సీత అగ్ని ప్రవేశం వెనుక కారణం ఏంటి?
రామాయణం గురించి తెలియని భారతీయులు ఉండరు. తండ్రి మాట కోసం అడవులకు వెళ్లిన రాముడు పుట్టుక, సీతారాముల వనవాసం, రామ రావణ యుద్ధం లాంటి విషయాలనే చాలా మంది తెలుసుకుని ఉంటారు. అయితే వాల్మీకి రచించిన సంస్కృత రామాయణం శ్లోకాలతోనే ఉంటుంది. దీన్ని ఇతర భారతీయ భాషల్లోకి అనువదించారు. త్రేతాయుగంలో రాముడు అనుసరించిన విలువలను నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. అయితే సీత అగ్ని ప్రవేశం గురించి మాత్రం సరైన కారణాలను పద్మ పురాణంలో పేర్కొన్నారు. అరణ్యవాసంలో ఉన్నప్పుడు సీతను రావణుడు అపహరించి లంకలో బంధించాడు. అశోకవనంలో సీతను బంధించిన విషయం హనుమంతుడి ద్వారా తెలుసుకున్న రాముడు విముక్తి కలిగించడానికి రావణుడుని సంహరించాడు.
అయితే ఆ సమయంలో సీతను రాముడు అగ్ని ప్రవేశం చేయించి తన స్వచ్ఛతను నిరూపించుకోమన్నాడని అందరూ నమ్ముతారు. కానీ సీతాదేవి అగ్ని పరీక్షకు, పరిత్యాగానికి సంబంధం లేదు. రావణుడు సీతను అపహరించే సమయంలో మాయ సీత అతడి వెంట వెళ్లింది. వాస్తవానికి రాముడు మాయ సీతను పంపి నిజమైన సీత గురించి తెలుసుకోడానికే అగ్ని ప్రవేశం చేయించాడు.
ముని రూపంలో వచ్చిన రావణుడికి శ్రీ మహాలక్ష్మీ సీతగా అవతరించిందనే విషయం తెలియదు. రామలక్ష్మణులు తనను కాపాడేంత దగ్గరలో లేకపోవడంతో సీతమ్మ అగ్ని దేవుని ప్రార్థించింది. అగ్నిలో ప్రవేశించి ప్రాణ త్యాగం చేయలానుకుంది. జానకి ప్రార్థనను మన్నించిన అగ్ని దేవుడు ఆమెను తన జ్వాలలో దాచి మాయ సీతను సృష్టించాడు. ఇది తెలియని రావణుడు ఆమెను నిజమైన సీతగా భావించి అపహరించి లంకకు తీసుకుపోయాడు.
సాక్షాత్తు శ్రీమహావిష్ణువే రాముడిగా అవతరించి ధర్మ సంస్థాపన కోసం రావణుడితో యుద్ధం చేశాడు. రావణుడి గత జన్మ ఫలితంగా శాప విమోచనం కలిగించాడు. యుద్ధం చేసి లంకలోని మాయ సీతను రక్షించిన రాముడు ఆమెను అగ్నిలోకి ఐక్యమై నిజమైన సీతను బయటకు పంపమని కోరాడు. దీంతో మాయ సీత అగ్నిలో ప్రవేశించిన వెంటనే నిజమైన సీత బయటకు వచ్చింది. మాయ సీతను గత జన్మలో వేదవతిగా కొందరు వివరించారు.
Famous Posts:
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
> తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
> సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు
సీత అగ్ని, Sita Agni Pariksha, raamayanam, sitha devi, rama, seetha devi, ravana,