గండకీనది చరిత్ర సాలిగ్రామం ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? Gandakinadi History Saligram Ever heard this name?
గండకీనది చరిత్ర
సాలిగ్రామం ఈ పేరు ఎప్పుడైనా విన్నారా, ఇది ఊరి పేరు కాదు. గ్రామం అస్సలే కాదు. విష్ణువు ఆకారంలో ఉండే చిన్నచిన్న రాళ్లనే సాలి గ్రామం అంటూ ఉంటారు. ఇవన్నీ గుండ్రంగా నున్నగా ఉంటాయి.
తాబేలు ఆకారంలో నోరు తెరుచుకుని ఉంటాయి. లోపల విష్ణువు కనపడతాడు. ఇంత ప్రత్యేకమైన సాలి గ్రామాలు గండకి నదిలోనే లభించడం వెనుక ఒక కథ ఉంది. వాటిపైన కూడా విష్ణువు రూపం ఉటుంది. అయితే ఇవన్నీ కూడా ఒక్క నదిలోనే ఎక్కువగా దొరుకుతాయి. గండకి నది గర్భంలోనే ఇలాంటి రాళ్లు ఎక్కువగా దొరుకుతాయి. వీటిని చాలా మంది పూజగదిలో ఉంచుకుని పూజిస్తుంటారు. వీటికి ఎంతో మహిమ ఉంటుందని భక్తుల నమ్మకం.
గండకీ ఒక వేశ్య..
శ్రావస్తి అనే నగరంలో పూర్వం గండకీ అనే అమ్మాయి ఉండేది. ఆమె అందానికి ఎవరైనా సరే దాసోహం కావాల్సిందే. ఈ గండకీ ఒక వేశ్య. ఎంతోమంది ఆమెతో ఒక్కరాత్రి గడిపితే చాలు అనుకునేవారు..!!
ఒక్కరాత్రి గడిపితే చాలు..
గండకీతో ఒక్కరాత్రి గడిపితే చాలు వాళ్ల తలరాతలు మారిపోయేవి. వాళ్ల అదృష్టాలు మారిపోయేవి. బాగా సంపన్నులుగా, గొప్పవాళ్లుగా మారిపోయేవారు. దీంతో చాలా మంది డబ్బు ఉన్న వాళ్లు కూడా ఆమెను అనుభవించాలనుకునేవారు. అయితే గండకీ మాత్రం అందరినీ తన దగ్గరకు రానిచ్చేది కాదు. చెడ్డ వాళ్లతో అస్సలు గడిపేది కాదు. రోజుకు ఒక్క వ్యక్తితోనే గడిపేది.
భర్తగా భావించి తాను చెప్పే ప్రతి పని చేసేది
తాను మరుసటి రోజు గడపబోయే వ్యక్తితో ముందు రోజు బేరం కుదుర్చుకునేది. ఇక ఆ రోజు మొత్తం అతనే భర్తగా భావించేది. తను ఏది కోరితే అది చేసేది. కేవలం సుఖం అందించడమే కాదు తనను భర్తగా భావించి తాను చెప్పే ప్రతి పని చేసేది. తన వద్దకు వచ్చిన వ్యక్తికి ఏమైనా తట్టుకోలేకపోయేది.
మారువేషంలో బేరం కుదుర్చుకున్నాడు
గండకి గురించి నారాయణుడికి తెలిసింది. ఆమెను పరీక్షించాలనుకున్నాడు. ఒక రోజు ముందు మారువేషంలో వెళ్లి గండకితో బేరం కుదుర్చుకున్నాడు. గండికి కూడా అతను మంచి వాడిలాగా కనిపించాడు కాబట్టి ఒక రోజు ఆయనకు భార్యలా ఉండేందుకు ఒప్పుకుంది. తనకు ముందుగా భార్యలా స్నానం చేసి కడుపు నిండా భోజనం పెట్టమని కోరుతాడు నారాయణుడు.
సరే అని.. గండకి ముందుగా ఆయనకు స్నానం చేయించబోతుంది. బట్టలు తీసి వేస్తే ఒంటినిండా పుండ్లు కనపడ్డాయి. నారాయణుడు అందవికారంగా కనిపించాడు. అయినా కూడా ఆమె శ్రద్ధగా స్నానం చేయించింది. సువాసనలు గుప్పించే సుగంధద్రవ్యాలను గండకి ఆయన్ని పూసింది. కొత్త బట్టలు తొడిగించింది.
పక్క మీదకు తీసుకెళ్తుంది..
తర్వాత తనే వంట చేసి అతనికి వడ్డించింది. అతని చేతులకు మొత్తం పుండ్లు ఉండడంతో సరిగ్గా తినలేకపోతాడు. దాంతో ఆమెనే తినిపిస్తుంది. తర్వాత మిగిలిన అన్నాన్ని ఆమె తింటుంది. తర్వాత అతన్ని పక్క మీదకు తీసుకెళ్తుంది. కానీ ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. బాగా జ్వరం వస్తుంది. అతనికి ఆ రోజు అంతా సేవ చేస్తుంది గండకి. ఆ రోజు రాత్రి అతను చనిపోతాడు.
చితిలోకి దూకుతుంది..
తన సొంత భర్త చనిపోయాడన్నట్లుగా బాధపడుతుంది. భర్తతో పాటు తాను కూడా చితిలో పడుకుని సతీసహగమనం చెయ్యడానికి సిద్ధం అవుతుంది. అందరూ అడ్డుకున్న కూడా వినదు. తన దగ్గరుండే సొమ్మునంతా బీదలకు పంచిపెడుతుంది. తర్వాత శ్మశానంలో చితిలోకి దూకుతుంది.
విష్ణువునే గర్భానా పుట్టాలని కోరుకుంటుంది
అయితే మంటలు ఒక్కసారిగా మల్లె పూల మాదిరిగా మారుతాయి. విష్ణువు ప్రత్యక్షమై నువ్వు చేసే వృత్తిని నిజాయితీగా చేయడం నాకు నచ్చింది అంటాడు. గండకీ సంబరంగా విష్ణువు వైపే చూస్తుంది. నీకు ఏ వరం కావాలో కోరుకో గండకీ అంటాడు విష్ణు మూర్తి. గండకీ విష్ణువునే తన గర్భానా పుట్టాలని కోరుకుంటుంది. సరే నీ కోరిక వచ్చే జన్మలో తీరుతుంది. నీ గర్భంలో ఎప్పుడూ నేను పుడుతూనే ఉంటానంటాడు విష్ణువు.అలా గండకీ అనే వేశ్య గర్భంలోనే మహావిష్ణువు పుడతాడు.
ఈ కారణంగా గండకీ మరు జన్మలో నదిగా పుట్టింది. ఆ నది గర్భంలోనే సాలిగ్రామాలు అంటే విష్ణుమూర్తి రూపంతో ఉండేవి పుడుతూనే ఉన్నాయి. ఇది సాలిగ్రామం, గండకీ కథ.
తులసి శాపం వలన సాలగ్రామంగా మారిన విష్ణువు గండకీకి ఇచ్చిన వరం వలన గండకి నదిలోకి సాలగ్రామ రూపంలో చేరతాడు..
Famous Posts:
> సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు
> ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు
> ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే
> అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
> 100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
Tags: గండకీనది, సాలిగ్రామం, Saligramam, Shaligram Stone, Nepal gifts Shaligram, shaligram god, which shaligram is best, Gandaki nadi, Shaligramam Telugu
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment