Drop Down Menus

అతిశక్తివంతమైన రాజరాజేశ్వరీ దండకం - Sri Rajarajeshwari Dandakam | Most Popular Stotram

అతిశక్తివంతమైన రాజరాజేశ్వరీ దండకం

శ్రీమన్మహారాణి నతేంద్రాణి రుద్రాణి శర్వాణి కల్యాణి దక్షాయణీ శూల పాణి

పృథుశ్రోణి ధూమ్రాక్ష సంహారిణి పారిజాతాంచిత స్నిగవేణీ లసత్కీర వాణీ

భవానీ శివాశాంకరీ రాజరాజేశ్వరీ గౌరి శాకంబరీ కాళి కంకాళి రాజీవనేత్రి

సుచారిత్రి కళ్యాణగాత్రీ మహాదైత్య జైత్రీ నగాధీశపుత్రీ జగన్మాత లోకైక

విఖ్యాత గంధర్వ విద్యాదరాధిత్య కోటిరకోటి స్ఫురద్దివ్యమాణిక్యదీప

ప్రభాత్యుల్ల సత్పాద కంజాత కేయూరహారాంగదాది జ్వల ద్భూషణవ్రాత

కైమారి మహేశ్వరీ నారసింహే రమా వైష్ణవీ భైరవీ దుర్గ కాత్యాయనీ పార్వతీ

నీదు సామర్థ్యమెన్నంగ బ్రహ్మాదులున్ శేషభాషాదులన్ జాలరేనెంతవాడన్ 

ప్రశంసింపనేతబ్ద గజాల సంరక్షణారంభ సంరంభ కేళీ వినోదంబులన్

గల్లి వర్తింతు వెల్లప్పుడో యాదిశక్తి పరంజ్యోతి నారాయణీ భద్రకాళీ శుక శ్యామలా

భ్రామరీ చండికాలక్ష్మీ విశ్వేశ్వరీ రాజరాజేశ్వరీ శాశ్వతైశ్వర్య సంధాయినీ

యంచు నిన్నెంతయు నన్నుత ల్సేయ లోకాళికి నంత తాఖండ

దీర్ఘాయురారోగ్య సౌభాగ్య సంసిద్ధి సంసిద్దిగావింతు ప్రశాంతమున్ రక్త బీజాది

దైత్యేయులన్ ద్రుంచి బృందారకశ్రేణి రక్షింతు నీవెప్పుడున్ నారదా గస్త్య

శాండిల్య మాండవ్య మైత్రేయ జాబాలి కణ్వాది మౌనీంద్రులత్యంత

నిష్టాగరిష్టాత్ములై హృత్సర్రోజంబుల్ ధ్యానముల్ సేయుచున్ జంద్రఖండా

వతంసా భవదిద్దవ్య రూపంబు బ్రహ్మాండభాండంబులున్నిండి వెల్గొందునే 

తత్ప్రపంచంబు సర్వంబు నీవై ప్రవర్తింతువీ సూర్యచంద్రాదులున్ భూజలా

కాశవాతాగ్ని జీవాత్మలున్నీవ నీకంటేవేరైన దింతైనయున్లేదు యుష్మత్కటాక్షా

ర్హులైనట్టి వారల్ కడున్ ధన్యులై మాన్యులై పూజ్యులై గణ్యులై యుందురీ

ధాత్రీలో నేను మూఢుండ గర్వాధిరూఢుండ దుశ్చిత్తుడన్ మత్తుడన్ జ్ఞాన

హీనుండ దీనుండ నే జేయు నేరంబుల గాచి రక్షింపగా భారమే తల్లి

సద్భక్తమందారవల్లీ నమశ్చంద్ర బింబాననోత్కుండలాత్రాత భూమండలా

సూర్య చంద్రోజ్జ్వలాకామదాచండికా నమస్తే నమస్తే నమస్తే నమః

Famous Posts:

Tags: రాజరాజేశ్వరీ దండకం, rajarajeshwari, rajarajeswari stotram, rajarajeshwari stotram telugu, rajarajeshwari dandakam telugu

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.