శివ ఆరాధనలలో అత్యంత ప్రత్యక్ష ఫలదాయకమైనది పాశుపత మంత్ర ప్రయోగము ఫలితం - Sree Pashu Pata Maha Tantramu

పాశుపత మంత్ర ప్రయోగము. ఫలితం..

శివ ఆరాధనలలో అత్యంత ప్రత్యక్ష ఫలదాయకమైనది ఈ పాశుపత మంత్రము. పూర్వ కాలములో అర్జునునికి కృష్ణుని ద్వారా ఈ పాశుపత మంత్ర విధానము బోధించబడినది. అర్జునుడు దీని ద్వారా శతృంజయమైన పాశుపతాస్త్రాన్ని పొందాడు.

పాశుపతము రుద్ర సంపుటి ద్వారా చేయవలయును. రుద్రమునందలి 169 మంత్రములతో మనకు కావలసిన మంత్రమును సంపుటీకరించి శివునికి అభిషేకం చేయాలి. ఉదాహరణకు ఆరోగ్యాన్ని, ఆయుర్వృద్ధిని ఇచ్చే అమృత పాశుపతమును చేస్తున్నప్పుడు ముందుగా పాశుపత మంత్రమును చెప్పాలి.

ఓం హౌం ఓం జూం ఓం సః ఓం భూః ఓం భువః ఓం స్వః

ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ।

ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయమామృతాత్ ।।

ఓం స్వః ఓం భువః ఓం భూః ఓం సః ఓం జూం ఓం హౌం ఓం స్వాహా।

ఇది సంపుటి చేయవలసిన మంత్రం.

ఈ మంత్రం చెప్పాక రుద్రం లోని ఒక మంత్రం చెప్పాలి.

ఆ తర్వాత మళ్లీ త్య్రంబకం చెప్పాలి.

ఆ తర్వాత మళ్లీ త్య్రంబకం చెప్పి రుద్రంలోని తర్వాతి మంత్రాన్ని చెప్పాలి.

ఇలా 169 రుద్ర మంత్రములను సంపుటీకరిస్తే అది ఒక పాశుపతం అవుతుంది. ఇది గురుముఖతః నేర్చుకొని, మంచి అనుభవజ్ఞులతో చేయించుకొన్నచో మంచి ఫలితములను ఇస్తుంది.

ఈ పాశుపత మంత్రములు ప్రధానముగా 14 రకములు.

1. మహా పాశుపతము

2. మహాపాశుపతాస్త్ర మంత్రము

3. త్రిశూల పాశుపతము

4. ఆఘోర పాశుపతము

5. నవగ్రహ పాశుపతము

6. కౌబేర పాశుపతము

7. మన్యు పాశుపతము

8. కన్యా పాశుపతము

9. వరపాశుపతము

10. బుణ విమోచన పాశుపతము

11. సంతాన పాశుపతము

12. ఇంద్రాక్షీ పాశుపతము

13. వర్ష పాశుపతము

14. అమృత పాశుపతము.

Famous Posts:

Tags : మహా పాశుపత మంత్రం, Sri Pasupata Tantram, Pasupata Tantram Telugu Pdf, Pasupata Homam 

Comments

  1. చెప్పినది అర్థం కాలేదు. ఉదాహణ తో చెప్పగలరు.. ధన్యవాదములు

    ReplyDelete

Post a Comment