Drop Down Menus

స్త్రీల వ్యాధులకు చికిత్స - కొన్ని ప్రత్యేక ఔషధాలు..|| Treatment of diseases of women - some special medicines

స్త్రీల వ్యాధులకు చికిత్స - కొన్ని ప్రత్యేక ఔషధాలు..

"పరమేశాదులారా! స్త్రీ జననేంద్రియ ద్వారంలోకి అప్పుడే కోసి తెచ్చిన పునర్నవ వేరుని గాని అపామార్గవేరుని గాని దూర్చి ఉంచితే అక్కడి బాధలు పురిటి నొప్పులతో సహా పూర్తిగా నశిస్తాయి.

స్తనాలందలి నొప్పి ఇంద్రవారుణి వేళ్ళను ముద్దగా చేసి రాస్తే నిమ్మళిస్తుంది. మాతులుంగ మూలాలను గర్భవతి మొలచుట్టూ కడితే వేగంగానూ, సుఖంగానూ పురుడు వస్తుంది. కర్పూర, మదనఫల, మధుకల మిశ్రమంతో స్త్రీ జననేంద్రియ ద్వారాన్ని అడపాదడపా నింపుతూ వుంటే ముసలితనమనేది రానేరాదు.

బాలుర నుదుట గోరోచనాన్ని తిలకంగా అద్ది కుష్ఠ, పంచదారలను కలిపిన నీటిని త్రాగిస్తే ఇక వారికి ఏ దోషాలూ అంటవు. ఏ విషాలూ పనిచేయవు. శంఖనాభి, వచకుష్ఠ, ఇనుపరజనుల మిశ్రమాన్ని నిత్యం ధరించే పిల్లలకు ఏ రోగాలూ అంటవు. రావు.

పలాశ, విడంగ, ఆమలక మిశ్రమంలో తేనే ఆవు వెన్నా కలుపుకొని తినే పురుషునికి తెలివితేటలు వెంటనే పెరుగుతాయి. అలా ఒక నెలపాటు త్రాగితే ముసలితనాన్నెలాగూ జయిస్తాడు, మరణాన్ని కూడా జయించినా ఆశ్చర్య పోనక్కరలేదు. ఆమలక చూర్ణాన్ని తేనె, నూనె, వెన్నలతో కలుపుకొని రోజుకి మూడు మార్లు ఒక నెలపాటు నిరంతరాయంగా తినేవాడు నిత్యయవ్వనుడిగా నిలిచిపోవడమే కాక గొప్ప వక్త కూడా కాగలడు. (యవ్వనుడి తప్పనీ ‘యౌవనుడి' అనే వ్రాయాలని పెద్దలంటారు)

శివ, ఆమలక చూర్ణాలను తేనెతో గాని నీటితో గాని కలుపుకొని రోజూ పొద్దున్నే తాగితే ముక్కు, దానితోడి అంగాలు అన్నీ ఎన్నేళ్ళొచ్చినా చెడవు. కుష్ట చూర్ణాన్ని వెన్నతో తేనెతో కలుపుకొని ప్రత్యుదయమూ తాగేవాని శరీరానికి సహజసుగంధమబ్బుతుంది.వేయి సంవత్సరాల వయసు వచ్చేదాకా జీవించగలడు.

మాశ బీజాలను బద్దలు చేసి ఊక లేకుండా చూసి వెన్నలో వేసి వేడి పాలతో కలిపి వుంచి రోజూ ఒకే సమయంలో తేనె, వెన్న, పాలతో కలుపుకొని ఒక వారం రోజులపాటు తింటే మదన కళావీరత్వం విపరీతంగా పెరిగి నూరుగురు మహిళలనైనా 'అందులో" సంతృప్తి పఱచగలిగే శక్తి వస్తుంది. పాదరసాన్ని గంధకంతో ఆముదంతో కలిపి తీసుకుంటే గొప్ప బలశాలులవుతారు. ఓ మహాదేవాదులారా! ఊకను జాగ్రత్తగా వేరు చేసిన మాశబీజాలను శింబి బీజాలతో కలిపి పాలలో ఉడికించి చల్లార్చి అపామార్గ తైలంతో కలుపుకొని తాగినా కూడా వందమంది వనితలను మదనకేళిలో సంతృప్తి పఱచగలిగే జవసత్త్వాలు కలుగుతాయి.

ఇక జంతు వైద్యంలో కొన్ని మెళకువలను చూద్దాం. ఆవు తన దూడపై తానే కోపం తెచ్చేసుకొని దాన్ని తన్నేస్తూ వుంటే, అటువంటి తెగులు పట్టిన ఆవుకి తన పాలలోనే ఉప్పు కలిపి తాగిస్తే ఆ తెగులు నశించి తన దూడను ఇదివఱకు కన్న నెక్కువగా ప్రేమిస్తుంది. కుక్క ఎముకను ఆవు మెడకు గాని గేదె మెడకు గాని కట్టి వుంచితే వాటిని పట్టిన క్రిములన్నీ జారిపోతాయి. వరుణ ఫలరసాన్ని ఏ చతుష్పాదికి పట్టించినా క్రిములన్నీ జారిపోతాయి. జయచూర్ణాన్ని గాయంలో వేస్తే అది మానిపోతుంది. గోవులచేత గజమూత్రాన్ని త్రాగిస్తే వాటి తెగుళ్ళన్నీ కట్టేస్తాయి. ఎద్దులకి మసూర, శాలి చూర్ణాలను పాలతో కలిపి పడితే ఏ జబ్బు రాకుండా వర్ధిల్లుతాయి.

గుఱ్ఱాల జూలులో పుట్టే వరిస్ఫోటమనే రోగం శరపుంఖ పత్రాలను లవణంతో కలిపి వాడితే నశిస్తుంది. అశ్వాలకు తలభాగం (శిరోభాగం) లో పట్టే దురదలు మృతకుమారి ఆకులను లవణముతో కలిపి వాడితే పోతాయి.

పరమేశాదులారా! ఈ మందులను వాడడానికి ముందు వృద్ధులనూ, అనుభవ జ్ఞులనూ సంప్రదించడం శ్రేయస్కరం.

Famous Posts:

పురుషుల అంగాలను బట్టి వారికుండే శుభాశుభ లక్షణాలు.

ఈ శుభలక్షణాలన్నీ వున్న స్త్రీని జాగ్రత్తగా చూసుకుని వివాహం చేసుకోవాలి.

2023 ఏకాదశి ఉపవాస తేదీలు.

మానవులలో ఉండే ఐశ్వర్యవంతుల లక్షణలు & స్వభావాలు

స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము

Tags: స్త్రీల వ్యాధులకు చికిత్స, women's ayurveda, Ayurveda treatments, Ayurveda for Women's Health, Women's Health Issues, Womens Health Problems Telugu, Health Remidies Womens

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments