వేంకటేశ్వర స్వామిని ఇలా పూజిస్తే అష్టైశ్వరాలు మీ సొంతం ! If you worship Lord Venkateswara like this, Ashtaiswaras are yours

వేంకటేశ్వర స్వామిని ఇలా పూజిస్తే అష్టైశ్వరాలు మీ సొంతం !

కలియుగ దైవం.. సాక్షాత్తు నారాయణుడే కలియుగంలో భక్తులను కష్టాల నుంచి కాపాడటానికి అర్చితామూర్తిగా శ్రీ వేంకటేశ్వరుడిగా అవతరించాడు. ఆ శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు ఏదీ అంటే పురాణాల ప్రకారం శనివారం.

అందుకే శనివారం నాడు శ్రీవారికి విశేష పూజలు చేస్తుంటారు. ఆ రోజు గోవిందుడికి పూజలు చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. శనివారం ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి తిరునామాన్ని నుదుటిన ధరించాలి. పూజ గదిలో వేంకటేశుని ప్రతిమ లేదా విగ్రహం లేదా ఫొటోను ఉంచి సాక్షాత్తు ఆ శ్రీహరిగా భావించాలి. దీపాలను శుభ్రం చేసుకుని.. పువ్వులతో స్వామివార్ల పటాన్ని అలంకరించుకోవాలి. పూజగది, ఇంటి ముందు రంగవల్లికలు తప్పనిసరిగా ఉండితీరాలి.

Also Readవెంకటేశ్వరునికి ఈ విధంగా ముడుపు వేస్తే..కుబేర కటాక్షమే..

స్వామిని తులసి దళాలతో అర్చన చేయాలి. తర్వాత ధూపదీపనైవేద్యాలను సమర్పించుకోవాలి. పాలు, పండ్లు, పాయసం, కలకండ, చక్కెర పొంగలి,పులిహోర వంటివి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. శ్రీ వేంకటేశ్వరస్వామి మహాత్మ్యంతో కూడిన పుస్తకాలను వాయనం ఇవ్వాలి. పూజ చేసేటప్పుడు “ఓం నమో నారాయణా” అనే మంత్రాన్ని జపించాలి. అలాగే సాయంత్రం వేళ కూడా ధూపదీపాలతో స్వామివారిని పూజించాలి. బియ్యం పిండితో చేసిన ప్రమిదలో దీపం వెలిగించాలి. ఈ బియ్యం పిండి దీపం కొండెక్కక ముందే చక్కెర పొంగలి, గారెలు నైవేద్యంగా సమర్పించాలి.

కర్పూర హారతి ఇవ్వాలి. ఒంటి పూట భోజనం చేయాలి. సాయంత్రం దీపారాధన, స్వామి నామాలను పారాయణం చేయాలి. ఆరోగ్యం సహకరించినవారు నేలపై చాప వేసుకుని నిద్రించాలి. శనివారం మాంసహారం, మద్యంలకు దూరంగా ఉండాలి. ఇలా శనివార నియమాలను పాటిస్తే తప్పక స్వామి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు పేర్కొన్నాయి.

Famous Posts:

Tags: వేంకటేశ్వర స్వామి, అష్టైశ్వరాలు, Venkateswara swamy, Venkateswara swamy pooja, Venkateswara swamy pooja vidhanam in telugu, govinda, venkatesa, tirumala

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS