శివ సహస్రనామ మాహాత్మ్యము
బలసంపన్నులగు దైత్యులు దేవతలను మిగుల పీడింపదొడంగిరి. వారివలన ప్రాప్తించుచున్నట్టి యిడుములను భరింపజాలక దేవతలెల్లరును దామోదరుని శరణువేడిరి.
అంత శ్రీమన్నారాయణుడు రాక్షసులను నిగ్రహింప సమకట్టి యా మహాత్కార్య సాధనమునకు శివానుగ్రహం బత్యంత ప్రధానంబని సంభావించి దేవతల నూరడించి వారలను వారివారి నెలవులకు బంపివైచి, తాను శివానుగ్రహము నార్జింప గోరి కైలాసంబున కరిగి సదాశివునిగూర్చి తపంబొనరింపుచుఁ బార్థివలింగమును మానససరోవరము నందలి సహస్రదళ పద్మములచే నర్చింపదొడంగెను. నిత్యమును పార్థివ లింగమునకు సహస్రపద్మములచే సహస్రనామార్చన చేయుచున్నను సదా శివుని దర్శనభాగ్యము లభింపదయ్యెను.
నారాయణుని యేకాగ్రతను గ్రహించిన సదాశివుండా దామోదరుని బరీక్షింపగోరి యొక దినంబున పూజాపుష్పముల యందొక పుష్పము నదృశ్యము గావించెను. నియమానువర్తియైన విష్ణుభగవానుడొక కమలము లుప్తమగుట యెఱింగి యద్ధానికై ఎంత యత్నించినను లభింపదయ్యెను. దానంజేసి తన నేత్రములను దీసి సహస్రార్చనమును ముగింప సదాశివుండానందభరితుండై సాక్షాత్కరించి యాతని యభీష్టమును వివరింపుమని యడిగెను.
అంత నారాయణుడు “దేవదేవా! జగన్నాటక సూత్రధారీ ! భక్తరక్షా! కరుణాసముద్రా! దేవతల యిడుములను గాంచలేకుంటిని, వారలను రక్కసుల బారినుండి కాపాడుట నా విధ్యుక్తధర్మంబై యున్నయది. వారల విసర్జింపనశక్తుండనై నీ శరణు జొచ్చితిని, దయాంతరంగుడవై నా కోరికను మన్నింపవే! యని ప్రార్థించెను.
శ్లో॥ ఇతిశ్రుత్వావచో విష్ణో | దేవదేవో మహేశ్వరః |
దదౌతస్మై స్వకం చక్రం | తేజోరాశిం సుదర్శనమ్ |
తత్రాప్య భగవాన్విష్ణుః | దైత్యాంస్తాన్ బలవత్తరాన్ ।
జఘానతేన చక్రేణ | ద్రుత సర్వాన్వినాశమ్రమ్ |
జగత్స్వాస్థ్యం పరంలేభే ! బభూపుః సుఖినః సురా |
సుప్రీతః స్వాయుధం ప్రాప్య | హరిరాశీన్మహాసుఖీ ॥
దేవాదిదేవుండగు సదాశివుండు దామోదరుని ప్రార్థనమాలకించి తేజోరాశి యగు సుదర్శనమును తన చక్రమును ప్రదానము గావించెను. ఆ చక్రాయుధముచే బలవంతులగు రాక్షసుల ననాయాసముగా విష్ణుభగవానుడు నిర్జించి దేవతలను రక్షించెను.
దానంజేసి తిరుగ సురులు స్వాస్థ్యమును బడసిరి. ఉత్తమంబగు చక్రాయుధమును పొందిరి. శ్రీమన్నారాయణుండు సంతోషింప పరమేశ్వరుడు విష్ణు భగవానునిగాంచి శ్రీహరీ! నీవొనరించిన సహస్రనామ స్తోత్రము మిగుల పవిత్రంబై యన్నయది. దాని రూపమే ఈ సందర్శనంబని యెఱుంగుము. నీవు పఠియించిన స్తోత్రమునందొక నామమొక్కొక్క రేకుగా నియ్యది యేర్పడియున్నది. ఈ సుదర్శనము ఈ నీ కెల్లపుడు రక్షగానుండగలదు.
నీచే జేయంబడిన మదీయ సహస్రనామంబుల బఠించు మానవులకు సకలాభీష్టములును సిద్ధించును. సకల దోషంబులు, ఆపదలు తొలగించుకొనగోరు వారలు నా రూపమును ధ్యానించి యీ సహస్రనామముల స్మరించునో వారి యాపదలు తొలగి సర్వాభీష్టములును నెరవేరును. విద్యుక్తము నూరుమారులు సహస్రనామార్చనము జేయువారల భయమునెల్ల తొలగిపోవును. సహస్రనామ పఠన ఫలితమున ఆరోగ్యవంతులై విద్యాప్రాప్తిని, నాయందలి భక్తిని, తుదకు నాశివలోకమును పొందగలరని” వచియించి యదృశ్యుండయ్యెను.
అంత నారాయణుడనుదినము సదాశివుని సహస్ర నామార్చనమును గావించుచు సకల లోకములయందును శాంతిని పునరుద్ధరించగలిగిన వాడయ్యెను.
Famous Posts:
> ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు
> ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే
> అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
> 100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
> అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం
Tags: శివ సహస్రనామ స్తోత్రం, Sri Shiva Sahasranama Stotram, Shiva Sahasranamavali in Telugu, Shiva Sahasranama Stotram Lyrics, Shiva Sahasranama Stotram Meaning Telugu, Lord Shiva Stotras
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment