Drop Down Menus

శక్తివంతమైన స్పటిక శివలింగమునకు ఇంట్లో అభిషేకం చేస్తే కలిగే అద్భుత లాభాలు | What is the significance of Spatika Lingam?

శివ మరియు రుద్ర సాధనలో శివలింగం విజయం సాధించడంలో సహాయపడుతుంది.

శివలింగం అన్ని ప్రతికూల ప్రభావాల నుండి మనస్సును క్లియర్ చేస్తుంది.

శివలింగం సంపద మరియు ఆనందాన్ని ఇస్తుంది.

శివలింగం రక్తపోటు మరియు గుండె జబ్బులను నియంత్రిస్తుంది.

శివలింగం దురదృష్టాలను తొలగిస్తుంది మరియు జీవితంలో అదృష్టాన్ని మరియు విజయాన్ని తెస్తుంది.

స్పటిక  శివలింగమునకు ఇంట్లో అభిషేకంతో కలిగే లాభములు :-

1. గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.

2. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. 

3. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. 

4. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు  లభించును.

5. ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును

6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.

7. మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును. 

8. మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.

9.  తేనెతో అభిషేకించిన తేజోవృద్ది  కలుగును.

10. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును. 

11. కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును. 

12. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.

13. భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును. 

14. గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర  ప్రాప్తి కలుగును.

15. బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.

16. నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.

17. అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా  బాగుంటుంది అన్న లింగార్చన).

18. ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.

19. ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.

20. నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.

21. కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును. 

22. నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని  కలిగించును.

23. మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.

24. పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.

(సామూహక అభిషేకానంతరం శేషద్రవ్యములు ఎక్కువుగా మిగులుతాయి వాటిని పేదవారికి,గోవులకు అందించినను  శివునకు ప్రీతిపాత్రులై సకలములు పొందగలరు.)

Famous Posts:

కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?

మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా?


భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ?


వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.


శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు


శివ గుణాలు లోకానికి సందేశాలు


భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?

Spatika Lingam, spatikalingam, spatika lingam original, spatika lingam at home, original sphatik lingam, spatika lingam benefits in telugu, spatika lingam benefits

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.