Drop Down Menus

శ్యామల నవరాత్రులు అంటే ఏమిటి? శ్యామల నవరాత్రి 2023 తేదీలు - పూజా విధానం - 2023 Magha Gupta Navratri (Shyamala Navratri) Dates

మాఘ మాసం శ్యామలాదేవి నవరాత్రులు 2023 జనవరి 22న ప్రారంభమై జనవరి 30న ముగుస్తాయి..

వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు అంటే ఈ పూజ గోప్యంగా చేసుకోవాలి..

ఈ శ్యామలా నవరాత్రులలో ఏ రోజు ఏ విధంగా పూజ చెయ్యాలి? పూజా విధానాలేంటి? ఈ విషయాలన్నీ మనం ఈ పోస్ట్ ద్వారా తెలుసుకుందాం.

సాధారణంగా ప్రతి సంవత్సరం మనకు హిందూ క్యాలెండర్ ప్రకారం నాలుగు నవరాత్రులు వస్తుంటాయి..

అవి ఏవిటంటే..

1. మాఘమాసంలో  శ్యామలాదేవి నవరాత్రులు.

2. ఆశ్వయుజ మాసంలో శారదా నవరాత్రులు.

3. ఆషాడ మాసంలో వారాహి నవరాత్రులు.

4. చైత్రమాసంలో వసంత నవరాత్రులు.

ఈ శ్యామలా నవరాత్రులనే మాతంగి నవరాత్రులు అని కూడా అంటారు. ఈ నాలుగు నవరాత్రులు ప్రతి సంవత్సరం వస్తాయి..చైత్రమాసంలో వచ్చే నవరాత్రులు,ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రులు మన అందరికి తెలుసు..కానీ మిగిలిన రెండు నవరాత్రులు గుప్త నవరాత్రులు అని అంటారు..

ఈ గుప్త నవరాత్రులంటే సాధారణ పూజలు, వ్రతాలు లాగా అందరిని పిలిచి చేయరు. చాలా రహస్యంగా చేసుకుంటారు. గుప్త నవరాత్రులలో 9 రోజుల పాటు దుర్గా అమ్మవారిని తొమ్మిది రూపాలలో నవదుర్గలుగా అలంకరించి పూజలు చేసారు. దక్షిణ భారతదేశంలో ఈ నవరాత్రులను శ్యామలా నవరాత్రులుగా జరుపుకుంటారు. ఈ నవరాత్రులు చాలా విశేషమైనవి..

ఈ శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఉద్యోగంలో గానీ , వ్యాపారంలో గానీ అభివృద్ది కలుగుతుంది. ఐశ్వర్యం లభిస్తుంది..అంతేకాదు ముఖ్యంగా పెళ్లికాని వారికి పెళ్లి అవుతుందని పురాణాల్లో తెలియజేసారు..

పూర్వం బండాసారుడు అనే రాక్షసుడిని చంపడానికి ఆదిపరాశక్తి శ్రీ లలితాదేవిగా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో శ్యామలాదేవిని సృష్టించి పదహారు  మంది మంత్రులలో ముఖ్యురాలైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుంది...అందువల్లనే శ్యామలాదేవిని మంత్రిని దేవి అనికూడా అంటారు. అంతేకాకుండా దశమాహావిద్యలలో మాతంగి అని కూడా పిలుస్తారు.

ఈ 2023 వ సంవత్సరంలో మాఘమాసం మనకి జనవరి 22 శుద్ధ పాఢ్యమి ఆదివారం నాడు ప్రారంభమై, ఫిబ్రవరి 20 అమావాస్య సోమవారం నాడు ముగుస్తుంది. శ్యామలా నవరాత్రులను మాఘమాస శుద్ధ పాఢ్యమి నుండి నవమి వరకు 9 రోజులపాటు జరుపుకుంటారు..

ఈ సంవత్సరం శ్యామలా నవరాత్రులు జనవరి 22 ఆదివారం మాఘశుద్ధ పాఢ్యమి తిథితో ప్రారంభమై, జనవరి 30 సోమవారం మాఘశుద్ధ నవమి తిథితో ముగుస్తాయి.

శ్యామల నవరాత్రి 2023 తేదీలు

మొదటి రోజు "జనవరి 22, ఆదివారం" నాడు అమ్మవారిని "లఘు శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.

రోజు-1 పూజ: లఘు శ్యామల (Laghu Shyamala)

తేదీ: 22, జనవరి 2023, ఆదివారం

తిథి మాఘ శుక్ల పాడ్యమి

తిథి సమయం జనవరి 22 02:23 AM - జనవరి 22 10:27 PM

రెండవ రోజు  "జనవరి 23, సోమవారం" నాడు అమ్మవారిని

"వాగ్వాధినీ శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.

