శనిత్రయోదశి నాడు శివ ప్రదోషస్తోత్రము పఠించటం మంచిది..| Shiva Pradosha Stotram in Telugu

శనిత్రయోదశి నాడు శివ ప్రదోషస్తోత్రము పఠించటం మంచిది..

జాతక రీత్యా శని బాగాలేని వారు, శని దశ అంతర్దశలు జరుగుతున్న వారు. ఏలిననాటి శని, అష్టమ శని, అర్దాష్టమ శని వలన ఎవరైతే పీడింప బడుతున్నారో అటువంటివారు శనివారం రోజు,శని త్రయోదశి రోజు, శని హోరలో మరియు శని ప్రదోష సమయంలో శివ ప్రదోషస్తోత్రము పఠించటం మంచిది.

శనివారానికి స్థితి కారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి, త్రయోదశికి అధిపతి కామదేవుడు. అంటే శివుడు. అలా శివకేశవుల క్రియలకు శని అధిప తి అయ్యాడు. అందుకే శనిత్రయోదశి శనికి ఇష్టమైన రోజు. త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది. క్షీరసాగర మదనం జరిగి అమృ తం ఉద్భవించిన తరువాత, హాలాహలాన్ని దిగ మింగి తన కంఠంలో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి కృతఙ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్లారు. అది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆ సమయంలో శివుడు ఆనంద తాండవం చేసాడట.ఆ శివ తాండవాన్ని దేవతలందరూ పరవశించి చూస్తూ ఆనందించారని చెప్పబడింది. ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం.

ప్రదోష కాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం. శనివారం నాడు ప్రదోష సమయాన శివ ఆరాధన చేసినట్లయితే కర్మ దోషాలు తొలగి సుఖశాంతులు పొందవచ్చును. శని కర్మకారకుడు, శివుడు సంహార కారకుడు కావున శని ప్రదోష సమయాన శివప్రదోషస్తోత్రము పఠించటం ఉత్తమం.

శివప్రదోషస్తోత్రము:-

కైలాస శైల భవనేత్రిజగజ్జనిత్రీం

గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే

నృత్యం విధాతు మభివాంఛతి శూలపాణౌ

దేవాః ప్రదోష సమయేను భజంతి సర్వే

వాగ్దేవీ ధృతవల్లకీ శతమభోవేణుందధత్పద్మజః

తాలో న్నిద్రకరో, రమా భగవతీ గేయ ప్రయోషాడ్వితా

విష్ణుస్సాంద్ర మృదంగ వాదనపటుర్దేవాస్సమం తాత్‌స్ఖితా

సేవంతే తమనుప్రదోష సమయే దేవంమృడానీపతిమ్‌

గంధర్వ యక్ష పతగోరగ సిద్ధ సాధ్య

విద్యాధరామర వరాప్సర సాంగణాశ్చ

యేన్యే త్రిలోక నిలయాస్సహభూతవర్గాః

ప్రాప్తే ప్రదోష సమయే హరపార్శ్వసంస్థాః

ఓం శనీశ్వరాయ నమః

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు


ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు


ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే


అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

Tags: శివ ప్రదోషస్తోత్రము, శనిత్రయోదశి, Shani Trayodashi, Shani, Pradosha Stotram, Shiva Pradosha Stotram in Telugu, Lord Shiva

Comments