Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

భక్తుడు చెప్పిన మాటను నిజం చేయడానికి అమావాస్య ని పౌర్ణమి గా మార్చేసిన మహతల్లి.. | Sri Abirami Amman Temple

ఎన్నిసార్లు ఈ కధ విన్నా, తమిళ్ లో ఎన్ని సార్లు ఈ సినిమా చూసిన భక్తితో భావోద్వేగంతో ఏడుస్తుంటాను ఎంత కరుణ ఆ తల్లిది అమాయకులు అయిన తన బిడ్డలను రక్షించుకోవడానికి ,భక్తుడు చెప్పిన మాటను నిజం చేయడానికి అమావాస్య ని పౌర్ణమి గా మార్చేసిన మహతల్లి.. భక్తులకు అమావాస్య ఏంటి పొర్ణమి అంటి భక్తుల హృదయాల్లో నిండు చందమామ లాగా నిలచి పోయిన అమ్మ రూపానికి తిధులతో పనేముంది కధ చదివిన వారంతా జై అభిరామి అమ్మా భవాని అని నమస్కరించండి.

తిరుకడైవూర్ నిజంగాజరిగినఒకయదార్థసంఘటన 

తనని నమ్మిన భక్తులని కాచి రక్షించెందుకు ఆ పరమేశ్వరి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది..

అలా ఎన్నో సంఘటనలు జరిగాయి వాటిలో ఇదొకటి...

తిరుకడైవూర్ క్షేత్రంలొ "అభిరామి అమ్మవారు" సాత్విక రూపంలో వెలిసి ఉన్నారు అదే క్షేత్ర పరిధిలో అభిరామ భట్టు అనే భక్తుడు కూడా ఉండేవాడు ఈయన ప్రతి రోజు అమ్మవారి ఆలయంలొ ధ్యానంలోనే ఎక్కువ సమయం ఉండేవాడు.

ఆయన ధ్యానస్థితిలో ఉండగా అమ్మవారు ఆయనకి తరచూ దర్శనం ఇచ్చేది.

ఒకనాడు ఆలయంలొ ఆయన ధ్యానం చేసే సమయంలో తంజావూరు చక్రవర్తి అయిన తుందిరా మహారాజు అమ్మవారి దర్శనానికి వచ్చాడు.

అందరు లేచి నిలబడి స్వాగతం పలికారు ఒక్క అభిరామ భట్టు తప్ప, అయన మౌనంగా లోపలకి వెళ్లిపోయాడు.

పూజా కార్యక్రమం ముగించుకొని బయటకు వస్తూ ఉండగా మళ్ళీ అందరు లేచి నిలబడ్డారు ఈయన తప్ప దాంతో మహారాజుకి కోపం వచ్చి ఎవరితను అనగా ఆలయ అర్చకులు పరుగు పరుగున వచ్చి ఈయనొక ఉన్మాది ప్రభూ.. మధిరా పానం వల్ల బాహ్య సృహ లేదు అన్నారు కానీ రాజుకి అనుమానం వచ్చింది.. కారణం ఆయన మొహంలో అమ్మవారి దర్శనం తాలూకా ఆనందం కళ రూపంలో మొహం వెలిగి పోతోంది వెంటనే ఆయన్ని లేపమని చెప్పాడు తుందిరా మహారాజు... భటుడు వెళ్లి కదపగా ధ్యానం నుండి బయటకి వచ్చాడు అభిరామ భట్టు.

వెంటనే మహారాజు ఆయన్ని ఇవాళ తిధి ఏంటి అన్నాడు దానికి అభిరామ భట్టు తడుముకోకుండా పౌర్ణమి అన్నాడు కారణం ఇప్పటి వరకు తను ధ్యానంలొ చంద్రబింబం లాంటి అమ్మవారి మోము చూడటమే చుట్టుపక్కల అందరు ఒక్కసారిగా తలలు పట్టుకున్నారు ఎందుకంటే ఆ రోజు అమావాస్య.. మహారాజు వెంటనే సరే నేను సాయంత్రం వస్తా నాకు చంద్ర దర్శనం చేయిస్తావా అన్నాడు దానికి ఒప్పుకున్నాడు అభిరాముడు.. ఒకవేళ సాయంత్రం చంద్ర దర్శనం నాకు కలుగక పోతే నిన్ను శిక్షిస్తాను అన్నాడు మహారాజు.

సాయంత్రం అయ్యింది అభిరామ భట్టు స్నానాధి కార్యక్రమాలు ముగించుకుని ఆలయంలోకి వచ్చి అమ్మవారికి అంతాది రూపక ప్రార్ధన చేయటం మొదలెట్టాడు (అంటే ఒక శ్లోకం ఏ పదంతో ముగుస్తుందో తర్వాత శ్లోకం ఆ పదంతో మొదలెట్టడం అలా ఆయన ఎన్నో శ్లోకాలు రాసాడు వాటిని అభిరామ అంతాది అంటారు)

అలా శ్లోకాలు చెప్తూ ఉండగా చీకటి పడింది మహారాజు వచ్చాడు నాకు చంద్ర దర్శనం చేయించు అన్నాడు అభిరామ భట్టుతో.. అభిరామ భట్టు శ్లోకం చెప్పడం ఆపలేదు. రాజు మరొక్కసారి అడిగాడు కానీ అభిరామ భట్టు అలాగే చెప్పుకుంటూ పోతున్నాడు..

మహారాజుకి కోపం వచ్చి ఈ దూర్తుడిని శిక్షించండి అనబోతు ఉండగా ఆశ్చర్యంగా ఆకాశంలొ ఒక అద్భుతం జరిగింది అప్పటి వరకు చిమ్మ చీకటిగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా వెలుగులు సంతరించుకుంది.

అక్కడ నిండు చందమామ రూపంలొ అమ్మవారి చెవి తాటంకం ఉంది దాన్ని దర్శించిన తుందిరా మహారాజు, ప్రజలు ఒక్కసారిగా అభిరామ భట్టుకు.. అభిరామి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసారు.

Famous Posts:

ఈ రూల్స్ తప్పక పాటించండి 

కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?


మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా?


భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ? 


వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.


శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు

Sri Abirami Amman Temple, thirukadaiyur temple history in telugu, thirukadaiyur markandeya temple, thirukadaiyur abirami images, thirukadaiyur abirami temple official website, thirukadaiyur, kumbabishekam, abirami temple thirukadaiyur timings, amirthakadeswarar temple

Comments