రుద్రాక్ష మాలలు ధరించిన వారు పాటించాల్సిన నియమాలు | Rules to be followed by wearers of Rudraksha Malas
రుద్రాక్ష మాలలు ధరించిన వారు పాటించాల్సిన నియమాలు.
రుద్రాక్షలను శివుని ప్రతిరూపాలుగా కొలుస్తుంటారు. రుద్రాక్షలు ధరించడం వలన అనుకున్న పనులు నెరవేరుతాయి. ఎలాంటి కష్టనష్టాలు రావు.
అడ్డంకులు తొలగిపోయి, సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుకే రుద్రాక్ష. మానసిక ఒత్తిడితో, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు రుద్రాక్షలను ధరిస్తే వారి సమస్యలు మటుమాయమవుతాయి.
రుద్రాక్షలను ధరించిన వారు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు..
1. రుద్రాక్షమాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు.
2. రుద్రాక్ష మాలను ధరించి శ్మశానానికి వెళ్లకూడదు.
3. కుటుంబ సభ్యులు అయినప్పటికీ ఒకరి రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు.
4. రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించకూడదు
5. రుద్రాక్షమాలను ధరించి నిద్రపోకూడదు
6. రుద్రాక్షమాలను ధరించి శృంగారంలో పాల్గొనకూడదు.
7. స్త్రీలు రుతుసమయంలో రుద్రాక్షమాలను ధరించకూడదు.
ఏక ముఖి రుద్రాక్ష బహు అరుదైనది. ఈ రుద్రాక్ష ధరించడం వల్ల ఏకాగ్రత కలుగుతుంది, పవిత్ర భావనలు పొందుతారు, దుష్టశక్తుల ప్రభావం తగ్గుముఖం పడుతుంది. సంఘంలో, తన చుట్టూ ఉన్నవారిమధ్య కీర్తి పెరుగుతుంది, ఆర్థిక స్థిరత్వం కలగటానికి దోహదపడి ఉద్యోగ వ్యాపార లేదా సంపాదన అభివృద్ధికి స్థిరీకరణకు కలిగే దోషాలను తొలగించగలిగే శక్తిని బుద్ధిని ఇస్తుంది. కొన్ని రకాల దీర్ఘవ్యాధులు, మానసిక వ్యాధులు తగ్గుముఖం పడతాయి.
Famous Posts:
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
> తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
> సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు
Tags: రుద్రాక్ష మాల, Rudraksha, Rudraksha Mala, Rudraksha Benefits, Rudraksha Mala Telugu,
Rudraksha Tree, Rudraksha mala Rules
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment