పరమేశ్వరుని అనుగ్రహాన్ని, అపారమైన పుణ్య బలాన్ని మీకు ప్రసాదించే పరిహారం..! Dharma Sandehalu - Lord Shiva

భూత బలి : పరమేశ్వరుని అనుగ్రహాన్ని, అపారమైన పుణ్య బలాన్ని మీకు ప్రసాదించే పరిహారం..!

భూతములు అంటే "జీవులు" అని, బలి అంటే "సమర్పణ" అని అర్ధం. కావున జంతువులు, పక్షులు, క్రిమి కీటకాలు వంటి జీవులకు ఆహారాన్ని, మంచి నీటిని అందించడమే "భూత బలి".  భూత బలి అపారమైన పుణ్య రాశిని ప్రసాదిస్తుందని, కావున ఈ "భూత బలిని" ప్రతి ఒక్క గృహస్థులు తప్పకుండా ఆచరించాలని మన "వేదాలు" ఎలుగెత్తి చాటుతున్నాయి.

దేవాలయాలలో కూడా ధ్వజ స్థంభం ముందు "బలి పీఠం" ఉంటుంది.  దేవాలయాలలో దేవత మూర్తులకు "నైవేద్యం" సమర్పించే ముందు, బలి పీఠంపై ఆహారం ఉంచి ఆ తరువాత దేవతా మూర్తులకు నివేదన చేస్తారు.  దేవాలయ పరిసర ప్రాంతాలలో సంచరించే ఆవరణ దేవతలు, జంతువులు, పక్షులు, క్రిమి కీటకాలు ఈ ఆహారాన్ని స్వీకరించి తమ ఆకలి తీర్చుకుంటాయి.

వేదాలు చెప్పిన ప్రకారం మీరు భూత బలిని మీ ఇంటిలో ఆచరించారంటే, మీ ఇల్లే దేవాలయం అవుతుంది.  సకల దేవతలు మీ ఇంటికి రక్షణగా వుంటారు.  జన్మ జన్మల నుండి మిమ్మల్ని వేధిస్తూ వస్తున్న పాప కర్మలన్నీ భస్మమైపోతుంది.  భూత బలి మీకు అపారమైన పుణ్య బలాన్ని అనుగ్రహిస్తుంది.   ఇలా మీరు సంపాదించుకున్న పుణ్య బలం అక్షయమై జన్మ జన్మలకు మీ కష్టాలన్నీ తొలగిపోయేలా, మీ కోరికలన్నీ నెరవేరేలా మిమ్మల్ని కాపాడుతుంది.

మీరు భూత బలిని పలు విధాలుగా చేయవచ్చు.  మీరు మొదట మంచి నీటితో ప్రారంభించండి.  మీ ఇంటి డాబా పై ఏదైనా ఎతైన ప్రదేశంలో ఆకాశ మార్గాన సంచరించే పక్షుల కొరకు ఒక మట్టి పాత్రలో కానీ ఏదైనా బరువైన పాత్రలో కానీ మంచి నీటిని పెట్టండి. అదే విధంగా నేలపై సంచరించే జంతువుల కొరకు మీ ఇంటి ముందు ఒక సిమెంట్ తొట్టిలో నీటిని ఉంచండి.  మీ ఇంటి మీదగా వెళ్లే జంతువులు తమ దాహార్తిని తీర్చుకుంటాయి.

ఇక ఆహారాన్ని అందించే విషయానికి వస్తే, మీ ఇంటి వేలుపల శుభ్రమైన ప్రదేశంలో రోజూ మీకు వీలైన ఏదైనా ఆహారాన్ని ఉంచండి.  కుక్కలు, పిల్లులు లేదా వేరే ఇతర జంతువులు ఏదైనా ఆ ఆహారాన్ని స్వీకరించి ఆకలి తీర్చుకుంటుంది.  అదే విధంగా కాకులు, పక్షులకు ఎతైన ప్రదేశంలో అవి తినే ఆహరం ఉంచండి.

అలాగే ఆవులు, కోతులు వంటి వాటికి కూడా అవి తినే ఆహారాన్ని మీకు అవకాశం ఉన్నప్పుడల్లా అందించండి.  నిర్మానుష్యమైన ప్రదేశాలలో, చెట్ల పొదల్లో చీమలు మరియు క్రిమి కీటకాల కొరకు ఏదైనా ఆహారాన్ని వెదజల్లుతూ వుండండి.  ఎప్పుడూ ఆహారాన్ని వృధా చేయకుండా మిగులు ఆహారాన్ని జంతువులు, పక్షులు, చీమలు, క్రిమి కీటకాలకు ఏదో ఒక రూపం లో అందిస్తూ వుండండి.

మీ ఇంటి వెలుపల ఆహారాన్ని ఉంచే వెసులుబాటు మీకు లేకపోతే, మీకు తోచిన రీతిలో మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జంతువులకు, పక్షులకు, చీమలకు, క్రిమి కీటకాలకు ఆహారాన్ని అందించండి.  మీరు ఆహారాన్ని, మంచి నీటిని జంతువులకు, పక్షులకు, ఇతర జీవాలకు అందించడాన్ని ఒక దైవ కార్యంగా భావించి భక్తితో చేయండి.  మీరు ఇలా చేసే "భూత బలిని" చూసి పరమేశ్వరుడు ఎంతో సంతృప్తి చెంది, మీ పాప కర్మలను భస్మం చేసి, మీకు అపార పుణ్య బలాన్ని అనుగ్రహిస్తాడని వేదాలు చెబుతున్నాయి.  ఈ విధంగా మీకు లభించే పుణ్య బలం, మీ కష్టాలను తొలగించి మీ తీరని కోరికలను నెరవేరుస్తుంది.

Famous Posts:

Tags: buta bali, lord shiva, butabali temples, butabali means telugu, dharma sandesalu, shivalayam

Comments