నర దిష్టి, నర ఘోష, చెడు దిష్టిని పూర్తిగా తొలగించే గుమ్మడి కాయ | Disti gummadi kaya ela kattali | budidha gummadi kaya pariharalu

నర దిష్టిని పూర్తిగా తొలగించే గుమ్మడి కాయ:

నర దిష్టి, నర ఘోష, చెడు దృష్టి, నర శాపం వంటి దుష్ప్రభావాలు ఇంటికి కానీ, వ్యాపార ప్రదేశానికి కానీ తగిలితే, జీవితం పూర్తిగా నిష్ప్రయోజనం అయి పోతుంది.  దీని వలన అన్ని పనులలో ఆటంకాలు, అపజయం, వ్యాపార నష్టాలు, ఆర్థిక  సమస్యలు, తరచూ అనారోగ్యాలు, కుటుంబంలో అశాంతి, తేలికపాటి ప్రమాదాలు, ఉద్యోగ సమస్యలు వంటి అనేక దుష్ఫలితాలను ఎదుర్కోవలసి వస్తుంది.

గుమ్మడి కాయను ఇంటి ముందు కానీ, వ్యాపార ప్రదేశం ముందు కానీ శాస్త్రీయంగా పూజించి కట్టుకోవడం వలన నర దిష్టి, నర ఘోష, చెడు దృష్టి, నర శాపం వంటి దుష్ప్రభావాలు తొలగి పోతుంది.  శాస్త్రీయంగా పూజించి కట్టిన గుమ్మడికాయ, కాల భైరవుని రూపంలో మీకు రక్షణ గా వుండి, సమస్త చేడు ప్రభావాన్ని తాను స్వీకరించి, మిమ్మల్ని నిరంతరం రక్షిస్తుంది.

గుమ్మడి కాయను అమావాస్య, మంగళవారం, శనివారం రోజులలో, సాయంత్రం 6 మరియు 7 గంటల మధ్య  కట్టుకోవాలి.  ముందుగా మచ్చలు, దెబ్బలు లేని మంచి నాణ్యమైన, పచ్చని రంగు తేలిన బూడిద గుమ్మడి కాయను కొనుగోలు చేసి తీసుకు రావాలి.  సాయంత్రం పూట దీనిని శుభ్రం చేసి, గుమ్మడి కాయను నిలువుగా పెట్టి, తరువాత నిలువునా 3 చందన కుంకుమ బొట్లు పెట్టాలి.  మధ్యలో వున్న బొట్టుకు, కుడి వైపు మరియు ఎడమ వైపు కూడా 2 చందన కుంకుమ బొట్లు పెట్టాలి.  అంటే మొత్తం 5 బొట్లు ఈ పద్దతిలో గుమ్మడి కాయకు పెట్టాలి.

ఆ తరువాత గుమ్మడి కాయ ముందు 2 దీపాలు వెలిగించి, ధూపం వేసి, కొన్ని బెల్లం ముక్కలు నివేదన గా పెట్టాలి.  హారతి ఇచ్చి, "ఓం కాల భైరవాయ నమో నమః" అన్న మంత్రాన్ని కనీసం 11 సార్లు చెబుతూ, అక్షతలు చల్లుతూ ఈ గుమ్మడి కాయను కాల భైరవ స్వరూపంగా  పూజించాలి.  ఈ విధంగా పూజ చేసిన గుమ్మడి కాయను ఇంటి ముందు గాని, వ్యాపార ప్రదేశం ముందు కానీ నల్లని దారంతో  వేలాడదీయాలి.   గుమ్మడి కాయకు నివేదించిన బెల్లం ముక్కలను నీళ్లలో కలిపి ఏదైనా చెట్టు మొదల్లో పోసేయాలి.   ఇలా శాస్త్రోత్తంగా పూజించిన గుమ్మడి కాయ, కాల భైరవుని  రూపంలో ఇంటికి కానీ, వ్యాపార ప్రదేశానికి కానీ రక్షణ గా ఉంటూ, నిరంతరం  నర దిష్టి, నర ఘోష, చెడు దృష్టి, నర శాపం వంటి దుష్ప్రభావాలు ఇంటిపై, వ్యాపార ప్రదేశంపై పడకుండా కాపాడుతుంది.

ఇలా శాస్త్రోత్తంగా పూజ చేసిన కట్టిన గుమ్మడి కాయ కుళ్ళిపోతే, అది నర దిష్టి, నర ఘోష, చెడు దృష్టి, నర శాపం వంటి దుష్ప్రభావాలు మీపై అత్యంత ప్రమాద స్థాయిల్లో ఉందని, మీకు జరగ వలసిన నష్టాన్ని గుమ్మడికాయ తాను స్వీకరించి కుళ్లిపోయింది, అని మీరు అర్ధం చేసుకోవాలి.  మీరు వెంటనే కుళ్లిపోయిన గుమ్మడి కాయను తీసి వేసి, వెంటనే మరలా మరొక్క గుమ్మడి కాయను పైన తెలిపిన ప్రకారం పూజ చేసి కట్టాలి.  ఇలా ఎప్పుడూ ఇంటి ముందు, వ్యాపార ప్రదేశం ముందు, శాస్త్రోత్తంగా పూజ చేయబడిన గుమ్మడి కాయ వేలాడుతూ ఉంటే,  నర దిష్టి, నర ఘోష, చెడు దృష్టి, నర శాపం వంటి దుష్ప్రభావాలు పూర్తిగా తొలగిపోయి మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సమృద్ధిగా లభిస్తుంది.

Famous Posts:

ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు


వారాహీ తల్లిని పూజిస్తే పంటలు బాగా పండుతాయి


శ్రీలక్ష్మీపూజ ఇలా చేస్తే ధనమే ధనం


యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలని ఉంటే, ఈ విధంగా చెయ్యండి


బియ్యపు గింజతో ఇలా చేస్తే ధన లాభం కలుగుతుంది ఎలాగో తెలుసా ?


గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనంగా ఎలా మారిందో తెలుసా ?


ఎంతటి కష్టాన్ని అయిన పోగొట్టే అత్యంత శక్తివంతమైన హనుమ లాంగూల స్తోత్రమ్

గుమ్మడికాయ, Disti, gummadi kaya, budidha gummadi kaya, disti remedies, disti gummadi kaya telugu

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS