Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ప్రాచీనకాలం నాటి కోరికలు తీర్చుకొనే "కామధేనువు యఙ్ఞాలు" | Fulfilling the wishes of ancient times Kamdhenu Maha Yagna

ప్రాచీనకాలం నాటి కోరికలు తీర్చుకొనే "కామ్య యఙ్ఞాలు"

కోరికలను వదులుకోకూడదు. వదులుకోవలసినవి కోరికల రూపాన్ని, ఆ కోరికలు తీర్చుకోవడానికి నీచ పద్ధతులను అనుసరించడాన్ని. తన హితంతో పాటు ఇతరులు హితాన్ని కూడ సాధించేవే ఉత్తమమైన కోరికలు. అలాంటి కోరికలను తీర్చుకోవడానికి అత్యుత్తమ సాధనం యజ్ఞం. మన మహర్షులు తమ జీవితాలను ధారపోసి కనుగొన్న సాధనం, తమ దివ్యదృష్టితో దర్శించిన సాధనం యజ్ఞం.

కామ్య యజ్ఞం (ఒక ప్రత్యేక కోరికను తీర్చుకోవడానికి చేసే యజ్ఞం) అందుకు అన్ని విధాలా సమర్థమైనది. ఆశించిన ఫలితాలను సాధించేందుకు అవసరమైన స్పందనలనూ, వాతావరణాన్ని యజ్ఞం ఉత్పత్తి చేస్తుంది. కోరుకున్న ఫలితాలు అక్కడికక్కడ అప్పటికప్పుడు వచ్చినట్లు పలుమారులు కనుగొనబడింది. కామ్య యజ్ఞములను నిర్వహించే వివిధ విధానాలు తెలిసిన అగ్నిహోత్రులు ప్రాచీన కాలంలో ఉండేవారు. ఉపద్రవాల నివారణకూ, అద్భుత విజయాల సాధన ప్రక్రియను ప్రారంభించడానికీ వారా విధానాలను ఉపయోగించేవారు.

నిత్యమూ యజ్ఞ యాగాదులు జరిగేచోట, ఆవు నెయ్యి ఇతర సమిధలతో కాలి ఆవిరి అయ్యిన చోట రేడియోధార్మిక పదార్థాల యొక్క విషపు గాలుల యొక్క ప్రభావం నామమాత్రం లేదా అసలు ఉండదని రష్యన్ శాస్త్రజ్ఙ్యులు డా శిరోవిచ్ తమ పరిశోధనలో తెలిపి నిరూపించారు.

మనవాళ్ళు చెప్తే నమ్మని మనవారు ఇతరులు చెప్పినా కొన్ని సార్లు సనాతన ధర్మ గొప్పదనాన్ని ఒప్పుకోలేరు. ఈ విషయం 1980వ దశకంలో జరిగిన అత్యంత ఘోర ప్రమాదమైన బోపాల్ గ్యాస్ విష వాయువులు, రేడియోధార్మికశక్తిల వలన ఆ ప్రాంత చుట్టూ ఐదారు మైళ్ళ వరకూ అత్యంత ఉపద్రవంతో కూడిన వ్యాధులు సోకాయి, ఎందరో చనిపోయారు, కొందరికి చర్మం కాలిపోయింది, ఇప్పటికీ ఆ ప్రాంతం వారిలో కొంతమందికి ఆ రసాయనాల వల్ల కలిగిన రోగాలను పోగొట్టుకోలేని స్థితిలో ఉన్నారు.

ఇంత అత్యంత దారుణ బాధాకర విపత్కర పరిస్థితులలో ఈ ప్రమాదం సంభవించిన కర్మాగారానికి ఒక మైలులోపు ఉన్న రెండు కుటుంబాలకు మాత్రం ఎటువంటి హానీ జరగలేదు, ఎవరి ప్రాణాలకీ ముప్పు కలగలేదు, కనీసం ఎవరూ అనారోగ్యం పాలు కాలేదు. కారణం ఈ రెండు కుటుంబాలు నిత్యాగ్నిహోత్రీకులు అగ్ని హోత్రం లో రోజూ ఆజ్యం వేసి హవిస్సులర్పిస్తారు. వారి పేర్లు వివరాలతో సహా ఆంగ్ల దిన పత్రిక "ద హిందూ" 4-May-1985 నాడు "Vedic way to Beat Pollution" అన్న శీర్షికన ఈ కథనాన్ని ప్రచురించింది. ఆ ఇద్దరు ఇంటి యజమానులు శ్రీ సోహన్లా ల్ ఎస్.ఖుశ్వాహ, శ్రీ ఎమ్ ఎల్ రాథోర్ గార్ల పేర్లను ప్రస్తావిస్తూ ఆ ఆర్టికల్ ప్రచురించబడింది.

