రాబోయే ఆపదల నుండి మిమ్మల్ని రక్షించే ఉపాయం | A trick to protect you from impending dangers

రాబోయే ఆపదల నుండి మిమ్మల్ని రక్షించే ఉపాయం:

దుష్కర్మ లేదా పాప కర్మల వలన ఎదురయ్యే ఆపదలు, చెడు ఫలితాలు తొలగిపోవడానికి క్రింద తెలిపిన 4 ఉపాయాలు చాలా గొప్పగా పని చేస్తాయి. అవి :

ఒకటి : ఎత్తైన ప్రదేశాల్లో ఆహారము ఉంచడం. ఆకాశ మార్గం లో పయనించే పక్షులు తమ ఆకలి తీర్చుకోవడం కొరకు, మీరు ఉంచిన ఆహారాన్ని స్వీకరిస్తే, మీకు లబించే అపారమైన పుణ్య బలం వలన, అనేక అపదల నుండి మీరు రక్షింపబదతారు. 

రెండు : మనుషులు నడిచే దారిలో, వాహనాలు తిరిగే రోడ్లలో పడి వుండే ముండ్లు, మేకులు, రాళ్ళు లాంటివి మీకు కనబడితే, వాటిని అక్కడనుండి తిసి, ఎవరికి ఇబ్బంది కలగని చోట దూరంగా వేయండి. దీనిచే బాధించబడే వారిని రక్షించిన పుణ్యం మీకు లబించి, రాబోయే అపద నుండి మీరు రక్షింపబడతారు.

మూడు : నిర్జన ప్రదేశాలలో ఆహారం పెట్టటం వలన అక్కడి పశు పక్ష్యాదులు, క్రిమి కీటకాలు వాటితో తమ ఆకలి తీర్చుకుని ఎంతో సంతోషిస్తాయి. దాని వలన లబించే పుణ్య బలంతో మీకు సిరి సంపదలు చేకూరుతాయి. 

నాలుగు : పశు పక్షాదులకు నీరు పేట్టండి. దాని వల్ల అనేక రోగాలు నశిస్తాయి. తీవ్రమైన అనారోగ్య సమస్యల వలన బాధపడే దుస్థితి మీకు తొలగిపోతుంది.

పైన తెలిపిన నాలగు ఉపాయాలను మీకు వీలైనప్పుడల్లా ఆచరిస్తూ వుండండి.  మీకున్న పాప కర్మలు, దుష్కర్మలూ గణనీయంగా తొలగిపోయి. అనేక ఆపదల నుండి, దుస్థితిలనుండి మీరు రక్షింపబడటం తో పాటు, పరమేశ్వరుని అనుగ్రహంతో అనేక మంచి ఫలితాలను మీరు పొందుతారు.

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు


ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు


ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే


అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం


అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

dharma sandehalu, devotional, devotional storys, dharma sandehalu telugu

Comments