Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

నవరాత్రి వ్రతం పూర్తయిన తర్వాత ఉద్వాసన ఏవిధంగా చేయాలి? కలశాన్ని ఏమి చేయాలి? Devi Navaratrulu - Kalasam Pooja

నవరాత్రి వ్రతం పూర్తయిన తర్వాత ఉద్వాసన ఏవిధంగా చేయాలి? కలశాన్ని ఏమి చేయాలి?

నవరాత్ర వ్రతం పూర్తి అయిన తరువాత చెయ్యవలసిన దానిని ఉద్వాసన అంటారు. ఉద్వాసన అంటే మళ్ళీ తమ నెలవులకు పంపుట అని అర్థం. అమ్మవారిని ఆరాధించినప్పుడు ఎక్కడినుంచో తీసుకురారు. సర్వవ్యాపినియైన శక్తిని మనం మంత్రం ద్వారా, భావన ద్వారా మననుండే అందులో ఆవహింపజేస్తాం.

ఆ జగదంబను వివిధ విధములుగా ఆరాధించిన తర్వాత ఏ బింబమునందు ఆరాధించామో ఆ బింబములోని శక్తి మనం స్వీకరించితే మన హృదయంలో అమ్మవారు ఉండి మనలను అనుగ్రహిస్తారు. అందుకు ఆ కలశానికి ఉద్వాసన చెప్తారు. అనగా కలశంలో ఉన్న శక్తిని తిరిగి మన లోపలకి స్వీకరించి ఆ కలశమును ఇంక కదుపుతారు. ఇది ఎప్పుడు చేయాలంటే 'శ్రవణేన విసర్జయేత్' అని చెప్పినట్లుగా... నవమి ఉన్నప్పటికీ శ్రవణా నక్షత్రంలో కూడి ఉన్నప్పుడు ఆ రోజునే విసర్జించాలి అని చెప్పారు. ఆవిధంగా బింబమును తొలగించి బింబము లోని శక్తిని మనలోకి స్వీకరిస్తాం. ఇది ఉద్వాసన కలశాన్ని కదపడంలో ఉన్న ఆంతర్యం.

అయితే చాలా మందికి కలశంపై ఉంచిన కొబ్బరికాయను ఏమి చేయాలో అర్ధం కాదు.కలశం మీద పెట్టిన కొబ్బరికాయను పూజ చేయించటానికి వచ్చిన బ్రాహ్మణులకు ఇవ్వచ్చు.

ఒకవేళ బ్రాహ్మణులు లేకపోతే పారే నీటిలో నిమజ్జనం చేయవచ్చు.కొబ్బరికాయను బ్రాహ్మణులకు ఇచ్చిన లేదా పారే నీటిలో నిమజ్జనం చేసిన ఎటువంటి దోషాలు ఉండవు.

దేవాలయంలో కలశాన్ని పెడితే పూర్ణాహుతి చేస్తారు.అదే ఇంటిలో కలశాన్ని పెడితే కొబ్బరికాయను బ్రాహ్మణులకు ఇవ్వడం లేదా పారే నీటిలో నిమజ్జనం చేస్తూ ఉంటారు.ఇది మన పూర్వీకుల నుంచి ఒక ఆచారంగా వస్తుంది.

మన పెద్దలు చెప్పిన సంప్రదాయాలను అనుసరించటం మన విధి.

[బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి సమాధానం]

Famous Posts:

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

navaratrulu, kalasam, devi navaratrulu pooja, durga, kalasam pooja, navaratrulu udwasana, kalasam pooja telugu

Comments