సనాతన ధర్మంలో ఏ కార్యం చేసినా ప్రకృతి ప్రసాదాన్ని చెడగొట్టుకునేలా ఉండవు  అన్నీ ప్రకృతికి అనుగుణంగానే చేయబడతాయి, ప్రకృతి యొక్క మహర్షులు ఎన్నో సందర్భాలలో 'పరోపకారార్థమిదం శరీరమ్' అని చెప్పారు. చెప్పడమేకాదు, ఆచరణాత్మకంగా చేసి చూపించారు. బహుశా అందుకే కావచ్చు మహర్షులకు వాక్ శుద్ధి వుండేది. వారు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఇతరుల కోసం ఎంతో కొంత చేసేవారు. చెప్పినదే పాశ్చాత్య ఇతర దేశాల శాస్త్రవేత్తలూ తమ పరిశోధనల చేత నిర్ధారించారు. ఐనప్పటికీ వీటి మీద అధ్యయనం చేసే వైపుగా కానీ, చక్కని ప్రచారం కల్పించడం కానీ మనవారికి చేయడం చేతకాదు.

ఏది ఏమైనప్పటికీ... మన సనాతన ధర్మపు విలువలను నిత్య విధులను పట్టుకుని నిత్యాగ్నిహోత్రీకులై భోపాల్ గ్యాస వంటి దురదృష్టకర ప్రమాదాన్ని తేలికగా ఎదుర్కుని మన వైదిక సంస్కృతి గొప్పదనాన్ని చాటిని ఆ ఇద్దరు కుటుంబీకులకు వారి వంశానికి ఆ పరాదేవత గోమాత అనుగ్రహం ఎప్పటికీ ఉండుగాక అదే ధృతి, ధర్మమునందు నిర్భయంగా చరించే శక్తి మనకు అనవరతమూ ఉండుగాక. 

ప్రతి మనిషికీ ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. నిజమే కానీ, కేవలం మన కోసమే మనం బ్రతకడంలో అర్ధం లేదు. తోటివారి శ్రేయస్సును కూడా కొంచెం దృష్టిలో ఉంచుకోవాలి. అందరూ బాగుంటేనే, మనమూ బాగుంతామని గుర్తించి, గుర్తుంచుకోవాలి. .

మహర్షులు మాట్లాడేది తప్పకుండా జరిగేది. సత్ప్రవర్తన, సత్యవాక్కుల మహత్తు అది. మహర్షులు వివిధ ప్రయోజనాల కోసం రకరకాల హోమాలు చేసేవారు. తమ ఆశయాలను నేరవేర్చుకునేవారు. ఇక్కడ గమనించవలసింది ఏమంటే మహర్షుల కోరికలన్నీ నేరుగా కానీ, అంతర్గతంగా కానీ ప్రజల కోసమే ఉద్దేశించి వుండేవి. అంటే లోక కళ్యాణం కోసం అన్న మాట!

ఆమధ్య శ్రీశైలం దగ్గర జరిగిన హోమం సందర్భంగా ఆకాశంలో పెను పరిమాణంలో పెద్ద శిల నదీ జలాల్లో పడటం, జాలరులు తాటి చెట్టు ఎత్తున పైకి లేవటం పేపర్లలో కూడా వచ్చింది. హోమాల్లో ఎన్నో రకాల సమిధలు వాడవలసి వుంటుంది. ఒక్కో సమిధ ఒక్కో గ్రహానికి సంబంధించినదై వుంటుంది. అంటే అన్ని గ్రహాలూ సమతుల్య స్థితిలో వుంటేనే సృష్టి సక్రమంగా వుంటుంది.

