Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

దిష్టిని తొలగించే 'శుభదృష్టి గణపతి'ని ఏ దిక్కులో ఉంచాలి? In which direction should the 'Shubadrishti Ganapati' which removes Dishti be placed?

దిష్టిని తొలగించే... 'శుభదృష్టి గణపతి'

ఈ ''శుభదృష్టి గణపతి'' దివ్యరూపాన్ని ఇంటిలో వుంచుకుని నిత్యం పూజించడం ద్వారా ఇంట్లోని యావన్మంది గృహసభ్యులుపై ప్రసరించే దిష్టి యొక్క దుష్ప్రభావం సూర్యరశ్మి సోకిన మంచులా కరిగిపోతుంది.

కీడు కలిగించే చెడు దృష్టిని ''దిష్టి'' అంటారు.

దీని గురించి ఒక నానుడి కూడా మనకు తెలిసిందే.

''నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది'' అంటారు.

దీని అనుభవం పొందిన వారికి దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుస్తుంది.

దృష్టి అంటే చూపు. మనం చూసేది. సహజంగా దేనినైనా చూడటం వలన హాని ఉండదు. కానీ ఈర్ష్యా ద్వేషాలతో చూసే చెడు దృష్టి చాలా హాని చేస్తుంది.

ఆ చెడుదృష్టి తాకే మనిషినైనా, మరిదేనినైనా మాడి మసి చేస్తుంది. పిడుగు పడినపుడు చెట్లు ఎలామాడిపోతాయో, అట్లే ఈ చెడు దృష్టి ప్రభావం వుంటుంది. అనుభవంలో ఇది చాలామందికి తెలిసిన సత్యం.

ఈ వైజ్ఞానిక యుగంలో అనేక భయంకరమైన వ్యాధులను నయం చేసేందుకు ఎన్నో కొత్త కొత్త మందులు కనిపెట్టడం జరిగింది. జరుగుతోంది కూడా. కాని ఈ దిష్టి దుష్ప్ర భావాన్ని అణచి వేసేందుకు ఏ వైజ్ఞానికుడు ఏ విరుగుడు కనిపెట్టలేకపోయాడు. కనీసం ఈ విషయమై ఎలాంటి పరిశోధన చేయనులేదు.

కానీ దిష్టిని సమూలంగా నాశనం చేసి ప్రపంచాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. మహ శ్రేష్ఠుడైన అగస్త్య మహాముని దీనికి తగిన పరిహారం ఒక శక్తి అని ఆ మహాశక్తి పేరు సర్వశక్తి వంతుడైన ''శుభదృష్టి గణపతి'' అని కనుగొన్నాడు.

అశుభ దృష్టి అయిన దిష్టి రాక్షసుని సంహరించగల ఒకే ఒక్క దైవశక్తి మహాగణపతి యొక్క అనేక రూపాలలో 33వ రూపమే ఈ ''శుభదృష్టి గణపతి''.

ఈ శుభదృష్టి గణపతి యొక్క రూపం చాలా విచిత్రంగా వుంటుంది. శ్రీ మహావిష్ణువు తర్వాత శంఖు, చక్రాలను ధరించిన దైవశక్తి.

శ్రీమహేశ్వరునివలె ఈయన త్రినేత్రుడు. త్రిశూలధారిగా ఈయన జగన్మాత యొక్క అంశం. ఇతర దేవతల వలె అనేక ఆయుధాలను ధరించి, సింహమును వాహనంగా చేసుకుని వుంటాడు. మూషికము కూడా ఈయన పాదాల చెంత వుంటుంది.

మహా పరాక్రమశాలి రూపంతో ఈ మహాగణపతి పూర్ణ వికసిత పద్మంలో విజయోత్సాహ వీరునిలా నిలబడి వుంటాడు. తొమ్మిది నాగదేవతలు ఈయన తలచుట్టూ తిరిగి వుంటారు.

ప్రజ్వలించు అగ్ని జ్వాలలో ఏభై ఒక్క నేత్రాలతో తన సాధారణ స్వరూపానికి విరుద్ధంగా తన విశ్వరూపంతో రుద్ర స్వరూపుడు ''శుభదృష్టి గణపతి"గా ఉద్భవించుట జరిగింది.

సర్వజనులకు మేలు చేకూర్చే ఈ శుభదృష్టి గణపతి ఒక్కడే దిష్టి అనే దృష్టిని సంహరించి.. సర్వజనాలను రక్షించి, శుభం, సుఖశాంతులు సమృద్ధిగా అందిస్తాడు.

ఈ ''శుభదృష్టి గణపతి'' దివ్యరూపాన్ని ఇంటిలో వుంచుకుని నిత్యం పూజించడం ద్వారా ఇంట్లోని యావన్మంది గృహసభ్యులుపై ప్రసరించే దిష్టి యొక్క దుష్ప్రభావం సూర్యరశ్మి సోకిన మంచులా కరిగిపోతుంది.

ఈ శుభదృష్టి గణపతిని కంపెనీలు, ఫ్యాక్టరీలు, ఆఫీసులు, దుకాణాల్లో పూజించడం వల్ల దుష్ట శక్తుల ప్రభావాలు తొలగి మంచి లాభాలు, అభివృద్ధి చేకూరుతుంది. ప్రతీ ఒక్కరూ ఈ శుభదృష్టి గణపతిని ఆరాధించాలి.

గృహంలో ఈ శుభదృష్టి గణపతి పటాన్ని గోడపై ఉత్తరదిశ చూసేలా తగిలించాలి. పూజాగదిలో కానీ, ఇంటికి వచ్చే అందరి దృష్టి ఆకర్షించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.

ఈ శుభదృష్టి గణపతి శత్రువులను సంహరించి, యుద్ధరంగం నుంచి వచ్చిన విజేతలా, విజయలక్ష్మి వరించిన వీరునిగా సమర రూపంతో విజయోత్సాహంతో దర్శనమిస్తాడు.

Famous Posts:

వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.

శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు

శివ గుణాలు లోకానికి సందేశాలు

భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?

కూతురా కోడలా ఎవరు ప్రధానం...? 

సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?

కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?

Tags: శుభదృష్టి గణపతి, Shubadrishti Ganapati, Subha Drishti Ganapathi Telugu, Drishti Ganesha for Entrance, Drishti Ganapathi Benefits, Drishti Ganapathy Vastu

Comments