రోజు-2 పూజ: వాగ్వాధిని శ్యామల(Vagvadini SyAamala)

తేదీ 23, జనవరి 2023, సోమవారం

తిథి మాఘ శుక్ల విధియా

తిథి సమయం జనవరి 22 10:27 PM – Jan 23 06:43 PM

మూడోరోజు "జనవరి 24 , మంగళవారం" నాడు అమ్మవారిని "నకుల శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.

రోజు-3 పూజ: నకుల శ్యామల (Nakuli Syamala)

తేదీ 24, జనవరి 2023, మంగళవారం

తిథి మాఘ శుక్ల తదియా

తిథి సమయం జనవరి 23 06:43 PM – Jan 24 03:22 PM

నాల్గవ రోజు "జనవరి 25, బుధవారం" నాడు అమ్మవారిని "హాసంతి శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.

రోజు-4 పూజ: హసంతి శ్యామల (Hsanti Syamala)

తేదీ 25, జనవరి 2023, బుధవారం

తిథి మాఘ శుక్ల చవితి

తిథి సమయం జనవరి 24 03:22 PM – Jan 25 12:34 PM

ఐదవ రోజు "జనవరి 26, గురువారం" నాడు అమ్మవారిని "సర్వసిద్ధి మాతంగి" రూపంలో పూజిస్తారు.

రోజు-5 పూజ: సర్వసిద్ది మాతంగి (Sarvasiddhi Matangi)

తేదీ 26, జనవరి 2023, గురువారం

తిథి మాఘ శుక్ల పంచమి

తిథి సమయం జనవరి 25 12:34 PM - జనవరి 26 10:28 AM

ఆరవ రోజు "జనవరి 27, శుక్రవారం" నాడు అమ్మవారిని "వాస్యమాతంగి" రూపంలో పూజిస్తారు.

రోజు-6 పూజ: వాస్య మాతంగి (Vasya Matangi)

తేదీ 27, జనవరి 2023, శుక్రవారం

తిథి మాఘ శుక్ల షష్ఠి

తిథి సమయం జనవరి 26 10:28 AM - జనవరి 27 09:10 AM

ఏడవ రోజు "జనవరి 28, శనివారం" నాడు అమ్మవారిని "సారికా శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.

రోజు-7 పూజ: సారిక శ్యామల (Sarika Syamala)

తేదీ 28, జనవరి 2023, శనివారం

తిథి మాఘ శుక్ల సప్తమి

తిథి సమయం జనవరి 27 09:10 AM - జనవరి 28 08:43 AM

ఎనిమిదవ రోజు "జనవరి 29, ఆదివారం" నాడు అమ్మవారిని "శుక శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.

రోజు-8 పూజ: శుక శ్యామల (Suka Syamala)

తేదీ 29, జనవరి 2023, ఆదివారం

తిథి మాఘ శుక్ల అష్టమి

తిథి సమయం జనవరి 28 08:43 AM – Jan 29 09:05 AM

తొమ్మిదవ రోజు "జనవరి 30, సోమవారం" నాడు అమ్మవారిని "రాజమాతంగి లేదా రాజశ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.

రోజు-9 పూజ: రాజ మాతంగి / రాజ శ్యామల (Raja Syamala)

తేదీ 30, జనవరి 2023, సోమవారం

తిథి మాఘ శుక్ల నవమి

తిథి సమయం జనవరి 29 09:05 AM - జనవరి 30 10:11 AM

శ్యామలాదేవికి నిత్యపూజాతో పాటు మాతంగి శ్యామల అష్టోత్తరం, శ్యామల షోడశోపచార నామాలతో కుంకుమార్చన చేసుకోవాలి. వీలైన వారు మాతంగి యొక్క స్తోత్రాలు, హృదయ కవచం, సహస్రనామాలు మొదలగువాటిని పారాయణ చేస్తు పూజలు చేసుకోవాలి.

ఎరుపు రంగు పూవులతో అమ్మవారికి అలంకరణ చేసి , పాయసాన్ని ప్రసాదంగా నివేదించాలి..వీలైతే ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి..

> శ్యామలా నవరాత్రులు పూజా విధానం?

అత్యంత శక్తివంతమైన శ్రీ శ్యామలా  దేవి దండకం

Tags: శ్యామలా దేవి నవరాత్రులు, శ్యామలా దేవి, Sri Shyamala Devi Navratri, Magha Gupta Navaratri, Shyamala navaratri 2023 dates, Shyamala Navaratrulu dates, Navaratrulu pooja, Dasami, syamala devi dandakam, Shyamala devi pooja telugu

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.