Drop Down Menus

శ్రీకాళహస్తి దేవస్థానం రూమ్స్ ధరలు ఎంతో తెలుసా | Srikalahasti Online Room Booking AC NON AC Rooms Cost

Srikalahasti ONline Room Booking
శ్రీకాళహస్తి దేవస్థానం ఎలా చేరుకోవాలి ? ఆలయం ఏమేమి చూడాలి ? పూజ వివరాలు మరియు దేవస్థానం రూమ్స్ ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం . శ్రీకాళహస్తి వాయు లింగ క్షేత్రం పంచభూత లింగ క్షేత్రాలలో 4 క్షేత్రాలు తమిళనాడు లో ఉంటె ఆంధ్ర లో ఉన్న ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి . శ్రీకాళహస్తి క్షేత్రం లో స్వామి వారి పేరు శ్రీకాళహస్తీశ్వరుడు , అమ్మవారి పేరు శ్రీ జ్ఞాన ప్రసూనాంబ  శ్రీకాళహస్తి అని పేరు ఎందుకు వచ్చిందంటే  శ్రీ అనగా సాలీడు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు ల పేరుతో కాళహస్తిగా ప్రసిద్ధి చెందింది. ఈ మూడు జీవాలకు మోక్షాన్ని ప్రసాదించిన ప్రదేశం మరియు భక్త కన్నప్ప చరిత్ర మనకు తెలుసు కదా భక్త కన్నప్పకు శ్రీకాళహస్తి లో కొండపైన గుడి ఉంది . చాలామంది భక్తులు కొండపైన ఉన్న భక్త కన్నప్ప గుడికి వెళ్తుంటారు.

శ్రీకాళహస్తి క్షేత్రం స్వర్ణ ముఖి నది పక్కన ఉంది. ఈ క్షేత్రం  తిరుపతి కు 40 కిమీ దూరం లో ఉంది. శ్రీకాళహస్తి రాహుకేతు పూజలకు ప్రసిద్ధి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చేస్తారు మీరు టికెట్స్ ఆన్లైన్ లో బుక్ చేయనవసరం లేదు మీరు డైరెక్ట్ గా వెళ్లి తీస్కోవచ్చు 500/- నుంచి టికెట్స్ ధర లు ఉంటాయి పూజ సామాగ్రి ఆలయం వారే ఇస్తారు బయట నుంచి తీస్కుని రానవసరం లేదు.

శ్రీకాళహస్తి లో వసతి కి ఇబ్బంది ఏమి ఉండదు దేవస్థానం వారి రూమ్స్ తో ఆలయం చుట్టూ చాలానే హోటల్స్ ఉన్నాయి . శ్రీకాళహస్తి ఆలయానికి రూమ్ బుకింగ్  ఆన్లైన్ లో చేస్కోవచ్చు . AC రూమ్స్ non AC రూమ్స్ కూడా ఉన్నాయి . ఆన్లైన్ లో ఎన్ని ఉంచుతున్నారు ధరలు ఎంత తెలుసుకుందాం 

Srikalahasti Temple Non AC Rooms 

1) పేరు :  భక్త కన్నప్ప సదన్ 

ఆన్లైన్ లో బుకింగ్ కు ఉంచే AC రూమ్స్ : 3

ధర : 1000/-

2) పేరు :  గంగా సదన్ 

ఆన్లైన్ లో బుకింగ్ కు ఉంచే AC రూమ్స్ : 8

ధర : 999/-

3) పేరు :  శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక గెస్ట్ హౌస్

ఆన్లైన్ లో బుకింగ్ కు ఉంచే AC రూమ్స్ : 8

ధర : 1000

సూట్ రూమ్స్ :

1) పేరు :  కైలాస సదన్   (Block - 3)

ఆన్లైన్ లో బుకింగ్ కు ఉంచే  రూమ్స్ : 8

ధర : 1000/-

2) పేరు :  కైలాస సదన్   (Block - 2)

ఆన్లైన్ లో బుకింగ్ కు ఉంచే  రూమ్స్ : 4

ధర : 1000/-

Sri Kalahasti Room Booking Website :

Official Website : https://www.aptemples.ap.gov.in/en-in/home

srikalahasti temple timings srikalahasti online room booking kalahasti room cost temples guide srikalahasti

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.