Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

సర్వ రోగాలకు విరుగుడు ఈ మూడు నామాలు నిత్యం చదివేవారికి కలి ప్రేరితమైన రోగాలు రావు.| These three names are antidote to all diseases

సర్వ రోగాలకు విరుగుడు నామత్రేయాస్త్రం..

నామ త్రయం అంటే మూడు నామాలు. అవి "శ్రీ అచ్యుతాయ నమః, శ్రీ అనంతాయ నమః, శ్రీ గోవిందాయ నమః" ఈ మూడు నామాలు నిత్యం చదివేవారికి కలి ప్రేరితమైన రోగాలు రావు. జబ్బులు ఏమైనా ఉంటే అనతి కాలంలోనే తగ్గిపోతాయి.

ఈ నామాలు ఒక దివ్యౌషధం లా పనిచేస్తుంది. భగవన్నామాలలో ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. అద్భుత మహిమ ఉంది. అందునా కొన్ని నామాలు మరీ విశిష్టమైనవి. అట్టి విశిష్ట నామాల్లో మరీ విశిష్ట నామాలు అచ్యుత, అనంత, గోవింద అన్నవి.

పద్మ పురాణంలో ఈ నామ మహిమ "అచ్యుతానంత గోవింద నామెాచ్ఛారణ భేషజాత్ నశ్యంతి సకలారోగాః సత్యం సత్యం వదామ్యహ" అని మిక్కలి గొప్పగా వర్ణించబడింది.

అంటే "ఈ నామాలను పలకటం అనే మందు చేత సర్వరోగాలు నశించి తీరుతాయి. ఇది సత్యం, నేను సత్యం చెబుతున్నాను" అని దీనర్ధం.

ఇలా రెండు మార్లు సత్యం అని చెప్పటం ద్వారా శ్రీ ధన్వంతరి ప్రమాణం చేసి చెప్పారన్న మాట. క్షీరార్ణవ మథన సమయంలో అవతరించిన మహా మహిమాన్విత పురుషుడు శ్రీ ధన్వంతరి. ఆయుర్వేద వైద్య విద్యలో ఆయనదే ప్రధమ స్థానం. 

పార్వతీదేవి అడుగగా శంకరుల వారు శ్రీమన్నారయణుని లీలల గురించి, కుార్మావతార సందర్భంలో క్షీరసాగరమథన గాథ వినిపిస్తుా ఇలా అన్నారు. పార్వతీ! పాల కడలిలో లక్ష్మీ దేవి అవతరించింది. దేవతలు, మునులు లక్ష్మీనారాయణుని స్తుతిస్తున్నారు. ఆ సందర్భంలోనే భయంకరమైన హాలాహలం పాలకడలి నుంచి ఉద్భవించింది.

ఆ హాలాహలం చుాసి దేవతలుా, దానవులుా భయపడి తలో దిక్కుకి పారిపోయారు. పారిపోతున్న దేవతలను, దానవులను ఆపి, భయపడవద్దని చెప్పి, ఆ కాలకుాటాన్ని నేను మ్రింగుతానని ధైర్యం చెప్పాను. అందరుా నా పాదాలపై బడి నన్ను పుాజించి స్తుతించ సాగారు. 

అపుడు నేను ఏకాగ్ర చిత్తంతో సర్వ దుఃఖ హరుడైన శ్రీమన్నారాయణుని ధ్యానం చేసుకుని ఆయన నామాల్లో ప్రధానమైన ముాడు నామాల్ని

అచ్యుత, అనంత, గోవింద" అన్న ముాడు మహా మంత్రాల్ని స్మరించుకుంటూ ఆ మహా భయంకరమైన కాలకుాట విషాన్ని త్రాగివేశాను. సర్వ వ్యాపి అయిన విష్ణు భగవానుని యెుక్క ఆ నామ త్రయం యెుక్క మహిమ వల్ల సర్వ లోక సంహారకమైన ఆ విషాన్ని సునాయాసంగా త్రాగేశాను. ఆ విషం నన్నేమి చెయ్యలేక పోయింది అని సాక్షాత్తూ సదా శివుడు తెలిపాడు.

కనుక మీరు కూడా "శ్రీ అచ్యుతాయ నమః, శ్రీ అనంతాయ నమః, శ్రీ గోవిందాయ నమః" అన్న "నామ త్రేయాస్త్ర మంత్రాన్ని" పలికేటప్పుడు ఈ మహిమనంతా జ్ఞాపకముంచుకుని, విశ్వాసం పెంచుకుని, మంత్ర మననం చేయడం ద్వారా అనారోగ్య బాధలు తొలగించుకుని, ఆయురారోగ్యాలను పొందవచ్చు.

ప్రతి రోజు ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటితో మీ దినచర్యను ప్రారంబించండి. నీటి గ్లాసును చేత పట్టుకుని " నామ త్రేయాస్త్ర మంత్రాన్ని" కొద్దిసేపు పలికి, ఆ నీటిని మంత్ర బలంతో శక్తివంతం చేసి, తరువాత ఆ నీటిని స్వీకరించండి. ప్రతి రోజు ఇలా చేయడం వలన రోగాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు


ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే


అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం


అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

sri maha vishnuvu, krishna, govinda, vishnu namalu in telugu, vishnu namalu telugu pdf, vishnu ashtothram telugu, 108 names of lord vishnu pdf, vishnu 

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు