వారంలో చేయవలసిన పనులు..
ఆదివారం : రాజకీయ వ్యవహారములందు పాల్గొనుటకు, నాయకులన ఆ కొనుటకు, అధికార్లను కలుసుకొనుటకు, క్రయవిక్రయములకు ఆ ప్రయత్నము, అప్పులకై దరఖాస్తు వ్రాయుటకు, కోర్టు వ్యవహారములు నిమిత్తం దావా, అప్పీళ్ళు, ప్లీడర్లను కలుసుకొనుటకు, సాహసం ఆ యుద్ధవిద్యలు నేర్చుకొనుటకు మంచిది.
సోమవారం : క్రొత్తగా ఉద్యోగములో చేరుటకు, కుల పెద్దలను కలుసుకొనుటకు, మధ్యవర్తిత్వములు చేయుటకు, స్త్రీలను కలియుటకు, జల సంబంధ ప్రయాణములు చేయుటకు, గృహసంబంధ పనులు, ఆభరణము ఆధరించటుకు, క్రొత్త పాత్రలు వాడుకొనుటకు, ముత్యములు ధరించ, తెలుపు ధాన్యములు చల్లుటకు, స్తలమార్పులకు మంచిది.
మంగళవారం : సోదరసంబంధ విషయములకు, అగ్నిసంబంధ పనులు చేయుటకు, ఆ భూగృహసంబంధ విషయములు మాట్లాడుటకు, వాహనములు ఖరీదు. చేయుటకు మంచిది. కొన్నింటికి కష్టనష్టములు విరోధం చిక్కులు ! ఆ కలుగును. అశుభమగును. ఎలక్ట్రిక్ పరికరములు వాడుటకు, సాహసం కృత్యములకు మంచిది.
బుధవారం : కోర్టు వ్యవహారములు ప్రారంభించుటకు సమస్త వ్రాతపనులకు, శ్రీ రాయభారము చేయుటకు, , సంగీత, జ్యోతిష, వాస్తు, శిల), గణిత, శాస్త్రములు నేర్చుకొనుటకు, బట్టలు, బంగారం వ్యాపార ప్రారంభములకు, బంగారు ఆభరణములు ధరించుటకు వ్యాపార - వ్యవహారములకు శుభకార్యాలకు మంచిది.
గురువారం : పెద్దవారిని దర్శించుటకు, యాత్రలు వెళ్ళుటకు, క్రొత్త బట్టలు , క క్రొత్త వస్తువులు వాడుటకు, పిల్లలను ఊయలలో వేయుటకు, యితరులకు , ఆ సలహాలు చెప్పుటకు, ధనము నిల్వ చేయుటకు, ఉద్యోగములో చేరుటకు , కవివాహసంప్రదింపులు చేయుటకు, క్రొత్త పుస్తకములు చదువుటకు మంచిది.
శుక్రవారం : నిశ్చయ తాంబూలములు యిచ్చి పుచ్చుకొనుటకు, పెండ్లి ఆ చూపులకు, తీర్థయాత్రలు చేయుటకు, వివాహ విషయములు మాట్లాడు ! ఆటకు, రాజీలు సల్పుటకు, నూతన వాహనములు ఉపయోగించుటకు, స్త్రీ పురుషులు రతి క్రీడలలో పాల్గొనుటకు, విలాసవంతమైన ఖర్చులు , ఆ చేయుటకు అన్నింటికీ మంచిది.
శనివారం : ఏ విధమయిన శుభకార్యములు చేయరాదు. మరణసమయంలో పరామర్శించుటకు, సేవకా వృతినందు ప్రవేశించుటకు, తైలాభిషేకం చేయించుటకు, యినుము, మినుములు, నువ్వులు, నూనె వంటి వ్యాపార ప్రారంభములకు మంచిది. మిగిలిన ఏ కార్యములు చేయుటకు మంచిది కాదు. యిబ్బందులు కలుగును.
Famous Posts:
Tags:వారం రోజులు, Sunday, Monday, Tusday, Wednesday, Thursday, Friday, Saturday, Weekly Days, Things