Drop Down Menus

దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందాలంటే ప్రతిరోజు ఈ మంత్రాన్ని పఠించాల్సిందే..? Dhanvantri Mantra Meaning And Benefits

ఇలా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మందులు మాత్రలు తీసుకున్నప్పటికీ నయం కాకపోయినా ప్రతిరోజు ధన్వంతరి మంత్రాన్ని పాటించడంతో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.ఇలా పురాణాల ప్రకారం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రతిరోజు ఈ ధన్వంతరి మంత్రాన్ని పాటించడం ఎంతో మంచిదని ఈ మంత్రం పాటించడం వల్ల తొందరగా ఈ వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

శ్రీ ధన్వంతరీ మహామంత్రం ధ్యానం | 

అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణాఽమృత 

రోగాన్మే నాశయాఽశేషానాశు ధన్వన్తరే హరే | 

ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం 

స్వభక్తేభ్యోఽనుగృహ్ణన్తం వందే ధన్వన్తరిం హరిమ్ || 

ధన్వన్తరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠన్తి యే | 

అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవన్తి తే చిరమ్ || 

మంత్రం:

ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ [వజ్రజలౌకహస్తాయ] సర్వామయవినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీమహావిష్ణవే స్వాహా.

గాయత్రీ:

ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వన్తరిః ప్రచోదయాత్.

తారకమంత్రం:

ఓం ధం ధన్వంతరయే నమః

మంత్రః:

ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ సర్వభయవినాశాయ సర్వరోగనివారణాయ త్రైలోక్యపతయే త్రైలోక్యనిధయే శ్రీమహావిష్ణుస్వరూప శ్రీధన్వంతరీస్వరూప శ్రీ శ్రీ శ్రీ ఔషధచక్ర నారాయణాయ స్వాహా |

‘‘సుదర్శన వాసుదేవ ధన్వంతరిగా ప్రసిద్ధుడైన దేవదేవునికి నమస్సులు. చేతిలో అమృత కలశాన్ని ధరించినవాడూ, అన్ని భయాలనూ పోగొట్టి, సర్వ రోగాలనూ నివారించేవాడూ, ముల్లోకాలకూ పతి, ముల్లోకాలకూ శ్రేయస్సు చేకూర్చేవాడూ, మహా విష్ణువుకు మారురూపమూ అయిన ధన్వంతరి కృప అందరినీ ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. ఆ ఆయుర్వేద పురుషుడికి నమస్సులు’’ అని భావం.

ఆకస్మిక, దీర్ఘకాలిక వ్యాధుల నివారణకూ, వ్యాధుల వ్యాప్తి కారణంగా కలిగే భయాలన్నీ పోవడానికీ ధన్వంతరిని నిత్యం ప్రార్థించాలి. ‘‘వ్యాధి తొలగిపోవాలి. నేను సంపూర్ణ ఆరోగ్య వంతుణ్ణి కావాలి’’ అని మనసులో గాఢంగా సంకల్పించుకొని, ఈ ధన్వంతరీ మహా మంత్రాన్ని వీలైనన్నిసార్లు పఠించినా, మననం చేసుకున్నా అపమృత్యు భయం తొలగిపోతుందనీ, ఆరోగ్యం సిద్ధిస్తుందనీ పెద్దల మాట.

Famous Posts:

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం


అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం


ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే


గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?


శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

dhanvantari mantram, dhanvantari mantra pdf, dhanvantari beej mantra, dhanvantari mantra 108 times, dhanvantari mantra telugu, dhanvantari gayatri mantra, dhanvantari mantra in english pdf, dhanvantari mantra meaning in telugu

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.