కొన్నిసార్లు వాతావరణం సానుకూలంగా ఉండదు. వ్యాధులు సోకటం, వర్షాలు సక్రమంగా పడకపోవటం లాంటివి జరుగుతాయి. ఏ ఒక్క గ్రహానికి సంబంధించిన శక్తి (ఎనర్జీ) భూమిమీద తక్కువగా వున్నా అసమతుల్యతలు ఏర్పడతాయి. అందుకే ఆయా గ్రహాలకు సంబంధించిన మూలికలు, ధాన్యాలతో, ఇతర వస్తువులతో హోమం చేస్తారు. స్థూలంగా ఇదీ హోమం చేయటంలో ఉద్దేశ్యం.

హోమ ఫలాలు సమిష్టిగానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా అందుకునే విధంగా జ్యోతిష్యవేత్తలు కొన్ని సూచనలు చేశారు. ఎవరైనా ఒక వ్యక్తిపై నవగ్రహాలలో ఏదో ఒక గ్రహ ప్రభావం తక్కువగా వుంటే దానికి సంబంధించిన రంగంలో లేదా విషయంలో ఆ వ్యక్తికి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఏ వ్యక్తి అయితే వ్యతిరేక ఫలితాలను అనుభవిస్తున్నాడో ఆ వ్యక్తి ఇంట్లో హోమం చేయిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి. సూర్య గ్రహ ప్రభావం బాగా తగ్గిపోయి, అదే సమయంలో ఇతర గ్రహాలు కూడా అననుకూలంగా మారితే, ఆ వ్యక్తి అకాల మృత్యువాతన పడవచ్చు లేదా ఆరోగ్య పరంగా తీవ్ర నష్టం జరగవచ్చు. దీనిని నివారించేందుకు సూర్యగ్రహానికి సంబంధించిన శాంతి చేయమని సూచిస్తారు.

తరచుగా హోమాలను చేసినట్లయితే ఏ రకమైన ప్రమాదాలు, ఇబ్బందులు ఎదురుకావు. హోమాలలో రకరకాల మూలికలు వాడతారు. శని గ్రహం అనుకూలత కోసం శమీ వృక్ష సమిధను, రాహువు కోసం గరిక ఉపయోగిస్తే, సూర్యానుగ్రహం కోసం అర్క సమిధను ఉపయోగిస్తారు. కేతు గ్రహ ఉపశాంతికోసం దర్భను ఉపయోగిస్తారు. ఆయుర్వేదం ప్రకారం అర్కలో కుష్టు వ్యాధిని నయం చేసే శక్తి వుంది.

శరీరంలో ఉత్పన్నమయ్యే వివిధ రకాల దోషాలను పోగొట్టగలిగే శక్తి ఈ మూలికకు వుంది. అలాగే చంద్రగ్రహ శాంతి కోసం మోదుగను వాడతారు. అటు వైద్యపరంగా చూస్తే జీర్ణ వ్యవస్థను అద్భుతంగా పునరుజ్జీవింప చేసే శక్తి మోదుగకు వుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. రావి చెట్టు కలపను గురు గ్రహోపశాంతి కోసం ఉపయోగిస్తారు.ఇది వివిధ కఫ దోషాలను రూపుమాపుతుందని ఆయుర్వేదంలో వుంది.

హోమంవల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా మన ఆరోగ్యానికి. పరోక్షంగా నవగ్రహాలపై ప్రభావం చూపుతుందని అర్థం అవుతుంది. మరో ముఖ్య సంగతి ఏమంటే, హోమ క్రమం గురించి క్షుణ్ణంగా తెలిసినవారు హోమం చేస్తేనే హోమ ఫలం అందుతుంది.

Famous Posts:

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే


అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం


అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం


ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే


గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

Tags: యఙ్ఞాలు, యజ్ఞం - హోమం, గోమాత,కామధేనువు,  yagnam, gomata, kavadenuvu yagnam, yagnalu type, yagnam telugu, homam telugu, homam

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు