Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

సంతానం కోసం షష్ఠి దేవి స్తోత్రాన్ని పఠించండి | Sashti Devi Stotram in Telugu

సంతానం కోసం షష్ఠి దేవి స్తోత్రాన్ని పఠించండి..

సంతానం లేని వారు, భక్తిగా ఈ క్రింద స్తోత్రాలను పఠిస్తే.. దీర్ఘాయుష్మంతుడు గుణవంతుడైన సుపుత్రుడు జన్మిస్తాడని పురోహితులు అంటున్నారు. 

*ఓం శ్రీ సుబ్రహ్మణ్య కుటుంబిన్యై నమః*

*ధ్యానం :

శ్రీమన్మాతరం అంబికాం విధి మనోజాతాం సదాభీష్టదాం

స్కందేష్టాం చ జగత్ప్రసూం విజయాదాం సత్పుత్ర సౌభాగ్యదాం 

సద్రత్నా భరణాన్వితాం సకరుణాం శుభ్రాం శుభాం సుప్రభాం 

షస్టాంశాం ప్రకృతేః పరం భగవతీం శ్రీ దేవసేనాం భజే 

షస్టాంశాం ప్రకృతేః శుద్ధాం సుప్రతిష్టాం చ సువ్రతాం 

సుపుత్రదాం చ శుభదాం దయారూపాం జగత్ప్రసూం 

శ్వేత చంపక వర్ణాభాం రక్తభూషణ భూషితాం 

పవిత్రరూపాం పరమం దేవసేనాం పరాంభజే

*షష్టిదేవి స్తోత్రం :

నమో దేవ్యై మహాదేవ్యై, సిద్ధ్యై, శాంత్యై నమో నమః 

శుభాయై దేవసేనాయై, షష్ట్యై దేవ్యై నమో నమః 

వరదాయై పుత్రదాయై, ధనదాయై నమో నమః

సుఖదాయై మోక్షదాయై, షష్ట్యై దేవ్యై నమో నమః

సృష్ట్యై షష్టాంశరూపాయై, సిద్దాయై చ నమో నమః 

మాయాయై సిద్ధయోగిన్యై, షష్టీ దేవ్యై నమో నమః 

సారాయై శారదాయై కా పరాదేవ్యై నమో నమః 

బాలాదిష్టాతృ దేవ్యై షష్టీ దేవ్యై నమో నమః 

కళ్యాణ దేవ్యై కల్యాన్యై ఫలదాయై చ కర్మాణాం

ప్రత్యక్షాయై సర్వభాక్తానాం షష్ట్యై దేవ్యై నమో నమః

పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు 

దేవ రక్షణకారిన్యై షష్టీ దేవై నమో నమః 

శుద్ధసత్వ స్వరూపయై వందితాయై నృణాం సదా 

హింసాక్రోధ వర్దితాయై షష్టీ దేవ్యై నమో నమః 

ధనం దేహి ప్రియం దేహి పుత్రం దేహి సురేశ్వరి 

మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి

ధర్మం దేహి యశోదేహి షష్టీదేవీ నమో నమః 

దేహి భూమిం ప్రజం దేహి విద్యాం దేహి సుపూజితే 

కళ్యాణం చ జయం దేహి, విద్యాదేవి నమో నమః 

ఫలశృతి :

ఇతి దేవీం చ సంస్తుత్య లభే పుత్రం ప్రియవ్రతం 

యశశ్వినం చ రాజేంద్రం షష్టీదేవి ప్రసాదాత 

షష్టీ స్తోత్ర మిదం బ్రహ్మాన్ యః శృణోతి వత్సరం 

అపుత్రో లభతే పుత్రమ్ వరం సుచిర జీవనం 

వర్షమేకం చ యాభక్త్యాసంస్తుత్యేదం శృణోతి చ

సర్వపాప వినిర్ముక్తా మహావంధ్యా ప్రసూయతే 

వీరం పుత్రం చ గుణినం విద్యావన్తం యశస్వినం

సుచిరాయుష్యవన్తం చ సూతే దేవి ప్రసాదతః 

కాక వంధ్యా చ యానారీ మృతపత్యా చ భవేత్ 

వర్షం శృత్వా లభేత్పుత్రం షష్టీ దేవీ ప్రసాదతః 

రోగయుక్తే చ బాలే చ పితామాతా శృణోతి చేత్ 

మాసేన ముచ్యతే రోగాన్ షష్టీ దేవీ ప్రసాదతః 

జయదేవి జగన్మాతః జగదానందకారిణి 

ప్రసీద మమ కల్యాణి నమస్తే షష్టీ దేవతే 

*శ్రీ షష్టీ దేవి స్తోత్రం సంపూర్ణం*

> Click Here More Telugu Devotional Stotrams

shashti devi stotram telugu, sashti devi stotram, sashti devi stotram benefits, sashti devi stotram lyrics, sashti devi, sashti devi stotram pdf, sashti devi stotram in kannada, sashtidevistotram

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు