Drop Down Menus

మానవులలో ఉండే ఐశ్వర్యవంతుల లక్షణలు & స్వభావాలు | Characteristics and nature of rich people

నవనిధుల, ఐశ్వర్యవంతుల లక్షణ, స్వభావాలు..

నైమిషారణ్యంలో సూతమహర్షి అనుగ్రహభాషణం (శివాది దేవతలకు విష్ణు భగవానుని పురాణోపదేశంలాగే) కొనసాగుతోంది.

"మునులారా! విష్ణుభగవానుని ద్వారా అష్టనిధులను గూర్చి తెలుసుకొన్న బ్రహ్మదేవుడు దేవతలకా విషయాన్ని గూర్చి చెప్పాడు. మేము మా గురుదేవుల ముఖతః విన్నాము.

పద్మ, మహాపద్మ, మకర, కచ్ఛప, ముకుంద, కుంద (నంద), నీల, శంఖ అనేవి అష్టనిధులు. మిశ్ర అను తొమ్మిదవ నిధితో కలసి ఇవి నవనిధులైనాయి.

మానవులలో కొందరి వద్ద ఈ నిధులుంటాయి. ఏ నిధి వున్న వానికెటువంటి లక్షణాలుంటాయో చూద్దాం.

పద్మనిధి లక్షణాలుండే మనిషి సాత్వికుడూ, దయగలవాడూ, అయివుంటాడు. ఈయన బంగారం, వెండి వంటి విలువ గల ధాతువులను సంపాదించి యతులకూ, దేవతలకూ, యాజ్ఞికులకూ వాటిని దానంగా ఇస్తుంటాడు. మహాపద్మ చిహ్నంతో లక్షితుడైన వ్యక్తి కూడా తాను సంపాదించిన ధనాదులను ధార్మికులైన జనులకు దానం చేస్తుంటాడు. మొత్తానికి పద్మ, మహాపద్మనిధి సంపన్నులు సాత్వికులు.

మకరనిధి సంపన్నులు ఖడ్గ, బాణ, కుంతాదులను సంపాదిస్తుంటారు. వారు రాజులతో స్నేహం చేస్తుంటారు. శ్రోత్రియ బ్రాహ్మణులకు దానాలిస్తుంటారు. ఎల్లపుడూ యుద్ధతత్పరులై వుంటారు. యుద్ధాల వల్ల ద్రవ్య సంపాదన చేస్తారు.

కచ్ఛపనిధి లక్షణాలున్న వ్యక్తి తామసగుణాలను కలిగివుంటాడు. ఎవరినీ నమ్మడు. సంపద బాగానే వున్నా తానూ అనుభవించడు. ఎవరికీ దానమూ చేయడు. ఏ రహస్య ప్రదేశంలోకో ఏకాంతంగా పోయి తన సంపదనంతటినీ భూమిలో పాతి వుంచుతాడు.

ముకుంద నిధి లక్షణాలున్నవాడు రజోగుణ సంపన్నుడై వుంటాడు. రాజ్య సంపాదన, విస్తరణేచ్ఛలను కలిగివుంటాడు. భోగాలను బ్రహ్మాండంగా అనుభవిస్తాడు. గాయకులనూ, వేశ్యాదులనూ పోషిస్తుంటాడు.

నందనిధీశునికి రాజస తామస గుణాలు రెండూ వుంటాయి. తన వర్ణం వారికి ఆధారభూతుడై వుంటాడు. ఎవరైనా పొగిడితే పొంగిపోతాడు. బహుపత్నీవ్రతుడై వుంటాడు. మిత్రులను మార్చేస్తూ వుంటాడు.

నీలనిధి చిహ్నాలతో సుశోభితుడైన నరుడు సాత్త్విక తేజంతో విరాజిల్లుతుంటాడు.

వస్త్ర, ధాన్యాదులను బాగా సంపాదించి తటాకాది నిర్మాణాలను గావించి జాతికి అంకితం చేస్తుంటాడు. జనహితం కోరి మామిడి వంటి ఫలవృక్షాల తోటలను పెంచుతాడు. వీని సంపద మూడు తరాల వఱకూ నిలబడుతుంది. (నందనిధీశుని సంపద ఒక తరందాకానే వుంటుంది.

శంఖనిధి లక్షణాలున్నవాడు తాను అన్నిభోగాలనూ అనుభవిస్తాడు. కాని ఆశ్రితులకు ఏమీ పెట్టకుండా చిరుగుపాతల బరువు బ్రతుకుల వారిని చేసి పారేస్తాడు. తన స్వంత పోషణ, భోగాలే చూసుకుంటాడు. వీని సంపద ఒక తరమే నిలబడుతుంది.

మిశ్ర (కలగాపులగపు) నిధుల వారి లక్షణాలు వైవిధ్యభరితాలు.

మునులారా! విష్ణుభగవానుడు శంకరాది దేవతలకు నిధుల, అవి గల నరుల లక్షణాలను పై విధంగా ఉపదేశించాడు.

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు


ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు


ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే


అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

Tags : ఐశ్వర్యవంతుల లక్షణలు, Characteristics and nature of rich people, dharama sandesalu, mans characters, rich people charactristics telugu

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.