగన్మాత
Famous Posts:
> హనుమ నామస్మరణం సర్వపాప నివారణం
> స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
Tags: ఉదయం నిద్ర లేవగానే, waking up benefits, storys,devotional story's telugu, morning
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment